మీ ఫోన్‌లో పర్సనల్ డేటా భద్రమేనా? ఈ 8 తప్పులు మాత్రం చేయొద్దు!

మీ ఫోన్‌లో పర్సనల్ డేటా భద్రమేనా? ఈ 8 తప్పులు మాత్రం చేయొద్దు!

8 Mistakes you should avoid on your Smartphone : మీ స్మార్ట్ ఫోన్‌లో పర్సనల్ డేటా భద్రమేనా? ఓసారి చెక్ చేసుకోండి. హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోవచ్చు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్సనల్ డేటా అంటే ఏదైనా కావొచ్చు.. నగదు, ఇన్సూరెన్స్ కార్డు, క్రెడిట్ కార్డులు, పిల్లల ఫొటోలు ఇలా ఏదైనా కావొచ్చు.. చాలామంది తమ వ్యక్తిగత పాస్ వర్డులను మరిచిపోతామని ఫోన్‌లో సేవ్ చేసేస్తుంటారు.

వాస్తవానికి ఇలాంటి పొరపాటు అసలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు. ఎందుకంటే మీ ప్రైవసీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. సైబర్ నేరగాళ్లు వంటి ఎందరో ఆన్ లైన్ లో మీ డేటాను తస్కరించే ముప్పు ఉందని సూచిస్తున్నారు. మీ ఫోన్ లో పర్సనల్ డేటాను స్టోర్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. సాధారణంగా చాలామంది ఈ 7 పొరపాట్లను తెలియకుండానే చేస్తుంటారు. ఫోన్‌లో స్టోర్ చేయడానికి బదులుగా ఎలా పర్సనల్ డేటాను సెక్యూర్ చేసుకోవాలో చూద్దాం..

1. పాస్‌వర్డులు :
పర్సనల్ డేటా.. సెక్యూర్ ఉండాలంటే పాస్‌వర్డ్ తప్పనిసరి. అందుకే ఎప్పుడూ స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోవాలంటారు. ఒకటిసారి ఎక్కువ సార్లు ఒకే పాస్ వర్డ్ కూడా వాడటం మంచిది కాదు. మీ ఫోన్ లో నోట్, డాక్యుమెంట్ లేదా ఏదైనా ఫైల్ ద్వారా డేటాను స్టోర్ చేయడం రిస్క్ అంటున్నారు. ఫోన్ లో స్టోర్ చేసే పర్సనల్ డేటా మొత్తం మెయిల్ అకౌంట్ ద్వారా క్లౌడ్ స్టోర్‌లో స్టోర్ అవుతుంది. అన్ని పాస్ వర్డులను ఆటోఫిల్ ద్వారా స్టోర్ చేయడానికి బదులుగా పాస్ వర్డ్ మేనేజర్ వాడొచ్చు. డాష్ లైన్ లేదా లాస్ట్ పాస్ అనే సెక్యూర్ వంటి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక స్ట్రాంగ్ మాస్టర్ పాస్ వర్డ్ సెట్ చేసుకుని అన్ని పాస్ వర్డులను ఒకేసారి యాక్సస్ చేసుకోవచ్చు.

2. ఫింగర్ ఫ్రింట్ పాస్‌వర్డ్ :
మీ ఫోన్ సెక్యూర్ గా ఉంచుకోవాలంటే.. ఫింగర్ ఫ్రింట్ పాస్ వర్డ్ అసలే వాడొద్దు. ఏదైనా యాప్ కావొచ్చు.. ఏ అకౌంట్లకు కూడా ఫింగర్ ఫ్రింట్ యాక్సస్ చేయొద్దు. కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ ఫింగర్ ఫ్రింట్ ఇతరులు యాక్సస్ చేసే అవకాశం ఉంటుంది. మీ ఫింగర్ ఫ్రింట్ తెలుసుకునేందుకు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం లేకపోలేదు. ఫింగర్ ఫ్రింట్ కంటే.. అల్ఫా న్యూమరిక్ పాస్ వర్డ్ ఎంతో సెక్యూర్ అంటున్నారు సైబర్ నిపుణులు.

3. ఫేస్ అన్‌లాక్ :
మీ ఫోన్ లో స్ర్కీన్ లాక్ లేదా ఏదైనా యాక్సస్ చేసేందుకు ఫేస్ అన్ లాక్ వాడుతున్నారా? కొన్నిసార్లు మీ ఫేస్ రిక్నగైనేషన్ విషయంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఫేస్ అన్ లాక్ కంటే పాస్ వర్డ్ ఎంతో బెటర్ అంటున్నారు. ఫింగర్ ఫ్రింట్, ఫేషియల్ రికగ్నైనేషన్ కంటే.. పాస్‌వర్డ్ సెట్ చేసుకోవడమే ఎంతో ఉత్తమం.

4. పర్సనల్ ఫొటోలు, వీడియోలు :
సోషల్ మీడియా అకౌంట్లో పర్సనల్ ఫొటోలు, వీడియోలను ఎలా ప్రైవేటుగా ఉంచుకుంటారో అలానే మీ ఫోన్ లో కూడా సాధ్యమైనంతవరకు ప్రైవేటుగా ఉంచుకోవాలి. మీ పర్సనల్ ఫొటోలను ఇంట్లో లేదా ఆఫీసులో బాస్ ఎవరి కంటపడకుండా ఉండాలంటే.. మీరు చేయాల్సిందిల్లా.. ఫోన్ లో అలాంటి ఫొటోలను స్టోర్ చేయకపోవడమే ఉత్తమం. మరి ఎక్కడా స్టోర్ చేయాలంటారా? మీ పర్సనల్ కంప్యూటర్ లో స్టోర్ చేసుకోండి. పాస్ వర్డ్ ఉంటే తప్పా యాక్సస్ చేసుకునేలా ఉండాలి. ఆల్బమ్ లేదా యాప్ ఏదైనా సరే.. పాస్ వర్డ్ ప్రొటెక్ట్ అయి ఉండాలి. ఫోన్ లో అయితే ప్రతిసారి ఇలా ప్రొటెక్ట్ చేయడం కుదరకపోవచ్చు.

5. వ్యక్తిగత డేటాతో ఫొటోలు :
ఎప్పుడూ కూడా మీ ఫోన్‌లో పర్సనల్ డేటాను ఫొటోలతో కలిపి స్టోర్ చేయొచ్చు. అది పర్సనల్ ఐడీలు కావొచ్చు. వాస్తవానికి మీ ఫోన్ లో ఇలా వ్యాలెట్ డేటాను స్టోర్ చేయడం రిస్క్ అంటున్నారు సైబర్ నిపుణులు. ఎందుకంటే.. మీ పర్సనల్ డేటా వివరాలను హ్యాకర్ల చేతుల్లోకి ఇచ్చినట్టే.. మీరు స్టోర్ చేసే ప్రతి డేటా ఫోన్ ఆధారంగా క్లౌడ్ స్టోరేజీలో స్టోర్ అవుతుంది. క్లౌడ్ డేటా లీక్ అయ్యే రిస్క్ ఉంది. అందుకే పర్సనల్ కంప్యూటర్ లో పాస్ వర్డ్ ద్వారా ప్రొటెక్ట్ చేసుకోవడం మంచిదని అంటున్నారు.

6. ఆఫీసు ఫోన్లలో మీ పర్సనల్ డేటా :
ఆఫీస్ పరంగా వర్క్ కోసం వాడే స్మార్ట్ ఫోన్లలో పర్సనల్ డేటాను స్టోర్ చేయొద్దు. కొన్నిసార్లు మీ ఫోన్‌ను ఆఫీసులో ఇతరులు యాక్సస్ చేయొచ్చు. దీనివల్ల మీ ప్రైవసీ దెబ్బతినే అవకాశం ఉంది. పర్సనల్ డేటాను ఎప్పుడూ కూడా ఆఫీస్ ఫోన్‌లో స్టోర్ చేయరాదు. తప్పదనుకుంటే ఒక సపరేటు ఫోన్, నెంబర్ వాడుకోవచ్చు. మీ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను ఆఫీసు ఫోన్లలో స్టోర్ చేయడం మీ ప్రైవసీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

7. ఫోన్‌లో ఆన్‌లైన్ బ్యాంకు అకౌంట్ వివరాలు :
సాధారణంగా చాలామంది తమ బ్యాంకు అకౌంట్ వివరాలను ఫోన్ లో స్టోర్ చేస్తుంటారు. ప్రతిసారి అకౌంట్ వివరాల కోసం ఇబ్బంది ఎందుకని.. ఫోన్ లో స్టోర్ చేస్తుంటారు. ఇలాచేయడం ఎంతో రిస్క్ అంటున్నారు. ఫోన్‌లో బ్యాంకు అకౌంట్ డేటా ఉంటే.. రిస్క్ తప్పదు. ఫోన్ పోతే.. మీ విలువైన డేటా ఇతరులకు తెలిసిపోతుంది. తద్వారా బ్యాంకు అకౌంట్లు లాస్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఫోన్ కు బదులుగా ఇంట్లో పర్సనల్ కంప్యూటర్ వాడండి.. అది ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది.. బ్యాంకింగ్ అకౌంట్లను యాక్సస్ చేసేందుకు యూనిక్ పాస్ వర్డ్ తో సెట్ చేసుకోండి.

8. ఫోన్‌లో ఇంటి అడ్రస్ వివరాలు :
ఫోన్ లో ఇంటి అడ్రస్ వివరాలను స్టోర్ చేస్తుంటారు. ఎప్పుడంటే అప్పుడు నేవిగేట్ యాప్స్ ద్వారా సులభంగా యాక్సస్ చేసుకోవచ్చు అనుకుంటారు. కొన్నిసార్లు ఇది కూడా రిస్క్ అంటే అంటున్నారు. ఎందుకంటే.. మీ అడ్రస్ ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మిస్ యూజ్ చేసే అవకాశం లేకపోలేదు. గూగుల్ మ్యాప్స్ లో హోం లేదా వర్క్ లొకేషన్ స్టోర్ చేయడంలోనూ ఇబ్బందులు ఎదురుకావొచ్చు. మీ పర్సనల్ డేటా లీక్ లేదా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. మీ ఫిజికల్ అడ్రస్ ఉపయోగించి సైబర్ నేరగాళ్లు.. మీలాగా పర్సనల్ అకౌంట్లను యాక్సస్ చేసే రిస్క్ లేకపోలేదు.