గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారా? ఈ 8 విషయాల్లో మాత్రం జర జాగ్రత్త!

గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారా? ఈ 8 విషయాల్లో మాత్రం జర జాగ్రత్త!

8 Things to remember Be careful while searching on  Google : ఏదైనా సమాచారం తెలియాలంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు.. ప్రతిది గూగుల్ డేటాపైనే ఆధారపడుతుంటారు. కొన్నిసార్లు పర్సనల్ డేటా తెలియకుండానే లీక్ అయిపోతుంది. అందుకే గూగుల్ సెర్చ్ లో కనిపించేది అంతా నిజం కాదని తెలుసుకోవాలి. లేదంటే సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి ఈ డేటా వెళ్లిపోయినట్టే. మనం వెతికే సమాచారానికి సంబంధించి ఫేక్ డేటా కూడా గూగుల్ సెర్చ్ లో స్టోర్ అయి ఉంటుంది. తెలియక ఆ డేటాను ఫాలో అయితే లేనిపోని చిక్కులో పడతారని హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు. సైబర్ నేరగాళ్లు.. అసలైన వెబ్ సైట్ల డేటా పేరుతో ఫేక్ అకౌంట్లు, ఫోన్ నెంబర్లు, అడ్రస్ లను స్టోర్ చేస్తుంటారు. గూగుల్ లో కనిపించే కంటెంట్ ను ధ్రువీకరించడం చాలా కష్టం. ఎందుకంటే.. గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది ఒక ఆన్ లైన్ ప్లాట్ ఫాం.. గూగుల్ సెర్చ్ లో ఏదైనా డేటా కనిపించడానికి దాని వెనుక ఎస్ఈఓ రోల్ కీలకంగా ఉంటుంది. సైబర్ నేరగాళ్లు ఫేక్ డేటా కూడా సెర్చ్ ఇంజిన్‌లో కనిపిస్తోంది. గూగుల్ సెర్చ్ చేసే సమయంలో ఇలాంటి ఫేక్ డేటా చూసి నమ్మొద్దు.. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే గూగుల్ సెర్చింగ్ చేసే వారంతా ఈ 8 అంశాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవేంటో ఓసారి చూద్దాం..

1. కస్టమర్ కేర్ కాంటాక్ట్ నెంబర్లు :
ఆన్ లైన్ స్కాముల్లో ఇదొకటి.. సైబర్ నేరగాళ్లు ఫేక్ కస్టమర్ల డేటా కాంటాక్ట్ నెంబర్లను వాడుతుంటారు. అసలైన డేటా మాదిరిగా ఫేక్ డేటాను క్రియేట్ చేసి కస్టమర్ల కాంటాక్ట్ నెంబర్లను స్టోర్ చేస్తుంటారు. గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ఈ ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లు కనిపించే అవకాశం ఉంది. చాలా వరకు ఇన్ బుల్ట్ కస్టమర్ కేర్ చాట్ విండోలు ఉన్నాయి. మీకు ఏదైనా సమాచారం కావాలంటే సంబంధిత యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు.
2. ఆన్‌లైన్ బ్యాంకింగ్ URL డబుల్ చెక్ చేసుకోండి :
గూగుల్ సెర్చ్ లో ఏదైన బ్యాంకు వివరాలను సెర్చ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆ URL బ్యాంకు కు సంబంధించినదేనా కాదా? అని చెక్ చేసుకోవాలి. లేదంటే అది సైబర్ మోసగాళ్లది కూడా కావొచ్చు. బ్యాంకు లింకుల మాదిరిగానే మాల్ వేర్ లింకులను గూగుల్ లో పోస్టు చేస్తుంటారు. సరైన బ్యాంకు యూఆర్ఎల్ ఏంటో చెక్ చేసుకున్న తర్వాత మీ వ్యక్తిగత వివరాలను ఇవ్వాలి.

3. యాప్స్, సాఫ్ట్ వేర్ల కోసం సెర్చ్ చేయొద్దు :
గూగుల్ ద్వారా యాప్స్ సెర్చ్ చేయడం అంతమంచిది కాదు.. దాదాపు యాప్స్ మీ గూగుల్ ప్లే స్టోర్ లో కనిపిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఫోన్లకు యాప్ స్టోర్ అధికారికమైనవి మాత్రమే అనుమతి ఉంటుంది. ఎందుకంటే ఇతర యాప్ లను డౌన్ లోడ్ చేస్తే అందులో మాల్ వేర్ కోడ్ ఇతర వైరస్ లోడ్ ఫైళ్లు ఉంటాయి. సైబర్ నేరగాళ్లు ఈ మాల్ వేర్ ఫైళ్ల ద్వారానే దాడి చేస్తుంటారు.
medics4. అనారోగ్యంపై గూగుల్‌లో సెర్చ్ కంటే.. ముందు డాక్టర్‌‌ను కలవండి.. :
అనారోగ్యంగా ఉన్నప్పుడు చాలామంది ముందుగా గూగుల్ లో సెర్చ్ చేస్తుంటారు. తమకు ఉన్న లక్షణాల ఆధారంగా ఎలాంటి మెడిసిన్స్ అవసరమో సెర్చ్ చేస్తుంటారు.. ఇలా చేయడం కంటే ముందు వైద్యున్ని సంప్రదించడం మంచిది అంటున్నారు నిపుణులు. గూగుల్ సెర్చ్ సమాచారంపై ఆధారపడక పోవడమే ఉత్తమం. తెలిసి తెలియక సెర్చ్ లో కనిపించే మెడిసిన్ కొని వేసుకోవడం ప్రాణాలకే ప్రమాదం.. వైద్యుని సలహా లేకుండా ఎలాంటి మెడిసిన్ కూడా వేసుకోరాదు.
weight loss5. మెడికల్, న్యూట్రిషియన్ లేదా వెయిట్ లాస్ టిప్స్ గుడ్డిగా నమ్మెయొద్దు :
గూగుల్ సెర్చ్ లో కనిపించే మెడికల్ డేటా, నూట్రిషియన్, బరవు తగ్గే టిప్స్ వంటి సమాచారాన్ని గుడ్డిగా నమ్మేయకండి.. ముందు మీరు ఒక డైటేషియన్ ను కలవండి.. మీ సమస్యకు తగిన విధంగా వైద్యుల సలహాతో రెమడీలు పాటించండి.. అంతేకానీ, గూగుల్ సెర్చ్ ఆధారంగా టిప్స్ ఫాలో కావొద్దు.. ఒకవేళ బరువు తగ్గాలనుకుంటే ముందు డాక్టర్ ను కలవడం చేయండి.. ఆ తర్వాతే ఏమైనా అనేది గుర్తుపెట్టుకోవాలి.
Be careful while searching for customer care, contact numbers on Google6. పర్సనల్ ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ల టిప్స్ నమ్మొద్దు.. :
గూగుల్ సెర్చ్ లో పర్సనల్ ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లకు సంబంధించి టిప్స్ కోసం సెర్చ్ చేయొద్దు.. ఆరోగ్యం మాదిరిగానే పర్సనల్ ఫైనాన్స్ కూడా ప్రతిఒక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఒకే ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ అందరికి వర్కౌట్ కాదని గ్రహించాలి. గూగుల్ సెర్చ్ ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ చేయొద్దు.. అనుభవంతో పాటు నమ్మదగిన మార్కెట్ విశ్లేషకుల సలహాలు సూచనల ద్వారా మీ ప్రయత్నాలు కొనసాగించవచ్చు.
Be careful while searching for customer care, contact numbers on Google7. గూగుల్ లో ప్రభుత్వ వెబ్ సైట్ల URLs లింకులు తప్పక వెరిఫై చేసుకోండి :
గూగుల్ సెర్చ్ లో అనేక వెబ్ సైట్ల లింకులు కనిపిస్తుంటాయి. సెర్చ్ రిజల్ట్స్ లో కనిపించే ప్రతి యూఆర్ఎల్ నమ్మలేం.. అందులో సైబర్ నేరగాళ్ల మాల్ వేర్ లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ వెబ్ సైట్లకు సంబంధించి లింకులను జాగ్రత్తగా చెక్ చేయండి. ఎందుకంటే.. ప్రభుత్వ వెబ్ సైట్ల లింకుల పేరుతో ఫేక్ వెబ్ సైట్ల లింకులు ఉంటాయి. పొరపాటన వాటిని క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత డేటా, బ్యాంకు వివరాలన్నీ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది జాగ్రత్త..

8. ఈ-కామర్స్ వెబ్ సైట్ల కూపన్ల కోసం సెర్చ్ చేయొద్దు :
సాధారణంగా చాలామంది గూగుల్ సెర్చ్ లో ఈ కామర్స్ వెబ్ సైట్లలో కూపన్ల గురించి వెతుకుతుంటారు. కొనే వస్తువులపై కూపన్ ద్వారా డిస్కౌంట్ పొందేందుకు ఇలా ప్రయత్నిస్తుంటారు. వాస్తవానికి కూపన్లు అనేవి చాలా పరిమితంగానే ఉంటాయి. చాలావరకూ గూగుల్ సెర్చ్ లో యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు మాల్ వేర్ లింకులను ఉంచుతుంటారు సైబర్ నేరగాళ్లు.. ఈ లింకులను క్లిక్ చేసి మీ బ్యాంకు లాగిన్ వివరాలను ఎంటర్ చేస్తే.. అంతే సంగతలు.. సైబర్ మోసగాళ్లు ఈ బ్యాంకు వివరాలను దొంగిలించి నగదును చోరీ చేసే అవకాశం ఉంది జర జాగ్రత్త..