Iphone 14 Pro: 8జీబీ ర్యాం, 48ఎంపీ కెమెరాతో సరికొత్తగా రానున్న “ఐఫోన్ 14 ప్రో మోడల్”

అమెరికా స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ సంస్థ ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకురానున్న ఐఫోన్ 14 మోడల్ లో భారీ మార్పులు చేసినట్లు తెలుస్తుంది.

Iphone 14 Pro: 8జీబీ ర్యాం, 48ఎంపీ కెమెరాతో సరికొత్తగా రానున్న “ఐఫోన్ 14 ప్రో మోడల్”

Iphone

Iphone 14 Pro: అమెరికా స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ సంస్థ ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకురానున్న ఐఫోన్ 14 మోడల్ లో భారీ మార్పులు చేసినట్లు తెలుస్తుంది. గత ఐదేళ్లుగా విడుదలైన ఐఫోన్ మోడళ్లలో పెద్దగా మార్పులేవీ కన్పించకపోవడంతో, కొనుగోలుచేసేందుకు వినియోగదారులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. మరోవైపు శాంసంగ్, ఎల్జి, సోనీ వంటి ఆండ్రాయిడ్ ఫోన్లు.. సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈక్రమంలో ఐఫోన్ లోనూ.. అత్యాధునిక ఫీచర్లు జోడించి.. గత మోడల్స్ కంటే బిన్నంగా ఉండేలా కొత్త మోడల్ ను తయారు చేసింది యాపిల్ సంస్థ.

Also read: India Stock Market : ఉక్రెయిన్ -రష్యా ఎఫెక్ట్, భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దక్షిణ కొరియాకు చెందిన “Naver” అనే ఫోన్ రివ్యూ బ్లాగ్ లీక్ చేసిన వివరాలు మేరకు.. రానున్న ఐఫోన్ 14 ప్రో మోడల్ లో 8జీబీ ర్యాం, 48 ఎంపీ కెమెరా ఉండనున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు విడుదలైన ఐఫోన్ మోడల్స్ లో అత్యధిక ర్యాం 6జీబీగా ఉండగా..21 ఎంపీ కెమెరా సెటప్ మాత్రమే ఉన్నాయి. శాంసంగ్ వంటి సంస్థలు 8జీబీ ర్యాం, 12జీబీ ర్యాంతో పాటు 108ఎంపీ కెమెరా సెటప్ తో మార్కెట్లో దూసుకుపోతుంటే.. ఐఫోన్ మాత్రం ఇంకా వెనుకబడిపోయింది. ఈక్రమంలో కొత్త 14 ప్రో మోడల్ ను ఆండ్రాయిడ్ కు ధీటుగా ఉండేలా తీర్చిదిద్దింది యాపిల్ సంస్థ. ఐఫోన్ 14 ప్రో మోడల్ లో 8K స్పష్టతతో వీడియో రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో రానుంది. అందుకోసం తక్కువలో తక్కువగా.. 6జీబీ ర్యాం అవసరం అవుతుంది. అయితే ఫోన్ లో ఇతర ఫంక్షన్స్ పనిచేయాలంటే మరికొంత ర్యాం కావాల్సి ఉంటుంది. అందుకే ఈ కొత్త ఐఫోన్ మోడల్లో 8జీబీ ర్యాం చేర్చినట్లు ఫోన్ రివ్యూ సంస్థలు భావిస్తున్నాయి.

Also read: IPL 2022: లోగో రిలీజ్ చేసిన గుజరాత్ టైటాన్స్

అంతేకాదు ఐఫోన్ 14 ప్రో డిస్ప్లేలోను మార్పులు రానున్నాయి. ఇప్పుడున్న మోడల్స్ “నాచ్ స్క్రీన్” స్థానంలో “హోల్ పంచ్ – పిల్ షేప్” డిస్ప్లే స్క్రీన్ రానున్నది. సిం కార్డు స్లాట్ ను పూర్తిగా ఎత్తేసి.. దాని స్థానంలో ఈ-సింను తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అమెరికాలోని ఫోన్ సంస్థలకు సూచనలు కూడా చేసింది యాపిల్. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ సరికొత్త ఐఫోన్ 14 సిరీస్ లో మార్కెట్లోకి విడుదల చేయనుంది యాపిల్ సంస్థ.