అంగారక ఉపగ్రహాలకు మూలం ఒక్కరేనంట!

అంగారక ఉపగ్రహాలకు మూలం ఒక్కరేనంట!

అంగారకుడి ఉపగ్రహాలుగా పేరొందిన  మార్టిన్ చంద్రులకు పూర్వీకులు ఒకరే ఉన్నారంట.. ఫోబోస్, డీమోస్ అని పిలిచే రెండు అంగారక చంద్రులను 1877లో పరిశోధకులు కనుగొన్నారు. వాస్తవానికి ఈ అంగారక చంద్రులు చాలా చిన్నవిగా ఉంటాయి. ఫోబోస్ చంద్రుని వ్యాసం 22 కిలోమీటర్లు ఉంటుంది. అంటే.. మన చంద్రుడి కంటే 160 రెట్లు చిన్నదిగా ఉంటుంది. మరో మార్టిన్ చంద్రుడు డీమోస్.. ఇది ఇంకా చిన్నదిగా ఉంటుంది. దీని వ్యాసం కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే.. అదే అసలైన చంద్రుడు అయితే పూర్తిగా గుండ్రంగా గోళాకారంగా ఉంటాడు. అంగారక చంద్రులు మాత్రం బంగాళదుంప ఆకారంలో కనిపిస్తాయి.

ఫోబోస్, డీమోస్ మార్టిన్ సహచ చంద్రులు కంటే చూడటానికి అచ్చం గ్రహశకలల మాదిరిగానే కనిపిస్తాయని జీయోఫిజిక్స్ కు చెందిన డాక్టోరల్ స్టూడెంట్ అమిర్ హోస్సేన్ బాగేరి పేర్కొన్నారు. మార్టిన్ చంద్రుల కక్ష్యలు దాదాపు వృత్తాకారంలో ఉంటాయి. అంగారక గ్రహానికి భూమధ్యరేఖలో కదులుతుంటాయి. ఫోబోస్, డీమోస్ తమ కక్ష్యలు దాటినట్లు కనిపించాయని గుర్తించారు. అంగారక గ్రహ కక్ష్యలో తిరుగుతుంటుందని పరిశోధకులు నిర్ధారించారు. అసలు చంద్రుడు మరో భాగానికి తగలడం ద్వారా విచ్ఛిన్నమై ఉండొచ్చునని భావిస్తున్నారు. దాని ఫలితంగానే ఫోబస్, డీమోస్ అనే చిన్న చంద్రులు పుట్టుకొచ్చాయని, ఈ రెండూ చంద్రుని అవశేషాలుగా చెబుతున్నారు.
ఫోబోస్, డీమోస్ పోరస్ పదార్థంతో తయారయ్యాయని గుర్తించారు. క్యూబిక్ సెంటీమీటర్‌కు 2 గ్రాముల కన్నా తక్కువగా ఉంటాయి. అలాగే వీటి సాంద్రత భూమి సగటు సాంద్రత కంటే చాలా తక్కువగా ఉంటుంది. క్యూబిక్ సెంటీమీటర్‌కు 5.5 గ్రాములు వరకు ఉంటాయి. ఫోబోస్ లోపల కావిటీస్ ఉన్నాయి. అందులో మంచునీరు ఉండవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు. ఫోబోస్, డీమోస్ పుట్టిన సమయం గతంలో 2.7 బిలియన్ ఏళ్ల మధ్య ఉంటుంది.

ఖచ్చితమైన సమయాన్ని గుర్తించాలంటే ఫోబోస్, డీమోస్ భౌతిక లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. 2025లో జపనీస్ ప్రోబ్ ఫోబోస్‌ పై అన్వేషణ మొదలు పెట్టనుంది. ఫోబస్ నమూనాలను భూమికి తిరిగి తీసుకురానుంది. ఈ నమూనాల ద్వారా మార్టిన్ చంద్రుల లోపలి వివరాలను అందిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఫోబోస్, డీమోస్ అనే ఉపగ్రహాలు అంగారకుడి చంద్రులు మార్టిన్‌కు పూర్వీకులుగా చెబుతున్నారు