Aadhaar Biometrics Protection: దుర్వినియోగం కాకుండా మీ ఆధార్‌ను రక్షించుకోండిలా..

ఆధార్ కార్డు ప్రతీ విషయంలో తప్పనిసరి అయిపోయింది. చాలా వాటికి పర్సనల్ ఐడెంటిఫికేషన్ కావాల్సి వస్తే.. ఆధార్ వాడేస్తున్నారు. పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్సులు లాంటి వాటికి కచ్చితంగా ఉండాల్సిందే.

Aadhaar Biometrics Protection: దుర్వినియోగం కాకుండా మీ ఆధార్‌ను రక్షించుకోండిలా..

Aadhaar Biometrics Protection

Aadhaar Biometrics Protection: ఆధార్ కార్డు ప్రతీ విషయంలో తప్పనిసరి అయిపోయింది. చాలా వాటికి పర్సనల్ ఐడెంటిఫికేషన్ కావాల్సి వస్తే.. ఆధార్ వాడేస్తున్నారు. పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్సులు లాంటి వాటికి కచ్చితంగా ఉండాల్సిందే. ఆధార్ తో మన వేలిముద్రలు, ఫొటో ఐడెంటిటీ, కంటిపాప గురించి తెలుసుకోవచ్చు.

ఈ వివరాలన్నీ ఉపయోగించి తప్పుడు పద్ధతిలోనూ వాడేవాళ్లు లేకపోలేదు. 12అంకెల ఆధార్ డిజిట్ ను ఎంటర్ చేసి ప్రూఫ్ గా అడిగిన దేనికైనా వాడేసుకోవచ్చు. ఇక ఇలాంటి తప్పుడు దుర్వినియోగాలన్నింటికి చెక్ పెడుతూ.. మాస్క్ ఆధార్ ను తీసుకొచ్చింది UIDAI.

ఆ టెక్నిక్ వాడి మీ ఆధార్ ను కూడా సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటే చేయండిలా..

1. ముందుగా uidai.gov.in వెబ్ సైట్‌కు వెళ్లండి.
2. అక్కడ ‘My Aadhaar‘ కేటగిరీని ఎంచుకోండి. అందులో ఆధార్ సర్వీసెస్ లోకి వెళ్లిన తర్వాత Lock/Unlock Biometrics ఆప్షన్ కనిపిస్తుంది.
3. ఖాళీగా కనిపించే ప్రదేశంలో 12అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి.. ఆధార్ కార్డులో ఉన్నట్లుగానే మీ పూర్తి పేరు నమోదు చేయండి. దాంతోపాటు పిన్ కోడ్ వివరాలు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
4. స్క్రీన్ మీద కనిపించే సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అవండి.
5. ఆ తర్వాత ఓటీపీ కోసం క్లిక్ చేయండి.
6. ఓటీపీని ఎంటర్ చేసి పాస్ వర్డ్ క్రియేట్ చేయండి.
7. అప్పుడు కనిపించే బయోమెట్రిక్ లాకింగ్ ఎనేబుల్ లో ఉంచాలా.. డిసేబుల్ లో ఉంచాలో నిర్ణయించుకోండి. అలా మీ బయోమెట్రిక్స్ ను లాక్ చేయొచ్చు.

మొబైల్ లోనే ఎస్ఎమ్ఎస్ తోనూ లాక్ చేయొచ్చు.
1. ముందుగా GETOTP అని టైపు చేసి స్పేస్ ఇచ్చి నాలుగు లేదా ఎనిమిది అంకెల ఆధార్ చివరి నెంబర్లు ఎంటర్ చేసి 1947కు పంపించాలి.
2. అప్పుడు ఆరు అంకెల్ ఓటీపీ మెసేజ్ గా వస్తుంది.
3. ఆ తర్వాత మీ ఆధార్ ను బయోమెట్రిక్ లాక్ చేయాలనుకుంటే.. LOCKUID స్పేస్ ఇచ్చి (నాలుగు లేదా ఎనిమిది అంకెల్ ఆధార్ నెంబర్) స్పేస్ ఇచ్చి OTP ఎంటర్ చేయాలి.
4. ఆ తర్వాత రిజిష్టర్ అయిన మొబైల్ నెంబర్ కు ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ అయినట్లు మెసేజ్ వస్తుంది.

ఒకవేళ అన్ లాక్ చేయాలనుకుంటే కూడా సేమ్ పద్ధతి ఫాలో అయిపోవడమే. కాకపోతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడానికి బదులుగా VID నెంబర్ రాయాల్సి ఉంటుంది.