Aadhaar Card Online : ఆధార్ కార్డులో మీ ఫోన్ నెంబర్ ఇలా ఈజీగా మార్చుకోవచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Aadhaar Card Online : మీ ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉన్నాయా? ఆధార్ కార్డులో వివరాలను ఎలా సరిచేసుకోవాలో తెలియడం లేదా? అయితే, ఆన్‌లైన్‌లో మీ ఆధార్ కార్డులోని వివరాలను చాలా సులభంగా మార్చుకోవచ్చు.

Aadhaar Card Online : మీ ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉన్నాయా? ఆధార్ కార్డులో వివరాలను ఎలా సరిచేసుకోవాలో తెలియడం లేదా? అయితే, ఆన్‌లైన్‌లో మీ ఆధార్ కార్డు (Aadhaar Card Update) లోని వివరాలను చాలా సులభంగా మార్చుకోవచ్చు. మీ ఆధార్ కార్డులోని సమాచారం కచ్చితత్వం, భద్రతను నిర్ధారించడానికి అడ్రస్, ఫోన్ నంబర్, ఫొటో, ఇతర వివరాలతో సహా వారి ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆధార్ కార్డ్ హోల్డర్‌లకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఒక అడ్వైజరీ కూడా జారీ చేసింది.

ఆధార్ కార్డుదారులు తమ ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో సౌలభ్యం మేరకు అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే, (UIDAI) జనాభా వివరాల ఆన్‌లైన్ అప్‌డేట్ మాత్రమే అనుమతిస్తుంది. బయోమెట్రిక్స్ లేదా ఇతర వివరాలను అప్‌డేట్ చేయాలంటే మాత్రం మీకు దగ్గరలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ సందర్శించాలి. ఆధార్ అప్‌డేషన్‌కు సంబంధించి UIDAI అనేక విషయాలను వెల్లడించింది. మీకోసం లేదా మీ కుటుంబ సభ్యుల కోసం ఆధార్ కోసం ఎన్‌రోల్ చేయాలంటే.. మీరు ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించాలి.

Read Also : Aadhaar Update in Telugu : ఇకపై ఆధార్ అప్‌డేట్ చేస్తే చాలు.. ఇతర డాక్యుమెంట్లలోనూ మీ డేటా ఆటో అప్‌డేట్ కానుంది తెలుసా?

ఒకవేళ, మీ జనాభా వివరాలు (పేరు, అడ్రస్, DoB, లింగం, మొబైల్ నంబర్, ఇమెయిల్) మీ ఆధార్‌లో లేవంటే.. మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా వెంటనే అప్‌డేట్ పొందవచ్చు. అదనంగా, ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరి కూడా. ముఖ్యంగా 15 ఏళ్లు నిండిన పిల్లల బయోమెట్రిక్‌లు.

వేలిముద్ర (Fingerprint), ఐరిస్, ఫొటోతో సహా బయోమెట్రిక్ వివరాలను సమీపంలోని ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా, ఇటీవలి ప్రకటనలో.. (UIDAI) జూన్ 14, 2023 వరకు డాక్యుమెంట్‌లను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డుదారులు తమ గుర్తింపు రుజువు, అడ్రస్ ప్రూఫ్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు.

Aadhaar Card Online _ How to Change Phone number on Aadhaar Card Online

అయితే, మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడం ఆన్‌లైన్‌లో చేయలేమని గమనించాలి. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఫిజికల్ వెరిఫికేషన్ అవసరం పడుతుంది. అనధికారికంగా ఎవరూ అప్‌డేట్ ప్రాసెస్ దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు మీ మొబైల్ నంబర్‌ను ఫేక్ నంబర్‌తో అప్‌డేట్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది.

మీరు మీ (SIM Card)ని మార్చినట్లయితే లేదా మీ ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేయాలనుకుంటే.. మీరు పర్మినెంట్ రిజిస్టర్ సెంటర్ (Permanent Enrolment Center) సందర్శించడం ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ అప్‌డేషన్ ప్రక్రియలో మీకు సాయం చేసేందుకు కొన్ని సూచనలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

ఆధార్‌లో ఫోన్ నంబర్‌ను ఎలా అప్‌డేట్ చేయాలంటే? :
– మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని/ఆధార్ కార్డ్ కేంద్రాన్ని సందర్శించండి.
– (uidai.gov.in)లో ‘(Locate Enrolment Center)’పై క్లిక్ చేయడం ద్వారా మీరు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని చెక్ చేయొచ్చు.
– మొబైల్ నంబర్‌ను మార్చడానికి, ఆధార్ హెల్ప్ ఎగ్జిక్యూటివ్ మీకు ఒక అప్లికేషన్ ఫారం అందిస్తారు.
– ఆధార్ అప్‌డేట్/కరెక్షన్ ఫారమ్‌ను సరైన వివరాలతో నింపండి.
– మీ ఫారమ్‌ను మళ్లీ చెక్ చేసి, ఆధార్ ఎగ్జిక్యూటివ్‌కు సమర్పించండి.
– అప్‌డేట్ కోసం మీకు కనీస సర్వీస్ రూ. 50 ఛార్జ్ చేస్తారు.
– ఆధార్ ఎగ్జిక్యూటివ్‌కు రుసుము చెల్లించండి.
– లావాదేవీ తర్వాత, ఆధార్ ఎగ్జిక్యూటివ్ అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)తో కూడిన రసీదు స్లిప్‌ను అందిస్తారు.
– మీరు మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి ఇచ్చిన URNని ఉపయోగించవచ్చు.
– స్టేటస్‌ని చెక్ చేసేందుకు myaadhaar.uidai.gov.in/ని విజిట్ చేయండి.
– చెక్ ఎన్‌రోల్‌మెంట్ & అప్‌డేట్ స్టేటస్‌పై Click చేయండి.
– మీ URN నంబర్, Captcha ఎంటర్ చేయండి.
ముఖ్యంగా, మీ మొబైల్ నంబర్ 90 రోజుల లోపు UIDAI డేటాబేస్‌లో అప్‌డేట్ అవుతుంది.

Read Also : Best 5G Phones : మార్చిలో రూ. 20వేల లోపు బెస్ట్ 5G ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు