Adobe Photoshop : అడోబ్ ఫొటోషాప్ ఫ్రీ వెబ్‌ వెర్షన్ వస్తోంది.. బ్రౌజర్‌లోనే ఇక ఎడిటింగ్..!

Adobe Photoshop Web : ప్రముఖ ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ అడోబ్ ఫొటోషాప్ కొత్త వెర్షన్ రాబోతోంది. అడోబ్ యూజర్ల కోసం త్వరలో ఫొటోషాప్ వెబ్ వెర్షన్ తీసుకొస్తోంది.

Adobe Photoshop : అడోబ్ ఫొటోషాప్ ఫ్రీ వెబ్‌ వెర్షన్ వస్తోంది.. బ్రౌజర్‌లోనే ఇక ఎడిటింగ్..!

Adobe To Launch Free Web Version Of Photoshop Here’s What You Need To Know

Adobe Photoshop Web : ప్రముఖ ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ అడోబ్ ఫొటోషాప్ కొత్త వెర్షన్ రాబోతోంది. అడోబ్ యూజర్ల కోసం త్వరలో ఫొటోషాప్ వెబ్ వెర్షన్ తీసుకొస్తోంది. ఇప్పటికే కంపెనీ వెబ్ వెర్షన్ ఫొటోషాప్ కోసం ఫ్రీ ట్రయల్స్ నిర్వహిస్తోంది. సాధారణంగా అడోబ్ ఫొటోషాప్ యాక్సస్ చేసుకోవాలంటే.. ప్రీమియం లైసెన్స్ డ్ సాఫ్ట్ వేర్ కావాలి. కానీ, ఇప్పుడు అందరి ఫొటోషాప్ వినియోగదారుల కోసం ఉచితంగా వెబ్ వెర్షన్ ఫొటోషాప్ అందించేందుకు అడోబ్ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. అందులోభాగంగానే బ్రౌజర్ ఆధారిత ఫొటోషాప్ వెర్షన్ ప్రవేశపెడుతోంది.

ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఈ సర్వీసును అందించాలని కంపెనీ యోచిస్తోంది. అడోబ్ ఈ సేవను ‘freemium’ అని పిలవాలని యోచిస్తున్నట్లు ది వెర్జ్ నివేదిక పేర్కొంది. సర్వీసు ఉచితంగానే అందించనుంది. అయితే ఈ ఫొటోషాప్‌లోని కొన్ని ఫీచర్లు కొంత సమయం తర్వాత అందుబాటులో ఉండవు. ఫోటోషాప్ మొదట ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే మరిన్ని ఫీచర్లను యాక్సస్ చేసుకునేందుకు సభ్యత్వాన్ని కొనుగోలు చేసే వారికి ప్రత్యేకంగా కొన్ని ఫీచర్లను Adobe అందించనుందని పేర్కొంది. మరింత మంది యూజర్లకు ఈ సర్వీసును వినియోగించుకోవడానికి ఈ వెబ్ వెర్షన్ ఫొటోషాప్ తీసుకురానుంది.

Adobe To Launch Free Web Version Of Photoshop Here’s What You Need To Know (1)

Adobe To Launch Free Web Version Of Photoshop Here’s What You Need To Know 

మరిన్ని ఫీచర్లు అవసరమైతే.. యూజర్లు సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. యూజర్లను తమ ప్లాట్‌ఫారమ్‌కు ఆకర్షించేందుకు కంపెనీ ఈ ఆప్షన్ అందిస్తోంది. ఎక్కువ మంది యూజర్లు ఈ ఫొటోషాప్ వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని అడోబ్ డిజిటల్ ఇమేజింగ్ VP మరియా యాప్ అన్నారు. ఉచిత వెర్షన్‌లో యాడ్స్ ఉంటాయా లేదా అనేది ప్రస్తుతం క్లారిటీ లేదు. చాలా వెబ్ ఆధారిత ఫోటో ఎడిటింగ్ యాప్‌లు ఉచిత వెర్షన్ అందిస్తాయి. అయితే ఉచిత సర్వీసులో బదులుగా కూడా యాడ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి.

Adobe ప్రతి ఒక్కరికీ ఉచిత వెర్షన్ ఎప్పుడు అందించాలని యోచిస్తోందో ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతానికి కెనడాలో ఈ వెబ్ వెర్షన్ ఫొటోషాప్ టెస్టింగ్ చేస్తోంది. అయితే ఇతర ప్రాంతాలకు సంబంధించిన లాంచ్ టైమ్‌లైన్ ఇంకా తెలియదని నివేదిక పేర్కొంది. ప్రస్తుతానికి, “ఫ్రీమియం” వెర్షన్ భారత్‌కు వస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం, భారత్‌లో యూజర్లు 7 రోజుల ఫ్రీ ట్రయల్‌ని వాడుకోవచ్చు. ఆ తర్వాత నెలకు రూ. 1,675.60 చెల్లించాల్సి ఉంటుంది. ఆఫర్ కూడా ఉంది. మీరు ఈ సర్వీసును తక్కువ ధరకు పొందవచ్చు. కానీ కొన్ని ఫీచర్లను యాక్సస్ చేసుకోలేరు. లైట్‌రూమ్ ఫోటోషాప్ రెండింటికీ ప్లాన్ ఉంది. ఇందుకోసం కేవలం నెలకు రూ.797.68 చెల్లించాల్సి ఉంటుంది.

Read Also : Cloudflare downtime : ఇండియాలో నిలిచిపోయిన క్లౌడ్‌ఫ్లేర్ సర్వీసులు.. కొద్దిసేపటికే ఫిక్స్..!