Airtel 5G Services : దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. మరో 10కిపైగా నగరాల్లోకి.. మీ నగరం ఉందేమో చెక్ చేసుకోండి.. ఫుల్ లిస్టు ఇదిగో..!

Airtel 5G Services : ప్రముఖ దేశీయ భారత్ రెండో అతిపెద్ద టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) ప్రధాన భారతీయ నగరాల్లో 5G సర్వీసులను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే టెలికాం ఆపరేటర్ 13 భారతీయ నగరాల్లో 5వ జనరేషన్ నెట్‌వర్క్ కనెక్టివిటీని ప్రారంభించింది.

Airtel 5G Services : దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. మరో 10కిపైగా నగరాల్లోకి.. మీ నగరం ఉందేమో చెక్ చేసుకోండి.. ఫుల్ లిస్టు ఇదిగో..!

Airtel 5G Rolling out in Lucknow, already available in 10 plus cities_ check out the full list

Airtel 5G Services : ప్రముఖ దేశీయ భారత్ రెండో అతిపెద్ద టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) ప్రధాన భారతీయ నగరాల్లో 5G సర్వీసులను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే టెలికాం ఆపరేటర్ 13 భారతీయ నగరాల్లో 5వ జనరేషన్ నెట్‌వర్క్ కనెక్టివిటీని ప్రారంభించింది. ఇప్పుడు యూపీలోని లక్నోలో కూడా తమ 5G సర్వీసులను ఎయిర్‌టెల్ అందుబాటులో తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ 5G సర్వీసులు (Airtel 5G Serivces) నగరంలో దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి.

5G సపోర్టెడ్ స్మార్ట్‌ఫోన్‌లు కలిగిన యూజర్లు తమ ఫోన్‌లో అడ్వాన్స్‌డ్ 5G కనెక్టివిటీని పొందవచ్చు. లక్నోలో ఎయిర్‌టెల్ (Airtel) 5G సర్వీసులను అందించేందుకు గోమతి నగర్, హజ్రత్‌గంజ్, అలీగంజ్, ఐష్‌బాగ్, రాజాజీపురం, అమీనాబాద్, జాంకీపురం, అలంబాగ్, వికాస్‌తో సహా నగరాల్లోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే రోజుల్లో మరికొన్ని నగరాల్లోని ఇతర ప్రాంతాలు కూడా దశలవారీగా 5G కనెక్టివిటీని పొందవచ్చు.

Read Also : Jio 5G – Airtel 5G : భారతీయ నగరాల్లో జియో – ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం.. 5G ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

Airtel 5G సపోర్ట్ స్మార్ట్‌ఫోన్‌లివే :
Airtel 5G సర్వీసులు, అల్ట్రాఫాస్ట్, ప్రస్తుత 4G స్పీడ్ కన్నా 20-30 రెట్లు వేగంగా పనిచేస్తాయని చెప్పవచ్చు. టెల్కో 5G నాన్-స్టాండలోన్ (NSA) నెట్‌వర్క్‌లను అందిస్తోంది. One Plus, Oppo, Vivo, Samsung, ఇతరులతో సహా అనేక స్మార్ట్‌ఫోన్‌లకు సపోర్టు అందిస్తుంది. ఆపిల్ (Apple) తమ iOS 16.2 అప్‌డేట్‌తో Airtel, Jio కోసం 5G సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.

Airtel 5G Rolling out in Lucknow, already available in 10 plus cities_ check out the full list

Airtel 5G Rolling out in Lucknow, already available in 10 plus cities_ check out the full list

దేశంలో ఏయే నగరాల్లో Airtel 5G ఉందంటే? :
దేశంలోని ప్రధాన నగరాల్లో ఎయిర్‌టెల్ దశలవారీగా 5G సర్వీసులను ప్రవేశపెడుతోంది. అక్టోబర్ 2022లో 5G నెట్‌వర్క్ ప్రారంభించిన టెల్కో గత 2 నెలల్లో 13 భారతీయ నగరాలకు సర్వీసులను విస్తరించింది. Airtel 5G అందుబాటులో ఉన్న అన్ని భారతదేశ నగరాల లిస్టును మీకోసం ఇక్కడ అందిస్తున్నాం.. అవేంటో ఓసారి చూద్దాం..

* ఢిల్లీ
* ముంబై
* బెంగళూరు
* చెన్నై
* హైదరాబాద్
* నాగపూర్
* సిలిగురి
* లక్నో
* పాట్నా
* గుర్గావ్
* వారణాసి
* గౌహతి
* పానిపట్

ఇంతలో (Airtel) ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని భారతీయ నగరాల్లో 5Gని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. 2023 నాటికి ప్రధాన నగరాల్లో Jio, Airtel తమ 5G సర్వీసులను అందించాలని భావిస్తోంది. అలాగే, 2024 నాటికి 5G పాన్ ఇండియాగా తీసుకొచ్చేందుకుప్రయత్నిస్తున్నాయి.

Airtel 5G Plusని ఎలా ఉపయోగించాలి? :
ఎయిర్‌టెల్ (Airtel 5G) సర్వీసులు మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే.. మీరు మీ 5G రెడీ స్మార్ట్‌ఫోన్‌లలో నెట్‌వర్క్‌ని ఉపయోగించవచ్చు. అంతేకాదు.. 4G సిమ్ 5G నెట్‌వర్క్‌కు కూడా సపోర్టు ఇస్తుందని ఎయిర్‌టెల్ ఇప్పటికే హామీ ఇచ్చింది. వినియోగదారులు 5G కోసం కొత్త సిమ్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. భారతీ ఎయిర్‌టెల్ 5G సర్వీసుల నెట్‌వర్క్ కవరేజ్ జోన్‌లో ఉన్నట్లయితే.. మీరు ఆటోమాటిక్‌గానెక్స్ట్ జనరేషన్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel 5G in India : దేశంలో 12 నగరాల్లోకి Airtel 5G సర్వీసులు.. ఫుల్ లిస్ట్ ఇదిగో.. మీ నగరం ఉందేమో ఇప్పుడే చెక్ చేసుకోండి!