Airtel 5G Services : దేశంలో కొత్తగా మరో 3 నగరాల్లోకి ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. మీ ఏరియాలో 5G నెట్‌వర్క్ ఎప్పుడు వస్తుందో చెక్ చేసుకోండి!

Airtel 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ (Airtel 5G Services) తన 5G నెట్‌వర్క్ సర్వీసులను దేశవ్యాప్తంగా వేగంగా అమలు చేస్తోంది. టెలికాం ఆపరేటర్ 5వ జనరేషన్ నెట్‌వర్క్ కనెక్టివిటీని దశలవారీగా అందుబాటులోకి తెస్తోంది.

Airtel 5G Services : దేశంలో కొత్తగా మరో 3 నగరాల్లోకి ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. మీ ఏరియాలో 5G నెట్‌వర్క్ ఎప్పుడు వస్తుందో చెక్ చేసుకోండి!

Airtel 5G Services _ Airtel 5G now available in 3 more cities _ when will your area get Airtel 5G

Airtel 5G Services : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ (Airtel 5G Services) తన 5G నెట్‌వర్క్ సర్వీసులను దేశవ్యాప్తంగా వేగంగా అమలు చేస్తోంది. టెలికాం ఆపరేటర్ 5వ జనరేషన్ నెట్‌వర్క్ కనెక్టివిటీని దశలవారీగా అందుబాటులోకి తెస్తోంది. మరిన్ని నగరాల్లో ఎయిర్‌టెల్ 5G కవరేజీని విస్తరిస్తోంది. ఇంఫాల్, అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో 5G లాంచ్‌ను ప్రకటించింది.

ఎయిర్‌టెల్ 5G ప్లస్ (Airtel 5G Plus)గా పిలిచే టెలికాం ఆపరేటర్ NSA (నాన్-స్టాండలోన్) సాంకేతికతపై 5Gని అమలు చేస్తోంది. దేశంలో వాణిజ్యపరంగా 5Gని ప్రారంభించిన భారత్‌లోనే ఏకైక టెలికాం ఆపరేటర్. ఎయిర్‌టెల్ ప్రత్యర్థి రిలయన్స్ జియో (Reliance Jio) ఇప్పటికీ 5G- Jio True 5Gని బీటా దశలో రిలీజ్ చేస్తోంది. దాని ట్రయల్స్ ఎప్పుడు ముగుస్తుందనే దానిపై నిర్దిష్ట టైమ్‌లైన్ ప్రకటించలేదు.

ముందుగా ఆ రెండు నగరాల్లో 5G సర్వీసులు :
అహ్మదాబాద్ గాంధీనగర్‌లలో హై-స్పీడ్ 5G సర్వీసులను ప్రారంభించిన టెల్కో కంపెనీ.. SG హైవే, మెమ్‌నగర్, శాటిలైట్, నవరంగపుర, సబర్మతి, మోటేరా, చంద్‌ఖేడా, సౌత్ బోపాల్, గోమ్తీపూర్, మెమ్‌కో, అహ్మదాబాద్‌లోని బాపునగర్, కోబా, రేసన్‌లలో 5G కనెక్టివిటీ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. గాంధీనగర్ నగరంలో సర్గసన్, పెతాపూర్ ఇతర కీలక ప్రాంతాల్లోనూ 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

ఇంఫాల్‌లో ఎయిర్‌టెల్ 5G :
ఇంఫాల్ అంతటా కవర్ చేస్తూ 5G సర్వీసులు అకంపట్ ప్రాంతం, వార్ స్మశానవాటిక, దేవ్లాహ్‌ల్యాండ్ ప్రాంతం, తకిల్‌పట్ ప్రాంతం, RIMS ఇంఫాల్ ప్రాంతం, కొత్త సెక్రటేరియట్, బాబుపరా ప్రాంతం, ఘరీ, ఉరిపోక్, సాగోల్‌బాండ్ వంటి ఇతర ఎంపిక చేసిన ప్రాంతాల్లోనూ 5G కనెక్టివిటీ కోసం పనిచేస్తుందని టెల్కో ప్రకటించింది. నవంబర్‌లో ముందుగా, టెలికాం ఆపరేటర్ గౌహతిలో 5G నెట్‌వర్క్ ప్రకటించింది. దేశంలోని ఈశాన్య ప్రాంతంలో 5వ-జనరేషన్ నెట్‌వర్క్ కనెక్టివిటీ విస్తరణను ప్రారంభించింది. Airtel 5G Plus పనిచేస్తున్న అన్ని నగరాల లిస్టు ఇక్కడ మీకోసం అందిస్తున్నాం.

Airtel 5G Services _ Airtel 5G now available in 3 more cities _ when will your area get Airtel 5G

Airtel 5G Services _ Airtel 5G now available in 3 more cities _ when will your area get Airtel 5G

Read Also : Airtel 5G Services in India : దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. కొత్తగా చేరిన మరో నగరం.. ఎక్కడో తెలుసా?

* హైదరాబాద్
* చెన్నై
* ఢిల్లీ
* ముంబై
* బెంగళూరు
* సిలిగురి
* నాగ్‌పూర్
* వారణాసి
* పానిపట్
* గుర్గావ్
* గౌహతి
* పాట్నా
* లక్నో
* సిమ్లా
* ఇంఫాల్
* అహ్మదాబాద్
* గాంధీ నగర్

ఎయిర్‌టెల్ 5G సర్వీసులు ప్రారంభమైన నగరాల్లో నివసిస్తున్న వినియోగదారులు తమ 5G స్మార్ట్‌ఫోన్‌లలో హై-స్పీడ్ 5G ఇంటర్నెట్, సర్వీసులను ఉపయోగించవచ్చు. ఎయిర్‌టెల్, జియో 5G కనెక్టివిటీకి సపోర్టు ఇచ్చేందుకు చాలా మంది స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఇప్పటికే సిస్టమ్ అప్‌డేట్‌ను ప్రారంభించారు. ఆపిల్ ఇటీవలి iOS 16.2 అప్‌డేట్‌తో 5G సపోర్టును అందించింది. 5Gని ఉపయోగించడానికి యూజర్లు కొత్త సిమ్‌ను కొనుగోలు చేయనవసరం లేదని టెలికాం ఆపరేటర్లు ఇప్పటికే వెల్లడించారు. 4G SIM ఐదో జనరేషన్ కనెక్టివిటీకి సపోర్టు అందిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌లో Airtel 5Gకి ఎలా కనెక్ట్ చేయాలంటే? :
మీ Android ఫోన్‌లో Airtel 5Gని ఉపయోగించడానికి Settings> Network mode> Select Network mode, 5G కనెక్టవిటీని ఎంచుకోండి. 5G కనెక్టివిటీ లేదా Global ఆప్షన్ ఎంచుకోండి. iOS యూజర్లు తమ ఫోన్ Settings వెళ్లండి. General> Software Update> Download చేసి iOS 16.2ను ఇన్‌స్టాల్ చేయండి. ఆ తర్వాత, Network Settingsకు వెళ్లి ఎయిర్‌టెల్ సిమ్‌పై Tap చేయండి. 5G సర్వీసులను ఎంచుకోండి.

5G సర్వీసులు ప్రారంభమైన తర్వాత.. మీరు కనెక్టివిటీ ప్రాంతంలో ఉన్నప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ ఆటోమేటిక్‌గా కొత్త నెట్‌వర్క్‌కి కనెక్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే.. ఎయిర్‌టెల్ (Airtel), జియో (Jio) ఏడాది చివరి నాటికి మరిన్ని నగరాలకు చేరుకోనున్నాయి. టెలికాం ఆపరేటర్లు 2023 నాటికి మెజారిటీ భారతీయ నగరాలను 1-2 ఏళ్లలో పాన్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel 5G Services : దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. మరో 10కిపైగా నగరాల్లోకి.. మీ నగరం ఉందేమో చెక్ చేసుకోండి.. ఫుల్ లిస్టు ఇదిగో..!