Airtel Reliance Jio Offer : ఎయిర్‌టెల్, జియో యూజర్లకు అదిరే ఆఫర్లు.. ఈ ప్లాన్లపై 5G డేటా, OTT బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Airtel Reliance Jio Offer : ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ ప్లాన్లపై 5G అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు.

Airtel Reliance Jio Offer : ఎయిర్‌టెల్, జియో యూజర్లకు అదిరే ఆఫర్లు.. ఈ ప్లాన్లపై 5G డేటా, OTT బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Airtel and Jio offer 2.5GB daily 5G data, unlimited calling, and OTT benefits with these plans

Airtel Reliance Jio Offer : దేశీయ రెండు ప్రముఖ టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్ (Bharati Airtel) తమ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ ప్లాన్లపై అన్‌లిమిటెడ్ డేటా యాక్సెస్‌తో అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇంటర్నెట్ స్పీడ్, రోజువారీ డేటా కోటాపై ఆధారపడి ఉంటుంది. రోజువారీ హై-స్పీడ్ డేటా లిమిట్ ముగిసిన తర్వాత మీ ఇంటర్నెట్ స్పీడ్ 65kbps వరకు పడిపోతుంది.

అందుకే, ఈ రెండు టెల్కోలు 2.5GB రోజువారీ డేటా ప్లాన్‌లపై అధిక రోజువారీ డేటా క్యాప్‌లతో ఎంపిక చేసిన డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి. తద్వారా రోజంతా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని పొందవచ్చు. ఎయిర్‌టెల్, జియో రెండూ 30 రోజుల నుంచి ఏడాది వరకు వ్యాలిడిటీతో 2.5GB రోజువారీ డేటా ప్లాన్‌లను అందిస్తాయి. ఫోన్ కాలింగ్, SMS, OTT బెనిఫిట్స్‌తో పాటు ప్రతిరోజూ 2.5 GB డేటా బెనిఫిట్స్ అందించనుంది. జియో, ఎయిర్‌టెల్ ప్లాన్‌ల లిస్టును అందిస్తున్నాం.

2.5GB రోజువారీ డేటాతో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లివే :
ఎయిర్‌టెల్ రూ. 999 ప్లాన్ : ఈ ప్లాన్ కింద టెల్కో 2.5GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 110 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అదనపు బెనిఫిట్స్ విషయానికి వస్తే.. త్రైమాసిక ప్లాన్‌లలో 5G నెట్‌వర్క్ కనెక్టివిటీతో అన్‌లిమిటెడ్ 5G వినియోగంతో 84 రోజుల పాటు (Amazon Prime) మెంబర్‌షిప్, (Airtel Xstream) యాప్ యాక్సెస్ వంటి మరిన్ని ఆప్షన్లను అందిస్తుంది.

Read Also : Elon Musk : ట్విట్టర్ డేటాను మైక్రోసాఫ్ట్ అక్రమంగా వాడేస్తోంది.. ఇక ఆపేయ్.. సత్య నాదేళ్లకు ఎలన్ మస్క్ స్వీట్ వార్నింగ్..!

ఎయిర్‌టెల్ రూ. 3359 ప్లాన్ : ఈ వార్షిక వాలిడిటీ ప్లాన్ 2.5GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను 365 రోజుల పాటు అందిస్తుంది. అర్హత కలిగిన యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటా వినియోగం, ఏడాదికి Disney+ Hotstar మొబైల్ సబ్‌స్క్రిప్షన్, Apollo 24|7 సర్కిల్ బెనిఫిట్స్ వంటి మరిన్ని బెనిఫిట్స్ అదనంగా అందిస్తుంది.

Airtel and Jio offer 2.5GB daily 5G data, unlimited calling, and OTT benefits with these plans

Airtel and Jio offer 2.5GB daily 5G data, unlimited calling, and OTT benefits with these plans

2.5GB రోజువారీ డేటాతో Jio ప్రీపెయిడ్ ప్లాన్‌ల పూర్తి జాబితా :
జియో రూ. 349 ప్లాన్ : 30 రోజుల వ్యాలిడిటీతో ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ 2.5GB రోజువారీ లిమిట్, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతో మొత్తం 75 GB డేటాను అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ కోసం JioTV, JioCinema, JioCinema, Jio Cloud సహా Jio యాప్‌లకు సభ్యత్వాన్ని పొందవచ్చు. ముఖ్యంగా, (JioCinema) ప్రస్తుతం IPL 2023 సీజన్‌ను ఉచితంగా అందిస్తోంది. రిలయన్స్ జియో 5G నెట్‌వర్క్ ప్రాంతంలోని జియో యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటా స్పీడ్ కూడా పొందవచ్చు.

జియో రూ. 899 ప్లాన్ : ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. దాదాపు 3 నెలలు, 2.5GB రోజువారీ లిమిట్‌తో 225GB మొత్తం డేటాను అందిస్తుంది. వినియోగదారులు (JioCinema), 5G డేటా యాక్సెస్‌తో సహా జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS బెనిఫిట్స్ పొందవచ్చు.

జియో రూ 2023 ప్లాన్ : ఈ ప్లాన్ 6 నెలల కన్నా ఎక్కువ టైమ్ లిమిట్ అందిస్తుంది. అంటే 252 రోజులు. జియో యూజర్లు 2.5GB రోజువారీ హై స్పీడ్ డేటా లిమిట్, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతో మొత్తం 630GBని యాక్సెస్ చేయవచ్చు. జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్, అర్హత ఉన్న యూజర్లకు 5G డేటాతో అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : Redmi A2 Series : అత్యంత సరసమైన ధరకే రెడ్‌మి A2 సిరీస్.. భారత్‌లో కేవలం రూ.5,999 మాత్రమే.. సేల్ ఎప్పటినుంచంటే?