Airtel vs Vi Tariff Hike : యూజర్లకు అలర్ట్.. మీ మొబైల్ బిల్లు పెరిగినట్టే.. కొత్త ప్రీపెయిడ్ ధరలివే..!

ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు అలర్ట్. ఈ రెండు టెలికం కంపెనీల కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ ధరలు ఈ రోజు నుంచే (నవంబర్ 26) అమల్లోకి వచ్చేశాయి. ఇకపై మీ మొబైల్ బిల్ పెరిగినట్టే..

Airtel vs Vi Tariff Hike : యూజర్లకు అలర్ట్.. మీ మొబైల్ బిల్లు పెరిగినట్టే.. కొత్త ప్రీపెయిడ్ ధరలివే..!

Airtel And Vi Users, Your Mobile Bill Will Increase From Today New Prices Of Prepaid Plans

Airtel vs Vi Tariff Hike : ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) యూజర్లకు అలర్ట్. ఈ రెండు టెలికం కంపెనీల కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ ధరలు ఈ రోజు నుంచే (నవంబర్ 26) అమల్లోకి వచ్చేశాయి. ఇకపై మీ మొబైల్ బిల్ పెరిగినట్టే.. ఏదైనా ప్లాన్ రీచార్జ్ చేసుకోవాలంటే ఇప్పటినుంచి అదనంగా చెల్లించాల్సిందే.. ఇటీవలే ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా తమ ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్ ధరలను 20 నుంచి 25 శాతం పెంచేశాయి. నవంబర్ 25న కొత్త Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు ముందుగానే అందుబాటులోకి వచ్చేశాయి. కానీ, Airtel పెరిగిన ప్రీపెయిడ్ టారిఫ్ ధరలు మాత్రం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. 2019 డిసెంబర్‌లో టారిఫ్‌ను రేట్లు పెంచిన ఎయిర్‌టెల్… రెండేళ్ల తర్వాత మళ్లీ టారిఫ్ పెంచుతున్నట్టుగా (Tariff Hike) ప్రకటించింది. ఈ రెండు కంపెనీల కనీస రీఛార్జ్‌ల ధర రూ.99 కాగా.. 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్నాయి. ప్రతి టెలికం యూజర్ సగటు ఆదాయాన్ని (ARPU) పెంచడమే కాకుండా.. పరిశ్రమ ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడిని అధిగమించేందుకు Airtel, Vi టెలికం కంపెనీలు టారిఫ్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ రోజు నుండి కొత్త టారిఫ్ ధరలు అందుబాటులోకి వచ్చేశాయి. Airtel, Vi యూజర్లు తమ ఫోన్‌ నెంబర్లకు రీఛార్జ్ చేయాలంటే ఎంత చెల్లించాలో ఇప్పుడు చూద్దాం..

ఎంతవరకు పెంచాయి.. ఏయే బెనిఫిట్స్ ఉన్నాయంటే? :
ఇండియాలో 5G టెక్నాలజీ తీసుకొచ్చేందుకు ఎయిర్ టెల్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ తమ టారిఫ్ ప్లాన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఎయిర్ టెల్ టారిఫ్ ప్లాన్లపై ఎంతవరకు పెంచింది? ఏయే బెనిఫిట్స్ ఉన్నాయంటే.. ఎయిర్‌టెల్ రూ.79 ప్లాన్‌ కాస్తా రూ.99కు పెంచింది ఈ ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 28 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. 200MB డేటా వినియోగించుకోవచ్చు. వాయిస్ టారిఫ్ సెకన్‌కు పైసా చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 50 శాతం ఎక్కువ టాక్‌టైమ్ పొందవచ్చు. రూ.149 ప్లాన్‌.. రూ.179కి పెంచేసింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ప్రతిరోజూ 100 SMSలు నచ్చినవారికి పంపుకోవచ్చు. 2GB డేటా కూడా పొందవచ్చు. ఇకపోతే.. రూ.219 ప్లాన్‌ను రూ.265కి పెంచేసింది ఎయిర్‌టెల్. దీనిపై 28 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ప్రతిరోజు 100SMS పంపుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 1GB డేటా పొందవచ్చు. రూ.249 ప్లాన్‌ కాస్తా రూ.299కి పెంచేసింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ప్రతిరోజూ 100SMSలు వాడుకోవచ్చు. రోజూ 1.5GB డేటా పొందవచ్చు. రూ.298 ప్లాన్‌ను రూ.359వరకు పెంచేసింది ఎయిర్ టెల్.. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 28 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 100SMS పంపుకోవచ్చు. రోజూ 2GB డేటా కూడా పొందవచ్చు.

రూ.399 ప్లాన్‌ను రూ.479 వరకు పెంచింది. ఈ ప్లాన్‌పై 56 రోజుల వరకు వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100SMS వాడుకోవచ్చు. రోజూ 1.5GB డేటా పొందవచ్చు. రూ.449 ప్లాన్‌ను రూ.549 వరకు పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100SMSలు వాడుకోవచ్చు. రోజూ 2GB డేటా పొందవచ్చు. రూ.379 ప్లాన్‌ను రూ.455కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100SMSలు వాడుకోవచ్చు. మొత్తం 6GB డేటా వరకు పొందవచ్చు. రూ.598 ప్లాన్‌ రూ.719కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే.. 84 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. ఇక అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 100SMSలు పంపుకోవచ్చు. రోజూ 1.5GB డేటా పొందవచ్చు. రూ.698 ప్లాన్‌ను రూ.839కి పెంచేసింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. రోజూ 100 SMSలు పంపుకోవచ్చు. రోజూ 2GB డేటా పొందవచ్చు.

ఎయిర్ టెల్ వార్షిక ప్లాన్లు ఇవే :
రూ.1498 యాన్యువల్ ప్లాన్‌ (వార్షిక ప్లాన్)ను రూ.1799కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100SMSలు వాడుకోవచ్చు. మొత్తం 24GB డేటా పొందవచ్చు. రూ.2498 యాన్యువల్ ప్లాన్‌ను రూ.2999కి పెంచేసింది ఎయిర్ టెల్. ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. రూ.48 డేటా టాప్‌అప్ ప్లాన్‌ను రూ.58కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 3జీబీ డేటా లభిస్తుంది. రూ.98 డేటా టాప్‌అప్ ప్లాన్‌ను రూ.118కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 12జీబీ డేటా లభిస్తుంది. రూ.251 డేటా టాప్‌అప్ ప్లాన్‌ను రూ.301కి పెంచింది ఎయిర్‌టెల్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 50జీబీ డేటా లభిస్తుంది.

కొత్త VI ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే :
వోడాఫోన్ ఇండియా అందించే ప్రీపెయిడ్ ప్లాన్లలో ప్రైమరీ ప్లాన్ రూ.99తో ప్రారంభం అవుతుంది. 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్ గతంలో ధర రూ. 75గా ఉండేది. అలాగే అన్ లిమిటెడ్ వాయిస్ డేటా అందిస్తోంది. ప్రీపెయిడ్ కేటగిరీలో రూ. 149 ప్లాన్.. ఇప్పటినుంచి రూ. 179 ఉంటుంది. అలాగే రూ. 219 ధర రూ. 269 పెంచేసింది వోడాఫోన్ ఐడియా.. ఇప్పటి వరకు రూ.249గా ఉన్న టారిఫ్ ధర రూ. 299కు పెంచేసింది. అంతకుముందు రూ.299గా ఉన్న టారిఫ్ ధర రూ.359కు పెంచేసింది. అంతకుముందు రూ.379గా ఉన్న టారిఫ్ ధర రూ.459కు పెంచేసింది వోడాఫోన్ ఐడియా. రూ. 399 ప్లాన్ ధర ఇప్పుడు రూ. 479కు పెంచేసింది. రూ. 449 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ. 539కి పెరిగింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లన్నీ ఫ్రీ వాయిస్ కాలింగ్ సర్వీసులతో పాటు రోజుకు 100 SMSలను పొందవచ్చు. వ్యాలిడిటీ వ్యవధి, ఇంటర్నెట్ డేటాలో వేర్వేరుగా ఉన్నాయి. Vi ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 699 ధర ఇప్పుడు రూ. 839కి పెరిగింది. 365 రోజుల వ్యాలిడిటీ కలిగిన వార్షిక ప్లాన్‌లలో రూ. 1,499 ప్లాన్ ధర రూ. 1,799, రూ. 2,399 ప్లాన్ ధర రూ. 2,899తో ఇప్పటినుంచి అందుబాటులో ఉండనున్నాయి.

Read Also : NASA Dart Mission : అదిగో ఆస్టరాయిడ్ దూసుకొస్తోంది.. ‘డైనోసార్ల ప్రతీకారం తీర్చుకోండి’ ఎలన్ మస్క్‌ ట్వీట్!