Airtel CashBack Offer : ఎయిర్‌టెల్ అదిరే ఆఫర్ .. ఆ స్మార్ట్‌ఫోన్స్ కొంటే రూ.6వేలు క్యాష్‌బ్యాక్

ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ.12,000 వరకు ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లకు భారతి ఎయిర్‌టెల్ రూ.6,000 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది.

Airtel CashBack Offer : ఎయిర్‌టెల్ అదిరే ఆఫర్ .. ఆ స్మార్ట్‌ఫోన్స్ కొంటే రూ.6వేలు క్యాష్‌బ్యాక్

Airtel Cashback Offer

Airtel CashBack Offer : కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అమ్మకాలు చేపట్టింది. అమెజాన్ ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించడంతో కస్టమర్లు ఎగబడి కొనుగోలు చేశారు. ఇక ఇదిలా ఉంటే భారతి ఎయిర్‌టెల్ కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Read More :  గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిన స్మార్ట్‌వాచ్‌..చావుబతుకుల్లో ఉన్న అతని ప్రాణం కాపాడింది

ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ.12,000 వరకు ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లకు భారతి ఎయిర్‌టెల్ రూ.6,000 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఎయిర్‌టెల్ ఎంపిక చేసిన 150కి పైగా స్మార్ట్‌ఫోన్లలో ఏదైనా ఒకటి కొనుగోలు చెయ్యాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్ పొందాలంటే భారతి ఎయిర్‌టెల్ కొన్ని షరతులు పెట్టింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Read More : Eye Treatment With IPhone : ‘ఐ’ ఫోన్‌13తో ‘ఐ’ ట్రీట్మెంట్‌ చేస్తున్న డాక్టర్..

ఎయిర్‌టెల్ పెట్టిన షరతు

ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందాలి అనుకునే వారు 36 నెలలపాటు రూ.249 అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకోవాలి. వ్యాలిడిటీ రీఛార్జ్ మిస్ అయితే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తించదు. ఈ ప్రోగ్రామ్ కింద మొబైల్ కొనే కస్టమర్ల స్మార్ట్‌ఫోన్కు ఏదైనా డ్యామేజీ జరిగినట్లయితే సెర్విఫై ద్వారా ఒక్కసారి ఫ్రీ స్క్రీన్ రీప్లేస్ మెంట్ కు అర్హులు. దీని వలన అదనంగా రూ.4800వరకు ప్రయోజనం కలగనుంది. కస్టమర్ రెండు దశలలో క్యాష్ బ్యాక్ అందుకొనున్నారు. మొబైల్ కొన్న 18 నెలల తరువాత మొదటి విడత కింద ₹2000, మిగతా 4 వేల రూపాయలను 36 నెలల తర్వాత అందుకుంటారు.