Airtel Prepaid Plans : ఎయిర్‌టెల్ నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. 60GB డేటా, మరెన్నో బెనిఫిట్స్..!

Airtel Prepaid Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. 30 రోజుల వ్యాలిడిటీతో 60GB డేటాతో భారీ డేటా బెనిఫిట్స్ అందిస్తోంది.

Airtel Prepaid Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. 30 రోజుల వ్యాలిడిటీతో 60GB డేటాతో భారీ డేటా బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ప్లాన్‌ల ధర రూ. 489, రూ. 509 అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, Wynk మ్యూజిక్, హలో ట్యూన్స్, ఉచిత యాక్సెస్ వంటి ఇతర బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. FASTagపై రూ.100 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ రెండు ప్లాన్‌లు 30 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. అదనంగా, రూ. 301కి 50GB డేటాతో డేటా యాడ్-ఆన్ ప్లాన్ కూడా పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 489 ప్లాన్ బెనిఫిట్స్ :
ఎయిర్‌టెల్ రూ. 489 ప్రీపెయిడ్ ప్లాన్ 50GB మొబైల్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ లోకల్/STD వాయిస్ కాలింగ్, 100 SMS/రోజు 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. వినియోగదారులు Wink మ్యూజిక్, ఉచిత హలో ట్యూన్స్ సహా ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్స్ ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు. ఫాస్ట్‌ట్యాగ్, అపోలో 24/7 సర్కిల్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Airtel Introduces Rs. 489 and Rs. 509 Prepaid Recharge Plans

ఎయిర్‌టెల్ రూ. 509 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్ :
Airtel నుంచి కొత్త రూ. 509 ప్రీపెయిడ్ ప్లాన్ అదే బెనిఫిట్స్ అందిస్తుంది. రూ. 489 ప్రీపెయిడ్ ప్లాన్, 10GB అదనపు డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ 60GB డేటా లిమిట్‌తో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100 SMS/రోజు ఒక నెల పాటు వస్తుంది. ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్స్ ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇతర బెనిఫిట్స్ పొందాలంటే.. వింక్ మ్యూజిక్, హలో ట్యూన్స్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్, అపోలో 24/7 సర్కిల్ ఉంటాయి. ఈ రెండు ప్లాన్‌లతో పాటు, డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లను ఎంచుకునేందుకు ఇష్టపడే యూజర్లు ప్రస్తుత రూ. 301 ప్లాన్‌లో Wynk Music Premiumకి యాక్సెస్‌తో పాటు 50GB అదనపు డేటాను కూడా పొందవచ్చు.

మరో దీర్ఘకాలిక ప్లాన్ ధర రూ. 3,359 ద్వారా ఏడాది పాటు ఉచిత డిస్నీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ ఏడాది మార్చి నాటికి ఎయిర్‌టెల్ టారిఫ్‌లను 10 శాతం వరకు పెంచుతున్నట్లు సమాచారం. 2023, 2024, 2025 ఆర్థిక సంవత్సరాల చివరి త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో టారిఫ్‌లను పెంచుతాయని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ జెఫరీస్ తెలిపింది. విశ్లేషకుల ప్రకారం.. కంపెనీల రాబడి, మార్జిన్‌లపై ఒత్తిడి పెరుగుతోంది. దాంతో ఒక్కో యూజర్లకు (ARPU) సగటు రాబడిలో లాభాలు పెంపునకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel Prepaid Plans Offer : ఎయిర్‌టెల్ యూజర్లకు అదిరే ఆఫర్లు.. ఆ రెండు ప్లాన్లపై ఫ్రీగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు!

ట్రెండింగ్ వార్తలు