Airtel Free OTT Plans : ఎయిర్‌టెల్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఫ్రీగా OTT సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు.. పూర్తి వివరాలు మీకోసం..!

Airtel OTT Plans : భారతీయ టెలికాం ఆపరేటర్లు ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio) గత ఏడాదిలో వివిధ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించాయి. ఎంపిక చేసిన లేదా దాదాపు అన్ని ప్లాన్‌ల నుంచి OTT బెనిఫిట్స్ తొలగించాయి.

Airtel Free OTT Plans : ఎయిర్‌టెల్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఫ్రీగా OTT సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు.. పూర్తి వివరాలు మీకోసం..!

Airtel is now offering free Disney+ Hotstar subscription with 7 more plans_ check full details

Airtel Free OTT Plans : భారతీయ టెలికాం ఆపరేటర్లు ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio) గత ఏడాదిలో వివిధ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించాయి. ఎంపిక చేసిన లేదా దాదాపు అన్ని ప్లాన్‌ల నుంచి OTT బెనిఫిట్స్ తొలగించాయి. జియో యూజర్లు ప్రస్తుతం ఎంపిక చేసిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో OTT బెనిఫిట్స్ పొందవచ్చు. Airtel యూజర్లు సైతం ఇప్పటికీ కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లలో OTT బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే, ఇటీవలి టారిఫ్ అప్‌డేట్‌లో ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, OTT బెనిఫిట్స్ అందించే మరిన్ని ప్లాన్‌లకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు ఉచిత సభ్యత్వాన్ని ఆఫర్ చేస్తోంది.

టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. Airtel కేవలం రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లకు మాత్రమే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ (Free Disney+ Hotstar subscription)ను అందిస్తోంది. ఇప్పటికే రూ. 399, రూ. 839, రూ. 499, రూ. 3359 ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి అప్‌డేట్‌లో, టెల్కో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కి ఉచిత సభ్యత్వాన్ని చేర్చింది. మరో 3 ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్లలో (రూ. 719, రూ. 779, రూ. 999) వంటి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్ వంటి బెనిఫిట్స్ అందిస్తోంది. OTT బెనిఫిట్స్ అందించే మొత్తం 7 ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం..

Airtel ప్రీపెయిడ్ OTT ప్లాన్లు ఇవే :
రూ. 399 ప్లాన్ : ఈ ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌కు 3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. కాలింగ్, ఇంటర్నెట్ విషయానికొస్తే.. ప్లాన్ అన్ని లోకల్, STD, రోమింగ్ నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 2.5GB రోజువారీ డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ అపోలో 24|7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్ వంటి మరిన్నో అందుబాటులో ఉన్నాయి.

రూ. 499 ప్లాన్ : ఈ ప్లాన్ ద్వారా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌కు 3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో 3GB రోజువారీ డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. రోజుకు 100 SMS, 28 వ్యాలిడిటీ అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉన్నాయి. అదనపు బెనిఫిట్స్ పొందాలంటే అపోలో 24|7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలో ట్యూన్స్ వంటి మరిన్ని ఉన్నాయి.

Airtel is now offering free Disney+ Hotstar subscription with 7 more plans_ check full details

Airtel is now offering free Disney+ Hotstar subscription with 7 more plans

రూ. 719 ప్లాన్ : ఈ ప్లాన్ ద్వారా యాప్, వెబ్‌లో Disney Plus Hotstar మొబైల్‌కు 3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అలాగే, 1.5GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 84 రోజుల ప్యాక్ వ్యాలిడిటీతో రోజుకు 100 SMSలను పొందవచ్చు.

Read Also : Airtel 5G Plus Services : దేశంలో 22 నగరాల్లో ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులు.. ఫుల్ లిస్టు ఇదిగో.. 5G నెట్‌వర్క్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?

రూ. 779 ప్లాన్ : ఈ ప్యాక్‌తో యూజర్లు 1.5GB రోజువారీ ఇంటర్నెట్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, 90 రోజుల పాటు మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. OTT బెనిఫిట్స్ పొందాలంటే.. ఎయిర్‌టెల్ యాప్, వెబ్‌లో 3 నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌కు ఉచిత సభ్యత్వాన్ని కలిగి ఉండాలి.

రూ. 839 ప్లాన్ : ఎయిర్‌టెల్ ఇతర ప్లాన్‌ల మాదిరిగానే, ఈ ప్రీపెయిడ్ ప్యాక్‌లో కూడా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 84 రోజుల పాటు 2GB రోజువారీ డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. అదనంగా, యూజర్లు Disney Plus Hotstar మొబైల్, మరిన్నింటికి 3 నెలల సభ్యత్వాన్ని పొందవచ్చు.

రూ. 999 ప్లాన్ : ఈ మూడు నెలల ప్లాన్ ద్వారా కాలింగ్, SMS బెనిఫిట్స్, 2.5GB రోజువారీ డేటా రోల్ ఓవర్‌తో 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌తో, వినియోగదారులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌కు 3 నెలల సబ్‌స్క్రిప్షన్, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌కు 84 రోజుల సబ్‌స్క్రిప్షన్‌తో డ్యూయల్ OTT బెనిఫిట్స్ పొందవచ్చు.

రూ. 3359 ప్లాన్ : ఈ వార్షిక ప్లాన్‌లో 356 రోజుల పాటు 2.5GB రోజువారీ డేటా, SMS కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. OTT విషయానికొస్తే.. వినియోగదారులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌కు ఒక ఏడాది సభ్యత్వాన్ని పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Jio vs Airtel Plans : రిలయన్స్ జియో vs ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే.. 2.5GB రోజువారీ డేటా లిమిట్.. ఏయే ప్లాన్ల ధర ఎంతంటే? పూర్తి వివరాలు మీకోసం..!