Airtel Free Data Offer : ఎయిర్‌టెల్ అదిరే ఆఫర్.. రోజూ అదనంగా ఫ్రీ డేటా పొందొచ్చు!

ఎయిర్ టెల్ అదిరే ఆఫర్ ప్రకటించింది. టారిఫ్ రేట్లు అమాంతం పెంచేసి ప్రీపెయిడ్ యూజర్లకు షాకిచ్చిన ఎయిర్ టెల్.. ఇప్పుడు ప్రీపెయిడ్ యూజర్లకు అదనంగా ప్రీ డేటా ఆఫర్ అందిస్తోంది.

Airtel Free Data Offer : ఎయిర్‌టెల్ అదిరే ఆఫర్.. రోజూ అదనంగా ఫ్రీ డేటా పొందొచ్చు!

Airtel Now Offering Free 500mb Data Per Day With Selected Prepaid Plans

Airtel Free Data Offer : ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్ టెల్ అదిరే ఆఫర్ ప్రకటించింది. టారిఫ్ రేట్లు అమాంతం పెంచేసి ప్రీపెయిడ్ యూజర్లకు షాకిచ్చిన ఎయిర్ టెల్.. ఇప్పుడు అదే యూజర్లకు అదనంగా ప్రీ డేటా ఆఫర్ అందిస్తోంది. ఎంపిక చేసుకున్న ప్రీపెయిడ్ ప్లాన్లలో రోజుకు 500MB వరకు అదనంగా ఉచిత డేటాను అందిస్తోంది. Airtel ప్రీపెయిడ్ ప్లాన్‌ల టారిఫ్‌లను కొద్దిగా సవరించింది. ఇకపై ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు రూ. 99 నుంచి ప్రారంభమవుతాయి. మీరు మీ నంబర్లను రూ.265, రూ. 299, రూ. 719, రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఈ అదనపు 500MB ఉచిత డేటాను పొందవచ్చు. ప్లాన్‌ల ధరను పెంచినప్పటికీ.. ఎయిర్‌టెల్ ఎక్కువ టాక్ టైమ్ (TalkTime)తో పాటు మరింత డేటాను ఆఫర్ చేస్తోంది.

TelecomTalk ప్రకారం.. ఎయిర్‌టెల్ అదనపు మొబైల్ డేటాను అందిస్తోంది. కానీ, ఈ ఫ్రీ డేటా ఆఫర్ అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లకు వర్తించదు. రూ.265 ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్, 28 రోజుల పాటు రోజుకు 1.5GB డేటాతో వస్తుంది. రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులకు 2GB రోజువారీ డేటాను ఆఫర్ చేస్తుంది. రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2.5GB డేటాను 84 రోజుల పాటు అందిస్తుంది. Airtel కొత్త ఉచిత అదనపు డేటా ప్లాన్‌తో యూజర్లు ప్రస్తుత డేటా ప్లాన్‌పై 500MB వరకు అదనంగా ఉచిత డేటాను పొందవచ్చు.

అదనపు డేటాను పొందడానికి యూజర్లు తమ స్మార్ట్ ఫోన్‌లోని Airtel Thanks యాప్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లాన్ వ్యాలిడిటీ ముగిసేంతవరకు అదనపు డేటా యాక్సస్ చేసుకోవచ్చు. మీ అదనపు 500MB డేటాను వాడకుండా అలానే ఉండి.. ఒకవేళ మీ ప్రస్తుత ప్లాన్ ముగిస్తే మాత్రం డేటా ఫార్వర్డ్ కాదు.. అది కూడ ఎక్స్ పెయిర్ అయిపోతుందని గుర్తించాలి. టాప్-పాప్ ప్లాన్‌ మాదరిగానే ఈ ఫ్రీ డేటా ప్లాన్ ఉంటుంది. మీ ప్రైమరీ ప్రీపెయిడ్ ప్లాన్ యాక్టివ్‌గా ఉన్నంతవరకు మాత్రమే యాడ్-ఆన్ డేటా (Add-On Data) వ్యాలిడిటీ ఉంటుంది. మీ ప్రైమరీ ప్రీపెయిడ్ ప్లాన్ ముగిసిన వెంటనే యాడ్-ఆన్ ప్లాన్ కూడా నిలిచిపోతుంది. Airtel కొత్త అదనపు డేటా ఆఫర్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలానికి వ్యాలిడిటీ వర్తిస్తుందా? లేదా అనేది కంపెనీ వెల్లడించలేదు.

ఎయిర్‌టెల్ నెలవారీ, త్రైమాసిక వార్షిక ప్లాన్‌ల ధరలను పెంచింది. రూ. 219 ధర ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ. 265గా ఉండగా.. రూ. 249 ప్లాన్ ధర రూ. 299 వరకు పెరిగింది. అలాగే రూ. 298 ప్లాన్ ఇప్పుడు రూ. 359కు పెరిగింది. అంతేకాదు.. రూ. 399 ప్లాన్ ధర ఇప్పుడు రూ. 479కి పెరిగింది. ప్రీపెయిడ్ ప్లాన్‌లు రోజువారీ డేటా బెనిఫిట్స్, అన్ లిమిటెడ్ కాల్‌లతో పాటు ఉచితంగా రోజు SMSలు పొందవచ్చు. ఎయిర్‌టెల్‌తో పాటు, వోడాఫోన్ ఐడియా కూడా తన ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో కూడా తన ప్రీపెయిడ్ టారిఫ్‌లను 20శాతం వరకూ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్‌లు 2021 డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

Read Also : Jio TV + Jio Tablet : రిలయన్స్ జియో ఫస్ట్ టీవీ, ట్యాబ్లెట్ వస్తున్నాయ్.. ఎప్పుడంటే?