Airtel Free OTT Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఈ ప్లాన్లపై ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం..!

Airtel Free OTT Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) తమ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్ల ద్వారా ఉచితంగా ఓటీటీ బెనిఫిట్స కూడా పొందవచ్చు. ఎయిర్‌టెల్ ఒకే ప్లాన్‌లో రెండు లేదా మల్టీ సర్వీసులను అందిస్తోంది.

Airtel Free OTT Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఈ ప్లాన్లపై ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం..!

Airtel offering free Netflix and Amazon Prime subscription with select plans_ check full list

Airtel Free OTT Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) తమ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్ల ద్వారా ఉచితంగా ఓటీటీ బెనిఫిట్స కూడా పొందవచ్చు. ఎయిర్‌టెల్ ఒకే ప్లాన్‌లో రెండు లేదా మల్టీ సర్వీసులను అందిస్తోంది. ఎయిర్‌టెల్ బ్లాక్‌గా పిలిచే ఈ సర్వీసులు వినియోగదారులను ఎయిర్‌టెల్ మొబైల్, DTH, ఫైబర్ సర్వీసులను ఒకే ప్లాన్‌లో యాడ్ చేసేందుకు అనుమతిస్తుంది. తద్వారా ఎయిర్‌టెల్ యూజర్లు మల్టీ బిల్లులను నిర్వహించాల్సిన అవసరం లేదు. దానితో పాటు యూజర్లు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు (Amazon Prime Videos) మరిన్నింటితో సహా టాప్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ఫ్రీగా OTT సభ్యత్వాలతో అన్‌లిమిటెడ్ కాలింగ్, ఇంటర్నెట్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

మీరు మల్టీ ఎయిర్‌టెల్ కనెక్షన్‌లను కలిగి ఉంటే.. క్లబ్ చేసి OTT ఆఫర్‌లను పొందవచ్చు. మీరు Airtel బ్లాక్‌లో చేరవచ్చు. ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీల్లో నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియోలు (Amazon Prime Videos) లేదా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar)కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో సహా OTT బెనిఫిట్స్ పొందాలంటే Airtel బ్లాక్ ప్లాన్‌లను ఓసారి లుక్కేయండి..

ఎయిర్‌టెల్ బ్లాక్ ఫ్రీ OTT బెనిఫిట్స్ ప్లాన్లు ఇవే :
ఎయిర్‌టెల్ బ్లాక్ రూ 699 ప్లాన్ : ఈ ప్లాన్ కింద.. ఎయిర్‌టెల్ యూజర్లు ఫైబర్ (Fiber), ల్యాండ్‌లైన్ కనెక్షన్‌లను యాడ్ చేయవచ్చు. 40 Mbps వేగంతో అన్‌లిమిటెడ్ కాలింగ్, ఇంటర్నెట్‌ను పొందవచ్చు. నెలవారీ బిల్లింగ్ సైకిల్‌తో, యూజర్లు DTHలో రూ. 300 విలువైన టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కు ఉచిత సభ్యత్వాన్ని పొందవచ్చు. Airtel XStream యాప్ ద్వారా, యూజర్లు SonyLIV, Lionsgate మరిన్నింటితో సహా మరిన్ని OTT ఛానెల్‌లను యాక్సెస్ చేయవచ్చు.

Airtel offering free Netflix and Amazon Prime subscription with select plans_ check full list

Airtel offering free Netflix and Amazon Prime subscription with select plans

Read Also : Jio vs Airtel Plans : రిలయన్స్ జియో vs ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే.. 2.5GB రోజువారీ డేటా లిమిట్.. ఏయే ప్లాన్ల ధర ఎంతంటే? పూర్తి వివరాలు మీకోసం..!

ఎయిర్‌టెల్ బ్లాక్ రూ 899 ప్లాన్ : ఈ ప్లాన్‌తో యూజర్లు DTHతో 2 పోస్ట్‌పెయిడ్‌ను క్లబ్ చేయవచ్చు. 105 GB ఇంటర్నెట్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లకు ఉచిత సభ్యత్వాన్ని పొందవచ్చు.

ఎయిర్‌టెల్ బ్లాక్ రూ. 1098 ప్లాన్ : ఫైబర్, ల్యాండ్‌లైన్ కనెక్షన్‌లతో వినియోగదారులు 100 Mbps వేగంతో అన్‌లిమిటెడ్ కాలింగ్, ఇంటర్నెట్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. పోస్ట్‌పెయిడ్ మొబైల్ కనెక్షన్‌లో, యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 75GB డేటాను పొందవచ్చు. OTT బెనిఫిట్స్ పొందాలంటే.. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లకు ఉచిత సభ్యత్వాన్ని పొందవచ్చు.

ఎయిర్‌టెల్ బ్లాక్ 1099 ప్లాన్ : ఈ ప్లాన్‌లు ఫైబర్, ల్యాండ్‌లైన్, DTH కనెక్షన్‌లతో కలిపి అన్‌లిమిటెడ్ కాలింగ్, ఇంటర్నెట్‌ను 200 Mbps వేగంతో రూ. 350 విలువైన టీవీ ఛానెల్‌లను అందిస్తాయి. OTT బండిల్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఉన్నాయి.

Airtel offering free Netflix and Amazon Prime subscription with select plans_ check full list

Airtel offering free Netflix and Amazon Prime subscription with select plans

Airtel బ్లాక్ రూ 1599 ప్లాన్ : ఫైబర్, ల్యాండ్‌లైన్, DTH బెనిఫిట్స్ పొందాలంటే.. నెట్‌ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో సహా ఫైబర్‌పై 300mbps స్పీడ్ పొందవచ్చు.

Airtel బ్లాక్ రూ 1799 ప్లాన్ : ఈ ప్లాన్ కింద యూజర్లు ఫైబర్, ల్యాండ్‌లైన్, గరిష్టంగా 4 పోస్ట్‌పెయిడ్ మొబైల్ కనెక్షన్‌లను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫైబర్‌పై గరిష్టంగా 200 Mbps స్పీడ్, పోస్ట్‌పెయిడ్ మొబైల్‌లో 190GB ఇంటర్నెట్ డేటా ఉన్నాయి. OTT బండిల్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఉన్నాయి.

ఎయిర్‌టెల్ బ్లాక్ రూ. 2299 ప్లాన్ : ఎయిర్‌టెల్ యూజర్లు ఫైబర్ ల్యాండ్‌లైన్, 4 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌లను కలిపి అన్‌లిమిటెడ్ కాలింగ్, ఇంటర్నెట్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఫైబర్‌లో గరిష్టంగా 300 Mbps స్పీడ్, మొబైల్ కనెక్షన్‌లో 240GB డేటాను పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel Free OTT Plans : ఎయిర్‌టెల్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఫ్రీగా OTT సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు.. పూర్తి వివరాలు మీకోసం..!