డోంట్ మిస్ : Airtel 4G మైండ్ బ్లోవింగ్ ఆఫర్స్

10TV Telugu News

సమ్మర్ వచ్చేసింది. టెలికం ఆపరేటర్లు పోటీపడి తమ కస్టమర్లకు సమ్మర్ ఆఫర్లు అందిస్తున్నారు. చౌకైన ధరకే డేటా ప్లాన్లు అందిస్తూ యూజర్లను తమవైపు తిప్పుకుంటున్న రిలయన్స్ జియో తక్కువ వ్యవధిలోనే మొబైల్ ఇండస్ట్రీని షేక్ చేసింది. జియో పోటీని తట్టుకునేందుకు ఇతర టెలికం ఆపరేటర్లు కూడా కొత్త కొత్త ఆఫర్లు, డేటా ప్లాన్ తో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఇండియా మొబైల్ మార్కెట్ లో 4జీ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే రిలయన్స్ జియో, వోడాఫోన్, ఐడియా టెలికం దిగ్గజాలు 4జీ నెట్ వర్క్ తో సరికొత్త డేటా అన్ లిమిటెడ్ ప్లాన్లు అందిస్తూ మార్కెట్లో ట్రెండ్ సృష్టించాయి.
Also Read : ఫేస్‌బుక్‌ మెసేంజర్‌లో మరో కొత్త ఫీచర్

4జీ నెట్ వర్క్ లో మిగతా వాటితో పోటీగా ప్రముఖ టెలికం నెట్ వర్క్ దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ కూడా తమ కస్టమర్ల కోసం మైండ్ బ్లోవింగ్ ఆఫర్లను సమ్మర్ స్పెషల్ గా అందిస్తోంది. ఎయిర్ టెల్ 4జీ నెట్ వర్క్ పై సరికొత్త డేటా ప్లాన్లతో ముందుకొస్తోంది. తమ ప్రీపెయిడ్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు బెస్ట్ సెల్లింగ్ అన్ లిమిటెడ్ ప్యాక్స్ ను అందిస్తోంది. ఎయిర్ టెల్ 4జీ నెట్ వర్క్ పై ప్రీపెయిడ్ డేటా ప్లాన్లు ప్రారంభ ధర  రూ.199 నుంచి రూ.399, రూ. 448, రూ.509 వరకు అందిస్తోంది. ఎయిర్ టెల్ 4జీ డేటాపై అందించే రీఛార్జ్ ప్లాన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి. 

ఎయిర్ టెల్ 4G రీఛార్జ్ డేటా ప్లాన్స్ ఇవే..

రూ.199 రీఛార్జ్ ప్యాక్ : 
* ఎయిర్ టెల్ అందిస్తోన్న ఈ డేటా ప్లాన్ పై అన్ లిమిటెడ్ లోకల్, STD కాల్స్ . 
రోమింగ్..  కస్టమర్లు అన్ లిమిటెడ్ ఇన్ కమింగ్ కాల్స్,  ఔట్ గోయింగ్ కాల్స్
రోజుకు 100 లోకల్, నేషనల్ ఎస్ఎంఎస్ లు
రూ.199 తో రీఛార్జ్ చేసుకుంటే చాలు.. 28 రోజుల వ్యాలిడెటీ. 
ఈ ప్యాక్ పై కస్టమర్లు రోజుకు 4G డేటాపై 1.5GB డేటా 

రూ.399 రీఛార్జ్ ప్యాక్ : 
*
ఎయిర్ టెల్ కస్టమర్లు రోమింగ్ పై అన్ లిమిటెడ్ ఇన్ కమింగ్ కాల్స్, అన్ లిమిటెడ్ ఔట్ గోయింగ్ కాల్స్ పొందొచ్చు. 
అన్ లిమిటెడ్ లోకల్, ఎస్ టీడీ కాల్స్
రోజుకు 100లోకల్, నేషనల్ ఎస్ఎంఎస్ లు. 
రోజుకు 4జీ డేటాపై 1GB డేటా పొందొచ్చు. 
రూ. 399 రీఛార్జ్ చేసుకుంటే చాలు.. 84 రోజుల కాల పరిమితి పొందొచ్చు.

రూ. 448 రీఛార్జ్ ప్లాన్ : 
ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే చాలు.. అన్ లిమిటెడ్ లోకల్, ఎస్ టీడీ కాల్స్ పొందొచ్చు. రోమింగ్ పై అన్ లిమిటెడ్ ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ 
రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, ప్యాక్ వ్యాలిడెటీ 82 రోజులు 
రోజుకు 4జీ డేటాపై 1.5GB డేటా 

రూ. 509 రీఛార్జ్ ప్యాక్ : 
ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే చాలు.. 90 రోజుల కాలపరిమితిపై ఎయిర్ టెల్ కస్టమర్లు అన్ లిమిటెడ్ లోకల్, ఎస్ టీడీ కాల్స్ పొందొచ్చు.
రోమింగ్.. అన్ లిమిటెడ్ ఇన్ కమింగ్ కాల్స్, అన్ లిమిటెడ్ ఔట్ గోయింగ్ కాల్స్ 
90 రోజుల వ్యాలిడెటీపై రోజుకు 1.4GB డేటా పొందొచ్చు. 

Also Read : బీ కేర్‌ ఫుల్: వాట్సాప్‌లో పోస్ట్‌.. గ్రూప్‌ అడ్మిన్‌తోపాటు ఒకరు అరెస్ట్‌