Airtel OTT Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఫ్రీ OTT సబ్‌స్ర్కిప్షన్, అన్‌లిమిటెడ్ 5G డేటా.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Airtel OTT Plans : భారతీ ఎయిర్‌టెల్ ఇటీవల ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లందరికి అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్‌ ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ 5G ప్లస్ నెట్‌వర్క్ ప్రాంతంలో నివసిస్తున్న ఎయిర్‌టెల్ యూజర్లు తమ 5G-సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఫ్రీ అన్‌లిమిటెడ్ వేగవంతమైన 5G డేటాను పొందవచ్చు.

Airtel OTT Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఫ్రీ OTT సబ్‌స్ర్కిప్షన్, అన్‌లిమిటెడ్ 5G డేటా.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Airtel OTT Plans _ Airtel plans offering free Disney+ Hotstar subscription with unlimited 5G data

Airtel OTT Plans : భారతీ ఎయిర్‌టెల్ ఇటీవల ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లందరికి అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్‌ను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ 5G ప్లస్ నెట్‌వర్క్ ప్రాంతంలో నివసిస్తున్న ఎయిర్‌టెల్ యూజర్లు తమ 5G-సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఫ్రీ అన్‌లిమిటెడ్ వేగవంతమైన 5G డేటాను పొందవచ్చు. ఈ ఆఫర్ రూ. 239, అంతకంటే ఎక్కువ యాక్టివ్ డేటా ప్లాన్‌ను కలిగిన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ కనెక్షన్‌లను కలిగిన యూజర్లందరికి అందుబాటులో ఉంటుంది.

అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్‌తో పాటు, సర్వీస్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపర్చేందుకు ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లపై డిస్నీ హాట్‌స్టార్ ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్ వంటి అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది. రాబోయే IPL 2023 సీజన్‌లో క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూజర్లు లేదా ఏదైనా సిరీస్ లేదా ఇతర OTT కంటెంట్‌ని ఎక్కువగా చూడాలనుకునే యూజర్లు ఇప్పుడు స్పీడ్ 5G నెట్‌వర్క్‌తో ఉచితంగా ఎంజాయ్ చేయొచ్చు. అన్‌లిమిటెడ్ 5G డేటా, కాలింగ్, SMS వంటి అదనపు బెనిఫిట్స్ అందించే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను వివరంగా పరిశీలిద్దాం.

ఎయిర్‌టెల్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాన్ :

ఎయిర్‌టెల్ రూ. 399 ప్లాన్ : రూ. 399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌కు 3 నెలల ఉచిత సబ్‌స్ర్కిప్షన్ అందిస్తుంది. Airtel రోజుకు 100 SMSలతో పాటు 2.5GB రోజువారీ డేటా బెనిఫిట్స్ అందిస్తోంది. అన్ని లోకల్, STD, రోమింగ్ నెట్‌వర్క్‌ల ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్ అపోలో 24|7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్ వంటి అదనపు బెనిఫిట్స్‌తో పాటు ఆరోగ్య సంరక్షణ సర్వీసులకు 24/7 యాక్సెస్‌ని అందిస్తుంది.

Airtel OTT Plans _ Airtel plans offering free Disney+ Hotstar subscription with unlimited 5G data

Airtel OTT Plans _ Airtel plans offering free Disney+ Hotstar subscription with unlimited 5G data

Read Also : Airtel Plans Price Hike : ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్.. 57శాతం పెరిగిన చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు.. ఇప్పుడు ఒక్కో ప్లాన్ ధర ఎంతో తెలుసా?

ఎయిర్‌టెల్ రూ. 499 ప్లాన్ : ఎక్కువ డేటా అవసరమయ్యే కస్టమర్లకు రూ.499 ప్లాన్ బెస్ట్ ఆప్షన్. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌లో 3GB రోజువారీ డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉన్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌కు కస్టమర్‌లు 3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలో ట్యూన్స్ వంటి అదనపు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 839 ప్లాన్ : దీర్ఘకాలిక ప్లాన్ కోసం చూస్తున్న యూజర్లు రూ. 839 ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 100 SMS, 2GB రోజువారీ డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌కు 3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్, ఇతర బెనిఫిట్స్ కూడా కస్టమర్‌లు పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 3359 ప్లాన్ : వార్షిక ప్లాన్ కోసం చూస్తున్న వినియోగదారులు రూ. 3359 ప్లాన్‌ ఎంచుకోవచ్చు. ఈ వార్షిక ప్లాన్‌లో 356 రోజుల పాటు 2.5GB రోజువారీ డేటా, SMS, కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. అదనంగా, కస్టమర్‌లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ (Disney+ Hotstar Mobile), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) మొబైల్ ఎడిషన్‌కు 1-ఏడాది సభ్యత్వాన్ని పొందవచ్చు.

ముఖ్యంగా, ఈ ప్లాన్‌లన్నీ ఎయిర్‌టెల్ 5G ప్లస్-రెడీ నగరాల్లో నివసిస్తున్న వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తాయి. (Airtel 5G) ప్రస్తుతం 500 కన్నా ఎక్కువ నగరాల్లో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు ఎయిర్‌టెల్ 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

Read Also : Best Airtel Plans : రూ. 500లోపు బెస్ట్ ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే.. అన్‌లిమిటెడ్ 5G డేటా.. ఫుల్ లిస్టు ఇదిగో.. మరెన్నో బెనిఫిట్స్