Airtel Women 5G Jobs : భారత్‌లో ఎయిర్‌టెల్ మహిళా ఇంజినీర్లకు 5G సంబంధిత ఉద్యోగాలు.. ఎప్పటినుంచంటే?

Airtel Women 5G Jobs : భారతీ ఎయిర్‌టెల్ (Airtel) తన 5G ప్లస్ సర్వీసుల (Airtel 5G Plus Services)ను ఇప్పటివరకు 12 భారతీయ నగరాల్లో ప్రారంభించింది. ఈ నగరాల్లో ఢిల్లీ, ముంబై, వారణాసి, సిలిగురి, బెంగళూరు, హైదరాబాద్, నాగ్‌పూర్, చెన్నై, గురుగ్రామ్, పానిపట్, పాట్నా, గౌహతి ఉన్నాయి.

Airtel Women 5G Jobs : భారత్‌లో ఎయిర్‌టెల్ మహిళా ఇంజినీర్లకు 5G సంబంధిత ఉద్యోగాలు.. ఎప్పటినుంచంటే?

Airtel plans to hire more women engineers for 5G related job roles in India

Airtel Women 5G Jobs : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ (Airtel) తన 5G ప్లస్ సర్వీసుల (Airtel 5G Plus Services)ను ఇప్పటివరకు 12 భారతీయ నగరాల్లో ప్రారంభించింది. ఈ నగరాల్లో ఢిల్లీ, ముంబై, వారణాసి, సిలిగురి, బెంగళూరు, హైదరాబాద్, నాగ్‌పూర్, చెన్నై, గురుగ్రామ్, పానిపట్, పాట్నా, గౌహతి ఉన్నాయి. 2024 ప్రారంభంలో దేశవ్యాప్తంగా 5G ప్లస్ సర్వీసులను ప్రారంభించాలనే లక్ష్యంతో Airtel ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 5G ప్రారంభంలో భాగంగా శ్రామిక శక్తిని పెంచుకునేందుకు పెట్టుబడి పెడుతోంది.

Airtel plans to hire more women engineers for 5G related job roles in India

Airtel plans to hire more women engineers for 5G related job roles in India

Read Also : Jio 5G – Airtel 5G : భారతీయ నగరాల్లో జియో – ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం.. 5G ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

అందుకే మరింత మంది మహిళా ఇంజనీర్లను తమ బోర్డులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతీ ఎయిర్‌టెల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమృత పెద్దా మాట్లాడుతూ.. రిమోట్ వర్కింగ్ వంటి వారికి అవసరమైన సపోర్టును అందించడం ద్వారా ఎక్కువ మంది మహిళా ఇంజనీర్లను తీసుకురావడానికి కంపెనీ కృషి చేస్తోందని చెప్పారు. ఉదాహరణకు.. ఇంట్లోనే మహిళలు 5G సంబంధిత ఉద్యోగాలు చేసుకునేలా సెటప్ చేయడంలో సాయం చేస్తామని చెప్పారు. ఉద్యోగం కోసం సరైన వ్యక్తులను నియమించుకోవడంతో పాటు వారిని ప్రతిభ ఆధారంగా నిలుపుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.

టెలికాం ఆపరేటర్ 2021లో ప్రారంభించిన 5G అకాడమీ, IP అకాడమీ కార్యక్రమాల కింద CCNA (సిస్కో సర్టిఫైడ్ నెట్‌వర్క్ అసోసియేట్), CCNP (సిస్కో సర్టిఫైడ్ నెట్‌వర్క్ ప్రొఫెషనల్) వంటి విస్తృతమైన ఇంటర్నల్ కోర్సుల ద్వారా ఉద్యోగులకు నైపుణ్యాన్ని పెంచాలని యోచిస్తోంది. ఎయిర్‌టెల్ పర్యావరణ వ్యవస్థలోని 20వేల మంది నిపుణులు 5G రోల్‌అవుట్‌కు సన్నాహకంగా IP సాంకేతికత ప్రాథమికాలపై శిక్షణ పొందారని అమృత పెద్దా చేశారు. 2022-23 చివరి నాటికి నైపుణ్యం కలిగిన ప్రస్తుత ఉద్యోగులు, 5G సంబంధిత ప్రొఫైల్‌ల కోసం కొత్త నియామకాలు రెండూ 25 శాతం పెరిగే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు.

Airtel plans to hire more women engineers for 5G related job roles in India

Airtel plans to hire more women engineers for 5G related job roles in India

మార్చి, 2024 నాటికి దేశవ్యాప్తంగా 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని గతంలోనే ఎయిర్‌టెల్ వెల్లడించింది. కంపెనీ ఇప్పటికే ఢిల్లీ, ముంబై, వారణాసి, సిలిగురి, బెంగళూరు, హైదరాబాద్, నాగ్‌పూర్, చెన్నై, గురుగ్రామ్ సహా 12 భారతీయ నగరాల్లో 5G ప్లస్ సర్వీసులను ప్రారంభించింది. ప్రస్తుతానికి, ఎయిర్‌టెల్ 5G ప్లస్ ఉచితంగా పానిపట్, పాట్నా, గౌహతిలో అందుబాటులో ఉంది. ఎందుకంటే కంపెనీ ఇంకా 5G ప్లాన్‌లను వెల్లడించలేదు. రాబోయే నెలల్లో టెలికాం ఆపరేటర్ కొత్త 5G ప్లాన్‌లను లాంచ్ చేస్తుందని భావించవచ్చు. 4G ప్లాన్‌ల కన్నా ఎయిర్ టెల్ 5G సర్వీసులు కొంచెం ఖరీదైనదిగా ఉండే అవకాశం ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel 5G in India : దేశంలో 12 నగరాల్లోకి Airtel 5G సర్వీసులు.. ఫుల్ లిస్ట్ ఇదిగో.. మీ నగరం ఉందేమో ఇప్పుడే చెక్ చేసుకోండి!