Airtel Prepaid Plans : రూ. 200 లోపు ధరకే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లు.. అన్‌లిమిటెడ్ కాలింగ్, మరెన్నో డేటా బెనిఫిట్స్..!

Airtel Prepaid Plans : ఎయిర్‌టెల్ బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? ఎయిర్‌టెల్‌ను సెకండరీ నంబర్‌గా ఉపయోగిస్తున్నారా? ఇంటర్నెట్, కాలింగ్, SMS బెనిఫిట్స్ అందించే రూ. 200 లోపు ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల లిస్టును మీకోసం అందిస్తున్నాం.

Airtel Prepaid Plans : రూ. 200 లోపు ధరకే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లు.. అన్‌లిమిటెడ్ కాలింగ్, మరెన్నో డేటా బెనిఫిట్స్..!

Airtel prepaid plans under Rs 200 offering unlimited calling, data and other benefits

Airtel Prepaid Plans under Rs 200 Offering : భారత్‌లో ప్రముఖ టెలికాం ఆపరేటర్లలో ఒకటైన ఎయిర్‌టెల్ (Airtel) తమ కస్టమర్ల కోసం అనేక రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, హై-స్పీడ్ 5G డేటా ప్యాక్‌లు, ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్‌లతో కూడిన ప్లాన్‌లు ఉన్నాయి.

ఎయిర్‌టెల్ సిమ్‌ (Airtel SIM)ను సెకండరీ నంబర్‌గా ఉపయోగిస్తున్నప్పటికీ.. మీరు కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందించే దాదాపు నెల వ్యాలిడిటీతో బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను పొందవచ్చు. మీరు ఎయిర్‌టెల్‌ను సెకండరీ నంబర్‌గా ఉపయోగిస్తున్నా లేదా కాలింగ్ బెనిఫిట్స్ కోసం ప్రైమరీగా వాడుతున్నా రూ. 200 లోపు ధరలో ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్‌ల లిస్టును మీకోసం అందిస్తున్నాం. ఈ ప్లాన్‌లు ఇతర సర్వీసులతో పాటు కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తాయి.

Read Also : Airtel 5G Data Offer : ఎయిర్‌టెల్ 5G డేటా ఆఫర్.. నో డేటా లిమిట్.. అన్‌లిమిటెడ్ డేటా కోసం ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!

రూ. 200 లోపు ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు :
ఎయిర్‌టెల్ రూ. 155 ప్లాన్ : ఎయిర్‌టెల్ అతి తక్కువ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 99 ఉంటే.. టెలికాం ఆపరేటర్ ఈ ప్లాన్‌ను అనేక సర్కిల్‌ల నుంచి తొలగించింది. ఈ ప్లాన్ బదులుగా ధరను రూ. 56 పెంచింది. దాంతో రూ. 155 ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. 24 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, 1GB మొత్తం డేటాను అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ కోసం హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ పొందవచ్చు.

Airtel prepaid plans under Rs 200 offering unlimited calling, data and other benefits

Airtel prepaid plans under Rs 200 offering unlimited calling

ఎయిర్‌టెల్ రూ. 179 ప్లాన్ : ఈ రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 300 SMS, 2GB మొత్తం డేటాను అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ పైన పేర్కొన్న ప్లాన్‌ల మాదిరిగానే ఉంటాయి. హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ కూడా పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 199 ప్లాన్ :
ఎయిర్‌టెల్ అందించే ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ STD, రోమింగ్ నెట్‌వర్క్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 300 SMSలతో 3GB మొత్తం డేటాను అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ ఒకే విధంగా ఉంటాయి, Wynk, హలో ట్యూన్‌లకు యాక్సెస్‌ను అందిస్తాయి.

ఎయిర్‌టెల్ రూ. 209 ప్లాన్ :
ఇప్పుడు ఈ ప్లాన్ కొంత మంది యూజర్లకు బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కానీ, రోజువారీ డేటా బెనిఫిట్స్‌తో కూడిన ప్లాన్ కావాలంటే.. ఈ ప్లాన్ కచ్చితంగా చెక్ చేయవచ్చు. 1GB రోజువారీ డేటాను అందిస్తోంది, ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 21 రోజుల పాటు (Hello Tunes), Wynk అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది. పైన పేర్కొన్న అన్ని ఎయిర్‌టెల్ ప్లాన్‌లు 5G డేటా యాక్సెస్‌ను అందించవని గమనించాలి.

ఎయిర్‌టెల్ యూజర్లు (Airtel 5G Plus)ని వాడాలంటే.. రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ ప్లాన్‌ను కొనుగోలు చేయాలి. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్, ఎయిర్‌టెల్ థాంక్స్ (Airtel Thanks) యాప్ ద్వారా రీఛార్జ్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇతర అధీకృత ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పేమెంట్ ఆపరేటర్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

Read Also : Airtel Reliance Jio Offer : ఎయిర్‌టెల్, జియో యూజర్లకు అదిరే ఆఫర్లు.. ఈ ప్లాన్లపై 5G డేటా, OTT బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!