తగ్గేది లేదు.. జియోకు పోటీగా ఎయిర్‌టెల్ అదిరిపోయే డేటా ఆఫర్లు!

తగ్గేది లేదు.. జియోకు పోటీగా ఎయిర్‌టెల్ అదిరిపోయే డేటా ఆఫర్లు!

Airtel New Data Offers with Wync Premium : ప్రముఖ టెలికం కంపెనీలు మొబైల్ యూజర్లను ఆకట్టుకునేందుకు పోటీపడి మరి ఆఫర్లు గుప్పిస్తున్నాయి. జియో ఒక కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొస్తే.. దానికి పోటీగా ఎయిర్‌టెల్ దిగ్గజం 2 కొత్త యాడ్ అన్ డేటా ప్యాకులతో ముందుకొచ్చింది.

ఇండియన్ ఎయిర్ టెల్ యూజర్ల కోసం రూ.78, రూ.248 ప్రీపెయిడ్ డేటా ప్యాకులను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్లను యాడ్ చేసుకుంటే.. అదనంగా డేటాను పొందవచ్చు. అంతేకాదండోయ్.. Wync ప్రీమియం మ్యూజిక్ సబ్ స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు. ఈ ప్రీమియం సబ్ స్ర్కిప్షన్ ఎంచుకోవడం ద్వారా మీకు నచ్చిన మ్యూజిక్ వినొచ్చు.

ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్లు రూ.48, రూ.401, రూ.131, రూ.89లకు ఈ కొత్త యాడ్ ఆన్ ప్యాక్స్ యాడ్ చేసుకోవచ్చు.

ఎయిర్ టెల్ అందించే కొత్త డేటా రూ.78, రూ.248 యాడ్ అన్ ప్యాకులతో బెనిఫిట్స్, వాలిడిటీ వివరాలను తెలుసుకుందాం..

రూ. 78 యాడ్ ఆన్ ప్యాక్ ద్వారా 5GB డేటా పొందవచ్చు.

ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్‌పై వ్యాలిడిటీతో ఈ డేటాను యాక్సస్ చేసుకోవచ్చు.

5GB డేటా లిమిట్ దాటితే.. యూజర్లకు 1 ఎంబీ డేటాకు 50 పైసలు చొప్పున పడుతుంది.

Wync ప్రీమియం సబ్ స్ర్కిప్షన్ ఒక నెల పాటు ఉచితంగా పొందవచ్చు.

రూ.248 డేటా ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే.. 25GB డేటా పొందవచ్చు.

ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ వరకు డేటా యాక్సస్ చేసుకోవచ్చు.

డేటా లిమిట్ దాటిన తర్వాత ఒక ఎంబీ డేటాకు 50పైసలు చెల్లించాల్సి ఉంటుంది.

Wync ప్రీమియం సబ్ స్ర్కిప్షన్ ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు.

Wync ప్రీమియం సబ్ స్ర్కిప్షన్ సపరేటుగా తీసుకునే యూజర్ల కోసం ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా యాక్సస్ చేసుకోవచ్చు. ఇందులో ప్రీమియం ఆప్షన్ కింద నెలకు రూ.49, ఏడాదికి రూ.399 ప్లాన్ యాక్సస్ చేసుకోవచ్చు. ఎయిర్ టెల్ థ్యాంక్సు యాప్.. సెలక్ట్ రీఛార్జ్ ఆప్షన్.. స్ర్కోల్ డౌన్.. చేయాలి. ఇతర యాడ్ ఆన్ ప్యాక్స్.. పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.