సమ్మర్ స్మార్ట్ ట్రెండ్ : కొత్త 5G స్మార్ట్ ఫోన్లు ఇవే

సమ్మర్ వచ్చేసింది.. స్మార్ట్ ఫోన్ల సేల్ సందడి మొదలైంది. మొబైల్ తయారీ కంపెనీలు పోటీపడి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లలోకి విడుదల చేస్తున్నాయి. అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటున్నారు.

  • Published By: sreehari ,Published On : February 25, 2019 / 07:49 AM IST
సమ్మర్ స్మార్ట్ ట్రెండ్ : కొత్త 5G స్మార్ట్ ఫోన్లు ఇవే

సమ్మర్ వచ్చేసింది.. స్మార్ట్ ఫోన్ల సేల్ సందడి మొదలైంది. మొబైల్ తయారీ కంపెనీలు పోటీపడి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లలోకి విడుదల చేస్తున్నాయి. అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటున్నారు.

సమ్మర్ వచ్చేసింది.. స్మార్ట్ ఫోన్ల సేల్ సందడి మొదలైంది. మొబైల్ తయారీ కంపెనీలు పోటీపడి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లలోకి విడుదల చేస్తున్నాయి. అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. 2జీ, 3జీ, 4జీ స్మార్ట్ ఫోన్లకు దీటుగా 5జీ స్మార్ట్ ఫోన్లు, ఫోల్డబుల్ ఫోన్లు వచ్చేశాయి. ఇప్పటికే ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్, ఒప్పొ, హెచ్ఎండీ గ్లోబల్, హువావే 5జీ స్మార్ట్ ఫోన్లు, ఫోల్డబుల్ ఫోన్లను రిలీజ్ చేశాయి.

ప్రపంచవ్యాప్తంగా మొబైల్ కంపెనీ దిగ్గజాలు తమ సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ డివైజ్ లను ఎండబ్ల్యూసీ 2019 వేదికగా లాంచ్ చేస్తున్నాయి. ప్రముఖ మొబైల్ మేకర్ షియోమీ, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం (LG)ఎల్ జీ 5జీ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేశాయి. షియోమీ కంపెనీ తొలిసారి MI Mix 3 కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను MWC వేదికగా విడుదల చేసింది.

ఎంఐ మిక్స్3, 5జీ ఫోన్ మే నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర 599 యువాన్.. (రూ.48వేల 200). ఎంఐ మిక్స్ 3, 5జీ ఫోన్ Onyx బ్లాక్, Sapphire బ్లూ రెండు కలర్లలో షియోమీ విడుదల చేసింది. అలాగే ఎల్ జీ కంపెనీ కూడా 5జీ డ్యూయల్ స్ర్కీన్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఎల్ జీ రిలీజ్ చేసిన ఈ సరికొత్త ఫోన్ లో V50ThinQ 5G ఫోన్ నెట్ వర్క్ పై పనిచేస్తుంది.
Read Also: కొత్త చట్టం ఎఫెక్ట్ : మళ్లీ నోట్ల కష్టాలు రాబోతున్నాయా.. ATMలు ఖాళీనా!

ఇందులో రెండు స్ర్కీన్లు ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ఒక స్ర్కీన్ లో మూవీ చూడొచ్చు. మరో స్ర్కీన్ లో ఇంటర్ నెట్ బ్రౌజ్ చేసుకునే వీలుంది. అంతేకాదు మూడు కెమెరాలు ఉన్నాయి. వెనుక రెండు.. ముందు ఒకటి. మరో విశేషం ఏమిటంటే.. ఈ ఫోన్ ను టచ్ చేయకుండానే స్ర్కీన్ అన్ లాక్ చేయొచ్చు. ఫేషియల్ రికగ్నైజేషన్ ఆప్షన్ ఈ ఫోన్ కు స్పెషల్ ఎట్రాక్షన్. ఎల్ జీ 5జీ డ్యుయల్ ఫోన్ రిలీజ్ డేట్స్ ఇంకా రివీల్ చేయలేదు. ఎల్ జీ, షియోమీ ఎంఐ మిక్స్3 స్మార్ట్ ఫోన్ల ఫీచర్లపై ఓ లుక్కెయండి.. 

Mi MIX-3 5జీ స్పెషిఫికేషన్లు..
డిసిప్లే : 6.39- అంగుళాల  FHD+ శాంసంగ్ AMOLED డిసిప్లే
2340*1080p స్ర్కీన్ రెజుల్యుషన్
ప్రాసిసెర్ : క్వాల్ కామన్ స్నాప్ డ్రాగన్ 855 మొబైల్ ప్లాట్ ఫాం
స్నాప్ డ్రాగన్ X50 మోడమ్
ర్యామ్: ఇంకా రివీల్ చేయలేదు
స్టోరేజీ : రివీల్ చేయలేదు
రియల్ కెమెరా : 12MP ఏఐ డ్యుయల్ కెమెరా
960 ఎఫ్ పీఎస్ స్లో మోషన్ వీడియో క్యాపబులిటీ
సోనీ ఐఎమ్ఎక్స్576 సెన్సార్
ఫ్రంట్ కెమెరా : ప్రైమరీ 24మెగా ఫిక్సల్ కెమెరా, సెకండరీ కెమెరా 2MP సెన్సార్ (సెల్ఫీ)
బ్యాటరీ : 3800ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాక్ ఛార్జ్ ప్లస్
సాఫ్ట్ వేర్ : ఆండ్రాయిడ్ పై- MIUI 10

LG 5G స్మార్ట్ ఫోన్ స్పెషిఫికేషన్స్
* డ్యుయల్ స్ర్కీన్ న్యూ డిజైన్ ఫీచర్ 
వి50థిన్ క్యూ 5జీ నెట్ వర్క్ 
3 కెమెరాలు:  వెనుక రెండు, ఫ్రంట్ ఒకటి 
ఫేషియల్ రికగ్నైజేషన్ ఆప్షన్, నాన్ టచ్ బుల్ 

Read Also: చేతులారా చేసుకున్నాం : ధోనీ వల్లే మ్యాచ్ ఓడిపోయాం