ఈ ఏడాదిలో రెండుసార్లు లోగో మార్చేసిన అమెజాన్.. ఎందుకో తెలుసా?

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఒకే ఏడాదిలో రెండుసార్లు మార్పులు చేసింది. ఐదేళ్లలో మొదటిసారి 2021 జనవరిలో ఒకసారి లోగోను మార్చింది.

ఈ ఏడాదిలో రెండుసార్లు లోగో మార్చేసిన అమెజాన్.. ఎందుకో తెలుసా?

Amazon app logo change twice : ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఒకే ఏడాదిలో రెండుసార్లు మార్పులు చేసింది. ఐదేళ్లలో మొదటిసారి 2021 జనవరిలో ఒకసారి లోగోను మార్చింది. ఈ కొత్త లోగో బ్రౌన్ కార్డు బోర్డు బాక్సుపై బ్లూ టేప్ తో అమెజాన్ సిగ్నేచర్ స్మైల్ యారో ఉంది. మొబైల్‌ యాప్‌ ఐకాన్‌ లోగోలో సీక్రెట్‌గా మార్పులు చేసి కొత్త లోగోను విడుదల చేసింది. ఇటీవలే మింత్రా లోగో వివాదాస్పదమైన తర్వాత మహిళలను కించపరిచేలా లోగో ఉందని ఆరోపించారు.


ఆ తర్వాత అందరి దృష్టి ఇతర పాపులర్ యాప్ లోగోలపై పడింది. అమెజాన్‌ మొబైల్‌ యాప్‌ లోగోపై ట్రోల్ చేశాడు. బ్రౌన్‌ కాటన్‌ బాక్స్‌పై బ్లూ కలర్‌ టేప్‌ అతికించినట్లు ఉండి కింద స్మైల్‌ షేర్‌ బాణం ఉంది. హిట్లర్ మాదిరి లోగోలో 15శాతం తగ్గించింది. కొందరూ నెటిజన్లు.. ఈ లోగో అడాల్ఫ్‌ హిట్లర్‌ మీసంలా ఉందంటూ విమర్శలు చేస్తూ ట్రోల్స్ చేశారు. దాంతో అమెజాన్ లోగో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.


అమెజాన్ దృష్టికి వెళ్లడంతో సీక్రెట్‌గా లోగోలో చిన్న మార్పు చేసేసింది. కొత్త లోగోలో ఆ బ్లూ టేపును కాస్తా పైకి మడిచినట్లుగా మార్చి విడుదల చేసింది. ఈ కొత్త లోగో సైతం సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. అమెజాన్ కొత్త ఐఓఎస్ యాప్ లోగోనూ కూడా రెండోసారి మార్చేసింది.