Amazon – Bitcoin Payments: బిట్‌కాయిన్ పేమెంట్స్‌ ఊసేలేదు – అమెజాన్

కొద్ది రోజుల క్రితం అమెజాన్ బిట్ కాయిన్ పేమెంట్స్ చేసుకోవచ్చంటూ చక్కర్లు కొట్టిన వార్తలను కొట్టిపారేసింది అమెజాన్. అంతేకాకుండా వ్యక్తిగతంగా డిజిటల్ కరెన్సీ, బ్లాక్ చైన్ డిపార్ట్‌మెంట్ ను లీడ్ చేసే ప్రొడక్ట్ ను తీసుకురావాలనుకుంటుంది.

Amazon – Bitcoin Payments: బిట్‌కాయిన్ పేమెంట్స్‌ ఊసేలేదు – అమెజాన్

Amazon Bit Coin

Amazon – Bitcoin Payments: కొద్ది రోజుల క్రితం అమెజాన్ బిట్ కాయిన్ పేమెంట్స్ చేసుకోవచ్చంటూ చక్కర్లు కొట్టిన వార్తలను కొట్టిపారేసింది అమెజాన్. అంతేకాకుండా వ్యక్తిగతంగా డిజిటల్ కరెన్సీ, బ్లాక్ చైన్ డిపార్ట్‌మెంట్ ను లీడ్ చేసే ప్రొడక్ట్ ను తీసుకురావాలనుకుంటుంది. ఈ కోణంలోనే బిట్ కాయిన్ పేమెంట్స్ ను ఈ కామర్స్ స్టోర్ లో చెల్లించొచ్చని.. జెఫ్ బెజోస్ స్వయంగా ఇలా చెప్పారంటూ వార్తలు వినిపించాయి.

బిట్ కాయిన్ సక్సెస్ అయితే తన సొంత క్రిప్టోకరెన్సీని లాంచ్ చేస్తుందని చెప్పినవన్నీ అవాస్తవమని తేల్చేశారు. ఈ వార్తలో నిజాలు నిర్ధారణ కాకముందే బిట్ కాయిన్ ధర పెరుగుతూపోయింది. 37వేల డాలర్ల వద్ద ఉన్న ధర 40వేల డాలర్లకు చేరుకుంది. వ్యక్తిగతంగా చూసిన బిట్ కాయిన్ లో క్రమంగా వృద్ధి కనిపిస్తుంది గతేడాది 29వేల 300 డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ మూడు నెలల క్రితం 64వేల 900కు చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అమెజాన్ ప్లాన్ ఇదే:

కస్టమర్ అనుభవం, టెక్నికల్‌ స్ట్రాటజీ, సామర్థ్యాలతో పాటు లాంచ్ స్ట్రాటజీ కోసం క్రిప్టోకరెన్సీ రోడ్‌మ్యాప్‌ను డెవలప్ చేయనుంది. అందుకోసం అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌(AWS)తో సహా ఇతర ప్రొడక్ట్‌ డెవలపింగ్‌ కంపెనీలతో అమెజాన్‌ కలిసి పనిచేయనుంది. అమెజాన్‌ ఇప్పటివరకూ క్రిప్టోకరెన్సీలను పేమెంట్లుగా అంగీకరించలేదు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) బ్లాక్‌చైన్‌ సర్వీసులను మాత్రమే ఆఫర్ చేస్తోంది.

ఆపిల్, టెస్లా, ట్విట్టర్ కూడా బిట్ కాయిన్లు:
టెక్ దిగ్గజం ఆపిల్ కూడా గత మే నెలలో బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజింగ్ కోసం డిజిటల్ వాలెట్స్ మాదిరి BNPL, Fast Payments, cryptocurrency వంటి లిస్టింగ్ పోస్టు చేసింది. టెస్లా, ట్విట్టర్ త్వరలో బిట్ కాయిన్ పై పేమెంట్ మోడ్ తీసుకురానున్నాయి.

క్రిప్టోకరెన్సీతో భూమిపై:

ఆన్‌లైన్ ప్రపంచానికి గ్లోబల్ కరెన్సీ అవసరం. అందుకే బిట్‌కాయిన్‌పై దృష్టిపెట్టినట్టు ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సె చెప్పారు. ఎందుకంటే ఈ క్రిప్టోకరెన్సీతో ఈ భూమిపై ప్రతిఒక్క వ్యక్తిని చేరుకోవచ్చు. టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ క్రిప్టోకరెన్సీపై తమ కంపెనీ బిట్‌కాయిన్ పేమెంట్స్ తిరిగి ప్రారంభించబోతున్నామని చెప్పారు.