Apple IPhone 12 : ఆపిల్ ఐఫోన్ 12పై భారీ తగ్గింపు.. ధర ఎంతంటే?

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon), ఫ్లిప్ కార్ట్ (Flipkart) ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి.

Apple IPhone 12 : ఆపిల్ ఐఫోన్ 12పై భారీ తగ్గింపు.. ధర ఎంతంటే?

Amazon Flipkart Offers On A

Apple IPhone 12 Offers  : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon), ఫ్లిప్ కార్ట్ (Flipkart) ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ బిగ్ డీల్స్ ద్వారా ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ భారీ తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ పోర్టల్స్ క్యాష్‌బ్యాక్, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా అందిస్తున్నాయి.

అన్ని వేరియంట్ స్మార్ట్ ఫోన్ల ధరలను అసలు మార్కెట్ ఆపరేటింగ్ ధర కన్నా తక్కువ ధరకే ఆఫర్ చేస్తున్నాయి. 2020లో తయారైన ఐఫోన్ 12లో వెనుకవైపు డ్యూయల్ రియర్ లెన్స్, ఫ్రంట్ సింగిల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. Apple iPhone 128GBతో వచ్చిన iPhone 13 మాదరిగా కాకుండా 64GB RAMతో అందుబాటులో ఉంది. ఐఫోన్ 12 ఫ్లిప్‌కార్ట్‌లో 8 శాతం, అమెజాన్‌లో 17 శాతం తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.

మీకు అందించే డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ పిన్ కోడ్ వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది. Flipkartలో, Apple iPhone 12 64GB వేరియంట్‌కు రూ.60,399గా ఉంది. యాక్సిస్ కార్డ్ (Axis Card) యూజర్లకు 5 శాతం తగ్గింపుతో లభిస్తుంది. అంటే.. డిస్కౌంట్ ధరతో ఫోన్‌ రూ. 46,799కి సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌ఛేంజ్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు. Flipkart వెబ్‌సైట్‌ ద్వారా ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ IMEI నంబర్‌ను ఫీడ్ చేయవచ్చు.

మీకు iPhone 12 అసలు ధర గురించి తెలుసుకోవాలి. అమెజాన్‌లో 64GB ఫార్మాట్‌లో iPhone 12 ధర ప్రస్తుతం రూ. 54,999కు అందుబాటులో ఉంది. ఇక ఎక్స్ఛేంజ్ విలువ అదే ఫోన్ ధర గరిష్టంగా రూ.14,900 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ 12 డిస్కౌంట్ ధరతో కేవలం రూ. 40,099కు మాత్రమే సొంతం చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ఎలక్ట్రానిక్స్ మేజర్ విజయ్ సేల్స్ కూడా పలు ఐఫోన్‌లపై భారీగా తగ్గింపు ధరలతో అందిస్తోంది.

iPhone 13, Pro, iPhone 12, iPhone 11 స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. Macbook Air, Pro కూడా భారీ తగ్గింపు ధరలకు ఆఫర్ చేస్తోంది. ఎయిర్‌పాడ్‌లు, ఆపిల్ వాచీలపై కూడా భారీ తగ్గింపుతో అందిస్తోంది. Apple iPhone 12 12MP + 12MP డ్యూయల్ వెనుక కెమెరాలతో 6.1 అంగుళాల రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 12MP సెల్ఫీ లెన్స్ కూడా ఉంది. ఆపిల్ ఐఫోన్ A14 బయోనిక్ చిప్‌సెట్‌ ద్వారా పనిచేస్తుంది.

Read Also : Kashmir Solidarity Day : హ్యుందాయ్ పాకిస్తాన్ కశ్మీర్ పోస్ట్‌పై భారత్‌ నుంచి విమర్శల వెల్లువ..!