Tech Salaries Hike : ఉద్యోగుల జీతాలను భారీగా పెంచేసిన టెక్ కంపెనీలు..!

Tech Salaries Hike : కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. దాంతో పలు కంపెనీలు సరైన ప్రాజెక్టులు లేక తమ ఉద్యోగులకు సరైన వేతనాన్ని అందించలేకపోయాయి.

Tech Salaries Hike : ఉద్యోగుల జీతాలను భారీగా పెంచేసిన టెక్ కంపెనీలు..!

Amazon, Google And Other Tech Companies Gave Massive Hike To Their Employees (2)

Tech Salaries Hike : కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. దాంతో పలు కంపెనీలు సరైన ప్రాజెక్టులు లేక తమ ఉద్యోగులకు సరైన వేతనాన్ని అందించలేకపోయాయి. దాంతో వార్షికంగా పెంచాల్సిన వేతనాలను వాయిదా వేశాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. ఉద్యోగులు కూడా తిరిగి వర్క్ ఫ్రమ్ హోం నుంచి ఆఫీసులకు తిరిగి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను మరింత ఉత్సాహపరిచేందుకు వారికి వేతనాలను పెంచాలని నిర్ణయించాయి. మరోవైపు వేతనాల పెంపుపై ఉద్యోగుల్లో నుంచి డిమాండ్ తలెత్తిన నేపథ్యంలో ప్రముఖ ఐటీ దిగ్గజాలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ సహా పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచేసినట్టు ఓ నివేదిక వెల్లడించింది. గత రెండేళ్లలో మహమ్మారి, ఆర్థిక మాంద్యం కారణంగా వివిధ కంపెనీలలో జీతాల పెంపు వాయిదా పడింది. ఇప్పుడు టాప్ టాలెంటెడ్ ఉద్యోగులను తమ కంపెనీల్లో ఉండేందుకు ప్రతిభావంతులైన వారిని మరింత ఆకర్షించడానికి కంపెనీలు ఉద్యోగులకు రివార్డ్ ఇవ్వడం మొదలుపెట్టాయి. అంతకుముందు 2021లో, యాక్సెంచర్, ఇన్ఫోసిస్, TCS, విప్రో, ఇతరులు అగ్రశ్రేణి MNCలు తమ ఉద్యోగుల వేతనాన్ని పెంచాయి. వారికి పదోన్నతి కల్పించాయి.

Amazon, Google And Other Tech Companies Gave Massive Hike To Their Employees (1)

Amazon, Google And Other Tech Companies Gave Massive Hike To Their Employees 

ఈ ఏడాదిలో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు దీనిని అనుసరించాయి. అమెజాన్ ఉద్యోగుల జీతం పరిమితిని $160,000 నుంచి $350,000కి పెంచింది. ఫిబ్రవరి 2022లో, అమెజాన్ గరిష్ట మూల వేతనం $160,000 నుంచి $350,000కి రెట్టింపు చేస్తామని ప్రకటించింది. Geekwire ద్వారా పొందిన ఉద్యోగులకు మెమో ప్రకారం.. అమెజాన్ గరిష్ట మూల వేతనాన్ని $160,000 నుంచి $350,000కి పెంచుతోంది. అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఉద్యోగులను చేర్చుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న ఉద్యోగులను వెళ్లకుండా ఉండేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉద్యోగాలకు వేతనాలను పెంచినట్లు అమెజాన్ తెలిపింది. గూగుల్ ఉద్యోగుల వేతనాన్ని పెంచలేదట. అగ్ర అధికారుల జీతం మాత్రమే పెంచినట్టు తెలిసింది.

జనవరిలో, గూగుల్ తన టాప్ ఉద్యోగుల జీతాలను పెంచిందని, కానీ కింది స్థాయి ఉద్యోగులకు కాదని నివేదించింది. నివేదికల ప్రకారం.. గూగుల్ తమ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో కనీసం నలుగురి మూల వేతనాన్ని $650,000 నుంచి $1 మిలియన్‌కు పెంచింది. వేతానలు పెంచిన వారిలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ కూడా ఉన్నారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రాఘవన్ (గూగుల్ సెర్చ్ ఇన్ ఛార్జి) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్, కెంట్ వాకర్, గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ చీఫ్ లీగల్ ఆఫీసర్ ఉన్నారు. కంపెనీ ప్రకారం… మైక్రోసాఫ్ట్ గ్లోబల్ మెరిట్ బడ్జెట్‌ను రెట్టింపు చేసింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తమ ఉద్యోగులకు ఒక ఇమెయిల్‌లో మైక్రోసాఫ్ట్ గ్లోబల్ మెరిట్ బడ్జెట్‌ను రెట్టింపు చేసినట్టు తెలియజేశారు.

Read Also : Apple Workers : పెరగనున్న ఆపిల్ ఉద్యోగుల జీతాలు.. ఎంతంటే?