Amazon: యూజర్ల నిద్రా సమయాన్ని పసిగట్టడానికి అమెజాన్‌కు పర్మిషన్

యూజర్ల నిద్రా సమయాన్ని కాలిక్యులేట్ చేసేందుకు అమెజాన్.కామ్ అమెరికా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ దక్కించుకుంది. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ శుక్రవారం దీనికి సంబంధించిన అనుమతి ఇచ్చినట్లు ప్రకటించింది.

Amazon: యూజర్ల నిద్రా సమయాన్ని పసిగట్టడానికి అమెజాన్‌కు పర్మిషన్

Amazon

Amazon: యూజర్ల నిద్రా సమయాన్ని కాలిక్యులేట్ చేసేందుకు అమెజాన్.కామ్ అమెరికా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ దక్కించుకుంది. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ శుక్రవారం దీనికి సంబంధించిన అనుమతి ఇచ్చినట్లు ప్రకటించింది. కదలికలను గుర్తించి రికార్డ్ చేసేందుకు రాడార్ సెన్సార్ ను వినియోగిస్తారు.

అమెజాన్ జూన్ 22న ఎఫ్‌సీసీని పర్మిషన్ కోసం రిక్వెస్ట్ చేసింది. ఎయిర్‌వేవ్ ఉపయోగాలను రెగ్యూలేట్ చేసే ఎఫ్‌సీసీని మూడు కోణాల్లో కదలికలను గుర్తించేందుకు అనుమతులు కోరింది. ఈ ఫీచర్లను ఎనేబుల్ చేసుకుంటేనే యూజర్ కదలికలను గుర్తించగలదు.

అమెజాన్ కథనం ప్రకారం.. మొబిలిటీ, స్పీచ్, స్పర్శకు సంబంధించిన అంశాలను మానిటర్ చేసి ఎంతసేపు పూర్తి నిద్రలో ఉన్నారని తెలుసుకోనుంది. రాడార్ సెన్సార్ కారణంగా నిద్రను ట్రాక్ చేసి దానికి కారణాలను విశ్లేషించి ఆ అంశాలపై అవగాహన పెంచి సంపూర్ణ నిద్రకు ఉపకరించేలా చేస్తారు. దీని కారణంగా చాలా మంది అమెరికన్లకు హెల్త్ బెనిఫిట్స్ తెలుస్తాయని అమెజాన్ చెప్తుంది.

ఇది మానిటర్ చేసే డివైజ్ గురించి అమెజాన్ ఎటువంటి కామెంట్ చేయలేదు. స్మార్ట్ ఫోన్ చేస్తారని మాత్రం స్పష్టం చేయలేదు. దాదాపు మణికట్టుకు పెట్టుకునే బ్యాండ్ అయ్యే ఉంటుందని అంచనా. ఒకవేళ ఇండియాలోనూ దీనికి సంబంధించిన అప్రూవల్ వస్తే ఇక ఇండియన్లు కూడా క్వాలిటీ నిద్ర కోసం మణికట్టు బ్యాండ్లు ఉపయోగించొచ్చు.