Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్ 13, వన్‌ప్లస్ నార్డ్ 2T, రెడ్‌మి 11ప్రైమ్ 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు..!

Amazon Great Republic Day Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ తేదీ (Amazon Great Republic Day Sale) ఎప్పుడో తెలిసిందోచ్.. లేటెస్టుగా 2023 సేల్‌ను కొంచెం ముందుగానే అమెజాన్ ప్రారంభిస్తోంది.

Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్ 13, వన్‌ప్లస్ నార్డ్ 2T, రెడ్‌మి 11ప్రైమ్ 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు..!

Amazon Great Republic Day sale deals revealed_ iPhone 13, OnePlus Nord 2T, Redmi 11 Prime to get discounted

Amazon Great Republic Day Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ తేదీ (Amazon Great Republic Day Sale) ఎప్పుడో తెలిసిందోచ్.. లేటెస్టుగా 2023 సేల్‌ను కొంచెం ముందుగానే అమెజాన్ ప్రారంభిస్తోంది. రాబోయే అమెజాన్ సేల్ ఈవెంట్ ఇప్పుడు జనవరి 15 నుంచి ప్రారంభమై జనవరి 20 వరకు కొనసాగుతుంది. గతంలో జనవరి 17న అమెజాన్ సేల్‌ను నిర్వహించాలని ప్లాన్ చేసింది. కానీ, సేల్ తేదీని మార్చేసింది. దీనికి గల కారణాన్ని అమెజాన్ అధికారికంగా వెల్లడించలేదు.

మరోవైపు.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ (Flipkart Big Saving Days Sale)ను అమలు చేస్తున్న సమయంలోనే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను హోస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రెండోది కూడా పైన పేర్కొన్న తేదీనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న వినియోగదారులు ఒక రోజు ముందుగానే సేల్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే.. ప్రాథమికంగా జనవరి 14న అమెజాన్ ప్రైమ్ యూజర్లు తమకు నచ్చిన స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లతో సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో అందుబాటులో ఉన్న కొన్ని స్మార్ట్‌ఫోన్ డీల్స్‌పై మరెన్నో ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్ 13 ధర తగ్గింపును పొందనున్నట్లు సేల్ టీజర్ పేజీ వెల్లడించింది. అమెజాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సేల్ అతిపెద్ద డీల్ కానుంది. ఆపిల్కొత్త ఐఫోన్ 14 సిరీస్‌ను ప్రకటించినప్పటికీ.. ఇప్పటికీ ఐఫోన్ 13ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. రెండు ఫోన్‌లు ఒకే స్పెసిఫికేషన్‌లతో రానున్నాయి. వేర్వేరు ధరలలో అందుబాటులో ఉన్నాయి.

Amazon Great Republic Day sale deals revealed_ iPhone 13, OnePlus Nord 2T, Redmi 11 Prime to get discounted

Amazon Great Republic Day sale deals revealed_ iPhone 13, OnePlus Nord 2T, Redmi 11 Prime to get discounted

Read Also : Amazon Smartphone Discounts : అమెజాన్‌లో అప్‌గ్రేడ్ డేస్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్..!

OnePlus Nord 2T 5Gని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న యూజర్లు మరికొన్ని రోజులు వేచి ఉండాలి. ఎందుకంటే Amazon Great Republic Day సేల్ సమయంలో భారీ డిస్కౌంట్ అందుకుంటుంది. టీజర్‌ ప్రకారం.. Samsung Galaxy M13, iQOO Z6 Lite 5G, Realme Narzo 50m, Redmi 11 Prime 5G కూడా భారీ డిస్కౌంట్ పొందవచ్చు.

అమెజాన్ భారత మార్కెట్లో రూ.10,999లతో 5G ఫోన్‌లను అందించనుంది. ప్రస్తుతం భారత్‌లో కొన్ని బడ్జెట్ 5G ఫోన్‌లు Samsung Galaxy M13, Poco M4, iQOO Z6 Lite మరెన్నో మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ ఇయర్‌బడ్స్‌పై కూడా అదిరే డీల్ అందిస్తోంది.

ఈ డివైజ్ ధరలను అమెజాన్ ఇంకా వెల్లడించలేదు. Oppo ఫోన్‌ల ధరను వెల్లడించింది. Oppo F21s Pro 5G ధర రూ. 23,499కి అందుబాటులో ఉంటుంది. Oppo F21s Pro రూ. 19,999కి అందుబాటులో ఉంటుంది. Oppo A74 ధర రూ.14,240కి తగ్గుతుంది. ఈ డీల్‌లన్నీ బ్యాంక్ ఆఫర్‌లు, కొంత డిస్కౌంట్‌పై ఆధారపడి ఉంటాయి. SBI బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్ 13, వన్‌ప్లస్ 10T ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో బెనిఫిట్స్.. సేల్ ఎప్పటినుంచుంటే?