Amazon Fire TV Cube : అమెజాన్ నుంచి ఫైర్ టీవీ క్యూబ్, అలెక్సా వాయిస్ రిమోట్ ప్రో.. మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చేయొచ్చు.. ధర ఎంతంటే?

Amazon Fire TV Cube : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) నెక్స్ట్ జనరేషన్ ఫైర్ టీవీ క్యూబ్‌ను ప్రకటించింది. దీనికి అలెక్సా వాయిస్ రిమోట్ ప్రో (Alexa Voice Remote Pro)కు సపోర్టు అందిస్తోంది. ఈ రెండు డివైజ్‌లు భారతీయ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చేశాయి.

Amazon Fire TV Cube : అమెజాన్ నుంచి ఫైర్ టీవీ క్యూబ్, అలెక్సా వాయిస్ రిమోట్ ప్రో.. మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చేయొచ్చు.. ధర ఎంతంటే?

Amazon launches 3rd gen Fire TV Cube for Rs 13,999, Alexa Voice Remote Pro at Rs 2,499

Amazon Fire TV Cube : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) నెక్స్ట్ జనరేషన్ ఫైర్ టీవీ క్యూబ్‌ను ప్రకటించింది. దీనికి అలెక్సా వాయిస్ రిమోట్ ప్రో (Alexa Voice Remote Pro)కు సపోర్టు అందిస్తోంది. ఈ రెండు డివైజ్‌లు భారతీయ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చేశాయి. థర్డ్ జనరేషన్ ఫైర్ టీవీ క్యూబ్ (Fire TV Cube) ధర రూ. 13,999 కాగా, అలెక్సా వాయిస్ రిమోట్ ప్రో (Alexa Voice Remote Pro) ధర రూ. 2,499గా ఉంది.

ఈ కొత్త ఫైర్ టీవీ క్యూబ్ కొత్త ఆక్టా-కోర్ 2.0 GHz ప్రాసెసర్‌తో వస్తుంది. అలెక్సాతో హ్యాండ్స్-ఫ్రీగా కంట్రోల్ చేయవచ్చు. కొత్త ఫైర్ టీవీ క్యూబ్ మునుపటి జనరేషన్ కన్నా 20 శాతం ఎక్కువ పవర్‌ఫుల్ అని కంపెనీ పేర్కొంది. ఈ డివైజ్ సినిమాటిక్ 4K అల్ట్రా HD, డాల్బీ విజన్, HDR, ఇమ్మర్సివ్ డాల్బీ అట్మాస్ ఆడియోకు సపోర్టు ఇస్తుంది. అంతేకాదు.. Wi-Fi 6కి కూడా సపోర్టు చేస్తుంది.

Amazon launches 3rd gen Fire TV Cube for Rs 13,999, Alexa Voice Remote Pro at Rs 2,499

Amazon launches 3rd gen Fire TV Cube for Rs 13,999, Alexa Voice Remote Pro at Rs 2,499

థర్డ్ జనరేషన్ ఫైర్ టీవీ క్యూబ్ HDMI ఇన్‌పుట్ పోర్ట్, సూపర్ రిజల్యూషన్ అప్‌స్కేలింగ్‌ను అందిస్తుంది. తద్వారా HD కంటెంట్‌ను 4Kగా మారుస్తుంది. హై క్వాలిటీ వీడియోలను వీక్షించవచ్చు. వినియోగదారులకు వైర్ కలిగిన నెట్‌వర్క్ కనెక్షన్ అవసరమైతే ఈ డివైజ్‌లో కొత్త ఈథర్నెట్ పోర్ట్‌ (Ethernet Port)ను కూడా కలిగి ఉంది.

కొత్త ఫైర్ టీవీ క్యూబ్‌తో వినియోగదారులు టీవీని, సెట్ టాప్ బాక్స్‌లను, వాయిస్ రిమోట్‌ను లేదా అలెక్సాతో హ్యాండ్స్-ఫ్రీని కంట్రోల్ చేయవచ్చు. అలెక్సా కమ్యూనికేషన్స్‌తో వీడియో కాలింగ్ కోసం సపోర్టెడ్ వెబ్‌క్యామ్‌లకు సులభంగా యాక్సస్ చేసేందుకు Fire TV Cube అదనపు USB పోర్ట్‌ను కలిగి ఉంది.

మీ ఇంట్లో అతిపెద్ద స్క్రీన్‌లో ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో కనెక్ట్ అవ్వడానికి యూజర్లు “Alexa, call mom ” అని చెప్పాలి. అదనంగా, వినియోగదారులు ఇప్పుడు మాన్యువల్‌గా ఇన్‌పుట్‌లను మార్చడానికి బదులుగా “Alexa, switch to DTH” అని చెప్పాలి. Alexaని అడగడం ద్వారా మీకు అవసరమైన సెట్ టాప్ బాక్స్ ప్రొవైడర్‌ల నుంచి ఛానెల్‌లను సర్ఫ్ చేయవచ్చు.

Amazon launches 3rd gen Fire TV Cube for Rs 13,999, Alexa Voice Remote Pro at Rs 2,499

Amazon launches 3rd gen Fire TV Cube for Rs 13,999, Alexa Voice Remote Pro at Rs 2,499

గ్లోబల్ ఈవెంట్‌లో అమెజాన్ లాంచ్ చేసిన రెండవ ప్రొడక్టు అలెక్సా వాయిస్ రిమోట్ ప్రో (Alexa Voice Remote Pro). రూ. 3వేలలోపు ధరతో అలెక్సా వాయిస్ రిమోట్ ప్రో (Alexa Voice Remote Pro) యూజర్లకు ఎక్కువ సమయం స్ట్రీమింగ్‌లో, రిమోట్ కోసం తక్కువ సమయాన్నివెచ్చించవచ్చు.

చాలా ఫైర్ టీవీ స్ట్రీమింగ్ మీడియా ప్లేయర్‌లకు, ఇంటర్నల్ ఫైర్ టీవీతో స్మార్ట్ టీవీలకు అనుకూలంగా ఉంటుంది. ఫైర్ టీవీ క్యూబ్ ఆడియో స్ట్రీమింగ్ ఫర్ హియరింగ్ ఎయిడ్స్ (ASHA)కి సపోర్టు ఇస్తుంది. కస్టమర్‌లు నేరుగా కంప్యాటబుల్ బ్లూటూత్ హియరింగ్ డివైజ్‌లను కనెక్ట్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇది రిమోట్ ఫైండర్ ఫీచర్‌తో వస్తుంది.

కస్టమర్‌లు తప్పుగా ఉన్న రిమోట్‌లను మరింత సులభంగా గుర్తించేందుకు సాయపడుతుంది. వినియోగదారులు “Alexa, find my remote” అని చెప్పాలి లేదా Fire TV యాప్‌లో రిమోట్ ఫైండర్ బటన్‌ను ఉపయోగించాలి. అప్పుడు అలెక్సా వాయిస్ రిమోట్ ప్రో ఇంటర్నల్ స్పీకర్ నుంచి రింగ్ టోన్ వస్తుంది.

అలెక్సా వాయిస్ రిమోట్ ప్రో ఇప్పటికే Amazon.in/alexavoiceremotepro/లో రూ. 2,499కి ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. ఈ సరికొత్త Fire TV Cubeని కొనుగోలు చేయాలతద ఆసక్తి ఉన్న కస్టమర్‌లు Amazon.in/firetvcube/లో అందుబాటులో ఉంది. వెంనటే ఇందులో సైన్ అప్ అయి కొనేసుకోండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..