Redmi Note 10T 5G : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. అదిరిపోయే బ్యాటరీతో 5G ఫోన్ లాంచ్ చేసిన రెడ్‌మీ..!!

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ రెడ్‌మి బ్రాండ్‌లో రెడ్‌మి 10 సిరీస్ నుంచి భారత మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చింది. అదే.. Redmi Note 10T 5G ఫోన్.. రెడ్ మి నోట్ 10 సిరీస్‌లో ఇది ఐదో మోడల్.

Redmi Note 10T 5G : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. అదిరిపోయే బ్యాటరీతో 5G ఫోన్ లాంచ్ చేసిన రెడ్‌మీ..!!

Redmi Note 10t 5g Pricing, Availability, Sale Offers

Redmi Note 10T 5G Triple Rear Cameras : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ రెడ్‌మి బ్రాండ్‌లో రెడ్‌మి 10 సిరీస్ నుంచి భారత మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చింది. అదే.. Redmi Note 10T 5G ఫోన్.. రెడ్ మి నోట్ 10 సిరీస్‌లో ఇది ఐదో మోడల్. ఈ కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరాలు, హోల్ పంచ్ డిస్ ప్లే డిజైన్, మీడియా టెక్ డైమన్సెటీ 700 SoC ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. భారత మార్కెట్లో రెడ్ మి నోట్ 10T 5G ఫోన్‌ (4GB+64GB) స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999గా నిర్ణయించింది. అలాగే 6GB+128GB స్టోరేజీ ఆప్షన్ ధర రూ.15,999గా ఉంది. క్రోమియం వైట్, గ్రాఫైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్స్ ఆప్షన్లలో లభ్యం కానుంది.

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ అమెజాన్, Mi.com, Mi Home Stores, ఆఫ్ లైన్ రిటైలర్స్ నుంచి జూలై 26 నుంచి అందుబాటులోకి రానుంది. Redmi Note 10T 5G లాంచ్ ఆఫర్ల కింద రూ.1,000 వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు, ఈజీ EMI ట్రాన్సాక్షన్స్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఏదైనా ఎక్స్ఛేంజ్ ఆప్షన్ల కింద రిటైల్ ఛానళ్ల ద్వారా నో కాస్ట్ ఈఎంఐ కూడా పొందవచ్చు. గత నెలలోనే రష్యాలో Redmi note 10T 5G లాంచ్ అయింది. ఈ ఫోన్ (4GB+128GB స్టోరేజీ వేరియంట్) ధర RUB 19,990 ఉండగా.. భారత కరెన్సీలో రూ.20,100 వరకు ఉండొచ్చు.

Redmi Note 10T 5G స్పెషిఫికేషన్లు :
డ్యుయల్ సిమ్ (Nano) రెడ్ మి నోట్ 10T 5G, ఆండ్రాయిడ్ 11, MIUIతో రన్ అవుతుంది. 6.5 అంగుళాల ఫుల్ HD+ (1,080×2,400 pixels) డిస్‌ప్లే, 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 20:9 అస్పెక్ట్ రేషియో. ఫోన్ కిందిభాగంలో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్షిటీ 700 Soc, 6GB RAM కూడా అందిస్తోంది. కెమెరాల విషయానికి వస్తే.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 48MP ప్రైమరీ సెన్సార్ ( f/1.79 lens), 2MP సెకండరీ సెన్సార్ (f/2.4 macro lens), 2MP డెప్త్ సెన్సార్ (f/2.4 lens). స్మార్ట్ ఫోన్ ఫ్రంట్ సైడ్ ఫొటోలు, వీడియోలు, సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరా (f/2.0 lens) అమర్చారు.

64GB, 128GB ఆన్ బోర్డ్ స్టోరేజీ ఆప్షన్లతో పాటు కనెక్టవిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi, Bluetooth v5.1, GPS/ A-GPS, Infrared (IR) blaster, NFC, USB Type-C ఉన్నాయి. 3.5mm హెడ్ ఫోన్ జాక్, సెన్సార్లు కూడా ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ కూడా ఉంది. షావోమీ అందించే ఈ కొత్త 5జీ ఫోన్ 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో రన్ అవుతుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ (22.5W ఛార్జర్) ఉంది.