Amazon-Flipkart Sale :అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్ : 7 స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ డిస్కౌంట్లు ఇవే.. డోంట్ మిస్!

అమెజాన్ ప్రైమ్ డే (Amazon Prime Day Sale), ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ (Flipkart Big Savings Days Sale) భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు సహా అనేక గాడ్జెట్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.

Amazon-Flipkart Sale :అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్ : 7 స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ డిస్కౌంట్లు ఇవే.. డోంట్ మిస్!

Amazon Prime Days, Flipkart Big Savings Days Sale 7 Smartphones With The Best Discounts

Amazon Prime Days, Flipkart Big Savings Days sale:  ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్ ప్రైమ్ డే (Amazon Prime Day Sale), ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ (Flipkart Big Savings Days Sale) భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు సహా అనేక గాడ్జెట్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లతో పాటు టీవీలు, హెడ్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ పై ఆఫర్లను అందిస్తోంది. అయితే మీరు ఏదైనా కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం.. మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ కావాలంటే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్స్ పై అందించే 7 బెస్ట్ స్మార్ట్ ఫోన్లను ఓసారి లుక్కేయండి..

iPhone 11 :
ఆపిల్ ఐఫోన్ 11.. అమెజాన్ లో తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. Prime Day sale తో సంబంధం లేకుండానే కొనుగోలు చేయొచ్చు. జూలై 29, ఆగస్టు 6 మధ్య ఆపిల్ ఐఫోన్ 11 మోడల్ వచ్చే అవకాశం ఉంది. మీకు నచ్చిన కలర్, వేరియంట్ సెలక్ట్ చేసుకుంటే చాలు.. ఐఫోన్ 11 ప్రారంభ ధర రూ.47,999 ఉండగా (64GB వేరియంట్), రూ.53,999 (128GB వేరియంట్) ఉండనున్నాయి.

iPhone 12 Pro :
ఈ ఐఫోన్ (128GB వేరియంట్) ధర రూ.1,05,900కు తగ్గింది. 256GB వేరియంట్ ధర రూ.1,15,900గా ఉంది. ఆపిల్ ఐఫోన్ 11 మాదిరిగా కాకుండా ఈ కొత్త మోడల్స్ స్టాక్ అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే వెంటనే ఈ స్టాక్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.

iPhone 12 Mini :
ఈ ఐఫోన్ 12 మినీ.. ప్రారంభ ధర రూ.57,999గా ఉంది. అది కూడా ఫ్లిప్ కార్ట్‌లో కనీస ధర (64GB వేరియంట్)గా ఉంది. ఇదే అతి తక్కువ ధర కూడా. మరోవైపు 128GB వేరియంట్ ధర రూ.62,999 కు అందుబాటులో ఉండగా.. 256GB వేరియంట్ ధర రూ.72,999గా ఉంది.

iPhone XR :
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ XR (64GB వేరియంట్) ప్రారంభ ధర రూ.37,999లతో లభ్యం అవుతోంది. హైయర్ స్టోరేజీ ఫోన్లలో 128GB వేరియంట్ ధర రూ.42,999గా ఉంది. ఈ ఫోన్ ఫీచర్లలో 6.1 అంగుళాల డిస్ ప్లే, 12MP సింగిల్ రియర్ కెమెరా, ఆపిల్ A12 బయోనిక్ చిప్ వంటివి ఉన్నాయి.

Realme X7 Max :
ఈ రియల్ మి X7 మ్యాక్స్ (8GB/128GB వేరియంట్) డిస్కౌంట్ ధర రూ.24,999తో సొంతం చేసుకోవచ్చు. Mediatek Dimensity 1200 పవర్డ్ ఫోన్లలో ఇదే చీపెస్ట్ ఫోన్ కూడా. 12GB/256GB వేరియంట్ ఫోన్ ధర రూ.27,999గా ఉంది.

Realme Narzo 30 Pro 5G :
భారత మార్కెట్లో అత్యంత సరసమైన 5G ఫోన్లలో Realme Nazro 30pro 5G ఫోన్ ఒకటి. ప్రస్తుతం ఈ ఫోన్ (6GB/64GB) వేరియంట్ ప్రారంభ ధర రూ.15,499గా ఉంది. హైయర్ ఎండ్ ఫోన్లలో 8GB/128GB వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించింది.

Moto Razr 4G :
మోటారోలా మోటో Razr 4G ఫోన్ ఫ్లిప్ ఎబుల్ ఆఫర్ చేస్తోంది. దీని ప్రారంభ ధర రూ.54,999గా ఉంది. అది కూడా బ్లాక్ కలర్ సింగిల్ 6GB/128GB వేరియంట్. గోల్డ్ కలర్ వేరియంట్ ధర రూ.74,999గా ఉంది. కొత్త 5G వేరియంట్ 8GB/256GB ఫోన్ ధర రూ.89,999గా ఉంది.