Amazon Prime Membership: అమెజాన్ ప్రైమ్ కావాలంటే 50శాతం అదనంగా చెల్లించాల్సిందే..

అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఛార్జీలు అమాంతం పెరిగిపోన్నాయి. డిసెంబర్ నెల వరకూ 50శాతం అదనంగా వసూలు చేయాలని డిసైడ్ అయిపోయింది. యానువల్ మెంబర్ షిప్ ప్లాన్ పెంచనున్నట్లు.....

Amazon Prime Membership: అమెజాన్ ప్రైమ్ కావాలంటే 50శాతం అదనంగా చెల్లించాల్సిందే..

Amazon

Amazon Prime Membership: అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఛార్జీలు అమాంతం పెరిగిపోన్నాయి. డిసెంబర్ నెల వరకూ 50శాతం అదనంగా వసూలు చేయాలని డిసైడ్ అయిపోయింది. యానువల్ మెంబర్ షిప్ ప్లాన్ పెంచనున్నట్లు విడుదల చేసిన స్క్రీన్ షాట్ లో అంతా క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం రూ.999గా ఉన్న ప్లాన్ డిసెంబర్ 13తర్వాత రూ.1499అవుతుందట.

అంటే రూ.500పెరుగుతుందన్న మాట. అలా జరిగితే 50శాతం అదనంగా పెరిగినట్లు అవుతుంది. మూడు నెలల ప్లాన్ రూ.329కి బదులుగా రూ.459, నెల రోజుల ప్లాన్ రూ.129బదులుగా రూ.179వరకూ పెంచుతామని అమెజాన్ ప్రకటించింది.

అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ రెన్యూ చేసుకోవాలనుకునే వారైనా వీలైనంత త్వరగా చేసుకుంటే.. రూ.500అదనంగా చెల్లించాల్సిన దాని నుంచి తప్పించుకోవచ్చు. డిసెంబర్ 13 ఆఖరి తేదీ అని అందులో స్పష్టమైంది. రేట్లు మాత్రమే పెరుగుతున్నాయి కానీ, వచ్చే బెనిఫిట్స్ మాత్రం సేమ్ అలానే కంటిన్యూ చేయనున్నారు.

…………………………………..: జీహెచ్ఎంసీ కార్యాలయం ముట్టడి

అమెజాన్ ప్రైమ్ ఉంటే ఫ్రీ డెలివరీలు, ముందుగానే డెలివరీ చేయడం, మినిమం ఆర్డర్ అవసరం లేకపోవడం వంటివి అందించడంతో పాటు ప్రైమ్ వీడియోస్, ప్రైమ్ మ్యూజిక్ వంటి ఫీచర్లు పొందొచ్చన్నమాట.