Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌లో ఐపీఎల్ లైవ్!!

అమెజాన్ ప్రైమ్‌లో ఇకపై ఐపీఎల్ లైవ్ టెలికాస్ట్ అయ్యే దిశగా అడుగులేస్తున్నారు అమెజాన్ మేనేజ్మెంట్. ఇండియాలో గణనీయంగా పాపులారిటీ దక్కించుకున్న అమెజాన్..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌లో ఐపీఎల్ లైవ్!!

New Project (3)

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌లో ఇకపై ఐపీఎల్ లైవ్ టెలికాస్ట్ అయ్యే దిశగా అడుగులేస్తున్నారు అమెజాన్ మేనేజ్మెంట్. ఇండియాలో గణనీయంగా పాపులారిటీ దక్కించుకున్న అమెజాన్.. ఓటీటీ సెగ్మెంట్‌లో పోటీ కంపెనీలపై పూర్తి స్థాయి మెజారిటీ సాధించేందుకు వీలుగా కదుపుతోంది.

ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ అయిన ఐపీఎల్.. హక్కులు దక్కించుకునే ప్లాన్‌లో సోని పిక్చర్స్‌తో కలిసి బిడ్‌ వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు డిసెంబరులో ఐపీఎల్‌ ప్రసార హక్కులను వేలం వేయనుండగా దీని కోసమే పావులు కదుపుతోంది.

21 వేల కోట్లకు పైగానే
మార్కెట్‌ వర్గాలు అంచనా ప్రకారం శాటిలైట్‌, డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్రసార హక్కుల కోసం ప్రైమ్‌ వీడియోస్‌, సోని పిక్చర్స్‌ సంయుక్తంగా 3 నుంచి 4 బిలియన్‌ డాలర్ల (సుమారు 21 వేల నుంచి 28 వేల కోట్లు) వరకు ఖర్చు చేసేందుకు రెడీగా ఉన్నాయి. ఐపీఎల్‌కి సంబంధించి 2023 నుంచి 2017 వరకు 5 సీజన్లకు సంబంధించి ప్రసార హక్కుల కోసం భారీ బిడ్‌ను దాఖలు చేయనుందట అమెజాన్ ప్రైమ్‌.

………………………………………………… : ఈ దోమలు ‘మంచి’వి : డెంగ్యూని నివారిస్తాయి

ప్రసారాలకు పోటీ
డిజిటల్‌ స్ట్రీమింగ్‌లో ప్రైమ్‌ వీడియోస్‌కి మంచి కస్టమర్‌ బేస్‌ ఉంది. దేశంలోనే నంబర్‌ వన్ ఓటీటీగా ఉన్న ప్రైమ్ వీడియోస్ టీవీ ప్రసారాల్లో వెనుకబడి ఉంది. సోని నెట్‌వర్క్‌.. జీ నెట్‌వర్క్‌ను కూడా సొంతం చేసుకోవడంతో బలమైన టీవీ నెట్‌వర్క్‌గా రూపాంతరం చెందింది. ఇలా రెండు సంస్థలు సంయుక్తంగా బిడ్‌ దాఖలు చేయడం ద్వారా స్టార్‌గ్రూపుకి చెక్‌ పెట్టడానికి రెడీ అవుతున్నాయి.

సోనీకి షాక్‌
ఐపీఎల్‌ ప్రసార హక్కులు 2012 నుంచి 2017 సోనీ గ్రూపు చేతిలో ఉండేవి. ఆ తర్వాత జరిగిన వేలంలో సోనీ గ్రూపు ఐదేళ్ల కాలపరిమితికి రూ. 11వేల 50 కోట్లతో బిడ్‌ దాఖలు చేయగా స్టార్‌, హాట్‌స్టార్‌లు కలిసి రూ. 16వేల 348 కోట్లు దాఖలు చేశాయి. అలా సోని ప్రసార హక్కులు స్టార్‌ గ్రూప్‌కి వెళ్లాయి. ఈసారి ప్రసార హక్కులు సొంతం చేసుకునేందుకు సోనీ సంస్థ.. అమెజాన్‌ ప్రైమ్‌తో జత కట్టాలని నిర్ణయించింది.