Amazon Prime Video : అమెజాన్ కొత్త ప్రైమ్ స్టోర్ సర్వీసు.. ఇచ్చట మూవీలు అద్దెకు ఇవ్వబడును..!

Amazon Prime Video : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) కొత్త సర్వీసును లాంచ్ చేసింది. భారత మార్కెట్లో New Amazon Prime Store లాంచ్ చేసింది.

Amazon Prime Video : అమెజాన్ కొత్త ప్రైమ్ స్టోర్ సర్వీసు.. ఇచ్చట మూవీలు అద్దెకు ఇవ్వబడును..!

Amazon Prime Video Announces Movie Rental Service In India What Is It And How It Works

Amazon Prime Video : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) కొత్త సర్వీసును లాంచ్ చేసింది. భారత మార్కెట్లో New Amazon Prime Store లాంచ్ చేసింది. ఈ సర్వీసు కేవలం ప్రైమ్ వీడియో సబ్ స్ర్కైబర్ల కోసమే కాదు.. నాన్ ప్రైమ్ సబ్ స్ర్కైబర్లు కూడా వినియోగించుకోవచ్చు. ప్రత్యేకించి భారతీయ ప్రైమ్ వీడియో వినియోగదారుల కోసం కంపెనీ ఈ సర్వీసును ప్రవేశపెట్టింది. దీని ద్వారా యూజర్లు మూవీలను రెంట్ తీసుకోవచ్చు. అది ప్రాంతీయ భాష మూవీలు కావొచ్చు.. అంతర్జాతీయ మూవీలు కావొచ్చు.. మీకు నచ్చిన మూవీలను రెంటుకు తెచ్చుకోవచ్చు..

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏదైనా మూవీ చూడాలంటే కచ్చితంగా సబ్ స్ర్కిప్షన్ ఉండాల్సిందే. లేదంటే ప్రైమ్ వీడియో కంటెంట్ యాక్సస్ చేసుకోలేరు. భారత్ లో అమెజాన్ లాంచ్ చేసిన ప్రైమ్ వీడియో స్టోర్ ద్వారా మీకు నచ్చిన ఏదైనా ఒక మూవీని ఎలాంటి సబ్ స్ర్కిప్షన్ ఫీజు చెల్లించకుండానే వీక్షించవచ్చు. కానీ, మీరు చూసే మూవీకి మాత్రమే రెంట్ ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది. అమెజాన్ ప్రైమ్ సర్వీసు అందించే ఈ మూవీ రెంటల్ సర్వీసు.. గూగుల్ రెంట్ మూవీ ఆప్షన్ మాదిరిగానే పనిచేస్తుంది. ఇప్పటికే సెర్చ్ ఇంజిన్ దిగ్గజం Youtube, Amazon Transaction Video-On-Demand (TVoD) సర్వీసుతో పనిచేస్తుంది.

Amazon Prime Video Announces Movie Rental Service In India What Is It And How It Works (2)

Amazon Prime Video Announces Movie Rental Service In India What Is It And How It Works

ఈ Prime Video Store సర్వీసు కేవలం subscribers మాత్రమే కాదు.. నాన్ సబ్ స్ర్కైబర్లు కూడా వీక్షించవచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో ఏదైనా మూవీని చూడాలంటే సబ్ స్ర్కిప్షన్ అవసరం లేదు.. మీరు చూసే మూవీకి మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అమెజాన్ ప్రైమ్ స్టోర్‌లో మూవీ రెంట్ ధరలు రూ.69 నుంచి రూ. 499 వరకు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్ ఎవరైనా ఒక మూవీని రెంట్‌కు తీసుకుంటే.. 30 రోజుల్లో ఎప్పుడైనా వీక్షించవచ్చు. కానీ, ఒకవేళ మూవీని మీరు చూడటం స్టార్ట్ చేస్తే మాత్రం.. ఆ మూవీని 48 గంటల్లోగా పూర్తి చేయాలి. ఈ డెడ్ లైన్ మిస్ అయితే మాత్రం.. ఆ మూవీని తిరిగి చూడలేరు.

అమెజాన్ ప్రైమ్ స్టోర్‌లో మూవీని ఎలా అద్దెకు తీసుకోవాలంటే? :

అమెజాన్ ప్రైమ్ స్టోర్‌ (Amazon Prime Store) ఓపెన్ చేయండి.
Amazon Prime Store App యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో మీ బ్రౌజర్‌లో కూడా యాక్సస్ చేసుకోవచ్చు.
Amazon Prime Store వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగానే.. కొత్త “Store” Tab కనిపిస్తుంది.
మీరు స్టోర్‌లోని వివిధ కేటగిరీల నుంచి మీకు నచ్చిన మూవీలను Rent తీసుకోవచ్చు.
మీరు అద్దెకు తీసుకోవాలనుకుంటున్న సినిమాపై Click చేసి “Rent” బటన్‌పై నొక్కండి.
మీరు Rent బటన్‌పై నొక్కగానే.. మీ అమెజాన్ అకౌంట్ సైన్ ఇన్ అడుగుతుంది.
మీరు Sign In చేసిన తర్వాత.. Rent చెల్లించడానికి Payment Method ఎంచుకోండి.
మీరు మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ల ద్వారా మాత్రమే Payments చేయగలరు.
అమెజాన్ ప్రైమ్ స్టోర్ ప్రస్తుతం UPI పేమెంట్లకు సపోర్టు లేదని గుర్తించుకోవాలి.

Read Also : Amazon Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్… ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు