Best Deals On Laptops : అమెజాన్‌లో ల్యాప్‌టాప్‌లపై 5 బెస్ట్ డీల్స్.. భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Best Deals On Laptops : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ప్లాట్‌ఫారమ్‌లో 8 రోజుల పాటు పండుగ సీజన్ సేల్ (Festival Season Sale) నిర్వహిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌‌లో కొనుగోలుదారులు అనేక రకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.

Best Deals On Laptops : అమెజాన్‌లో ల్యాప్‌టాప్‌లపై 5 బెస్ట్ డీల్స్.. భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Amazon Sale : Best deals on laptops from HP, Lenovo available under ₹40,000

Best Deals On Laptops : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ప్లాట్‌ఫారమ్‌లో 8 రోజుల పాటు పండుగ సీజన్ సేల్ (Festival Season Sale) నిర్వహిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ (Amazon Great Indian Festival Sale)లో కొనుగోలుదారులు అనేక రకాల ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. మీరు ఈ ఫెస్టివల్ సీజన్‌లో ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? Amazon లో రూ. 40వేల లోపు బెస్ట్ సెల్లింగ్ ల్యాప్‌టాప్‌ల లిస్టును మీకోసం అందిస్తున్నాం. అందులో మీకు నచ్చిన బ్రాండ్ ల్యాప్ టాప్ కొనుగోలు చేయవచ్చు. అవేంటో ఓసారి లుక్కేయండి.

HP 15s-Ryzen 3 5300U :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో HP 15s-Ryzen 3 5300U ల్యాప్‌టాప్‌పై 29శాతం తగ్గింపుతో రూ. 33,990కి ఆఫర్ చేస్తోంది. ఈ ల్యాప్‌టాప్ 8GB SDRAM, 256GB SSD స్టోరేజీని అందిస్తుంది. 15.6-అంగుళాల FHD డిస్ప్లేతో Windows 11లో రన్ అవుతుంది. ల్యాప్‌టాప్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో వస్తుంది. అలాగే ల్యాప్‌టాప్ 1.69Kg బరువు ఉంటుంది.

Amazon Sale : Best deals on laptops from HP, Lenovo available under ₹40,000

Amazon Sale : Best deals on laptops from HP, Lenovo available

Acer Aspire 3 :
Acer Aspire 3 31శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 35,990 వద్ద కొనుగోలు చేయవచ్చు Full HD రిజల్యూషన్‌తో 15.6-అంగుళాల IPS డిస్‌ప్లేతో వచ్చింది. ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ i3 1115G4 ప్రాసెసర్‌తో 8 GB DDR4 RAM సిస్టమ్ మెమరీతో రాగా..16 GBకి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

Amazon Sale : Best deals on laptops from HP, Lenovo available under ₹40,000

Amazon Sale : Best deals on laptops from HP, Lenovo available

Honor MagicBook 14 :
Honor MagicBook 14 అసలు ధరపై 41శాతం డిస్కౌంట్ తర్వాత రూ. 38,990 తగ్గింపు ధరతో లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 14-అంగుళాల FHD IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో వచ్చింది. AMD Ryzen 5 5500U ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. 56 Wh పెద్ద బ్యాటరీ సామర్థ్యం ఉంది. సుమారు 11 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. 65W పోర్టబుల్ ఛార్జర్‌తో ఒక గంటలో Honor MagicBook 14 కోసం 65శాతం బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచుతుంది.

Amazon Sale : Best deals on laptops from HP, Lenovo available under ₹40,000

Amazon Sale : Best deals on laptops from HP, Lenovo available

Lenovo IdeaPad Slim 3 :
Lenovo IdeaPad Slim 3ని రూ. 34,990 వద్ద 43శాతం తగ్గింపు తర్వాత కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ Intel Core i3 11th Gen ప్రాసెసర్‌తో వచ్చింది. 14-అంగుళాల FHD స్క్రీన్‌ను కలిగి ఉంది. సన్నని, తేలికపాటి ల్యాప్‌టాప్ కూడా. 512GB SSD స్టోరేజీతో 8GB RAMని అందిస్తుంది. /Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 1.41Kg బరువు ఉంటుంది.

Amazon Sale : Best deals on laptops from HP, Lenovo available under ₹40,000

Amazon Sale : Best deals on laptops from HP, Lenovo available 

Redmi Book Pro :
Redmi Book Pro తగ్గింపు ధర రూ. 39,990తో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 59,999పై 33శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డివైజ్ 1920×1080, 16:9 యాస్పెక్ట్ రేషియో, FHD రిజల్యూషన్‌తో 15.6-అంగుళాల యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేను అందిస్తుంది. 8GB DDR4 RAM, 512GB PCIe NVMe M.2 SSD స్టోరేజీని అందిస్తోంది.

Amazon Sale : Best deals on laptops from HP, Lenovo available under ₹40,000

Amazon Sale : Best deals on laptops from HP, Lenovo available

Read Also : LG Gram 2021 Laptops: అద్భుతమైన ఫీచర్లతో ల్యాప్‌టాప్‌లు.. భారత మార్కెట్లోకి! ధర ఎంతంటే?