Android 13 Beta Update : నథింగ్ ఫోన్ (1)లో ఆండ్రాయిడ్ 13 ఓపెన్ బీటా అప్‌డేట్ వచ్చేసింది.. మీ ఫోన్‌లో ఉందేమో ఇప్పుడే చెక్ చేసుకోండి!
Android 13 Beta Update : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు నథింగ్ (Nothing) సీఈఓ కార్ల్‌పీ ఇటీవల నథింగ్ ఫోన్ (1) కోసం ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ని ప్రకటించింది. ఇప్పుడు Android 13 ఆధారిత నథింగ్ OS 1.5 బీటా ప్రోగ్రామ్‌ను రిలీజ్ చేసింది.

Nothing Phone (1) gets Android 13 open beta update
Android 13 Beta Update : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు నథింగ్ (Nothing) సీఈఓ కార్ల్‌పీ ఇటీవల నథింగ్ ఫోన్ (1) కోసం ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ని ప్రకటించింది. ఇప్పుడు Android 13 ఆధారిత నథింగ్ OS 1.5 బీటా ప్రోగ్రామ్‌ను రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్ 13ని నథింగ్ ఫోన్ (1)లో తీసుకొచ్చేందుకు బీటా టెస్టింగ్ జరుగుతోంది. మీరు నథింగ్ ఫోన్ (1)ని కలిగి ఉన్నారా? అయితే ఓపెన్ బీటా ప్రోగ్రామ్‌తో Android 13 పొందే మొదటి యూజర్లలో మీరు ఒకరు కావచ్చు. 2022 డిసెంబర్ మధ్యలో ఈ కొత్త బీటా అప్‌డేట్ రిలీజ్ అయింది.
నథింగ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా దీనికి సంబంధించి వివరాలను షేర్ చేసింది. సాఫ్ట్‌వేర్ బీటా వెర్షన్.. ఈ సాఫ్ట్‌వేర్‌పై ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఏమీ OSని మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు డేటా బ్యాకప్‌ని క్రియేట్ చేసుకోవాలి లేదా డివైజ్‌లోని డేటా/కంటెంట్‌ను కోల్పోతే కంపెనీ బాధ్యత వహించదని తెలిపింది.

Nothing Phone (1) gets Android 13 open beta update
కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్టెడ్ నథింగ్ UIతో కొత్త ఇన్విరాన్‌మెంట్ యాప్‌ను అందిస్తుంది. యాప్ లోడింగ్ స్పీడ్ 50శాతం వరకు పెంచింది. థర్డ్ పార్టీ యాప్‌లు, వాల్‌పేపర్‌లను మార్చేందుకు OS సహా కలర్ స్కీమ్‌లను కూడా అందిస్తుంది. విభిన్న యాప్‌ల కోసం వివిధ భాషలను అనుమతించే మల్టీ-భాషా సపోర్టును కూడా యాడ్ చేస్తోంది.
నథింగ్ OS 1.5తో ప్రైవసీ అప్‌గ్రేడ్‌లు, యూజర్లు ప్రతి యాప్‌తో ఏ ఫొటోలను షేర్ చేయాలనుకుంటున్నారో ఎంచుకునేందుకు అనుమతించే ఫోటో పికర్‌ను కలిగి ఉంటుంది. ఏ యాప్‌లు నోటిఫికేషన్‌లను పంపవచ్చో కంట్రోల్ చేయడానికి నోటిఫికేషన్ అనుమతులు పొందవచ్చు. ఫొటోలు, వీడియోలు, మ్యూజిక్, ఆడియో, ఫైల్‌లను పొందవచ్చు. ఈ కొత్త అప్‌డేట్ పొందడం ద్వారా క్లిప్‌బోర్డ్ ప్రివ్యూతో పాటు క్విక్ సెట్టింగ్‌లలో కొత్త QR కోడ్ స్కానర్ కూడా పొందవచ్చు.

Nothing Phone (1) gets Android 13 open beta update
OS అప్‌డేట్ చేయడం ద్వారా మీడియా కంట్రోల్ కోసం కొత్త డిజైన్ కలిగి ఉంది. బ్యాటరీని ఆదా చేసేందుకు నోటిఫికేషన్ సెంటర్ నుంచి నేరుగా యాక్టివ్ బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను మూసివేయగలదు. మీ డివైజ్‌లో ఆటోమాటిక్‌గా గుర్తించేందుకు క్యాప్షన్లను రూపొందించడానికి నథింగ్ ఫోన్ (1) లైవ్ క్యాప్షన్ ఫీచర్‌ను కూడా అందిస్తుంది.
OSతో ఇతర మార్పులలో బ్యాక్‌గ్రౌండ్ మెమరీని పెంచడం, సెల్ఫ్ రిపేర్ ఫీచర్ ఫోన్ (1)ని కొత్తదిలా రన్ చేసేలా చేస్తుంది. వాల్యూమ్ కంట్రోల్ కోసం అప్‌డేట్ చేసిన UI, మెరుగైన గేమ్ మోడ్ పొందవచ్చు. మీరు కూడా నథింగ్ ఫోన్ (1) వాడుతుంటే.. వెంటనే Android 13 Beta అప్‌డేట్ చేసుకోండి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..