Android 13OS : ఆండ్రాయిడ్ 13OS సపోర్టు చేసే స్మార్ట్ ఫోన్ల ఫుల్ లిస్టు ఇదే.. శాంసంగ్ నుంచి వన్ ప్లస్ సహా అన్ని ఫోన్లలో అప్‌డేట్!

Android 13OS : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ను మేలో ప్రకటించింది. కొత్త ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ పిక్సెల్ ఫోన్‌లకు మాత్రమే ప్రకటించింది. అయితే త్వరలో ఇతర ఆండ్రాయిడ్ ఫోన్‌లకు కూడా అందుబాటులో ఉంటుంది.

Android 13OS : ఆండ్రాయిడ్ 13OS సపోర్టు చేసే స్మార్ట్ ఫోన్ల ఫుల్ లిస్టు ఇదే.. శాంసంగ్ నుంచి వన్ ప్లస్ సహా అన్ని ఫోన్లలో అప్‌డేట్!

Android 13OS Full list of Samsung, OnePlus and all phone to get the update

Android 13OS : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ను మేలో ప్రకటించింది. కొత్త ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ పిక్సెల్ ఫోన్‌లకు మాత్రమే ప్రకటించింది. అయితే త్వరలో ఇతర ఆండ్రాయిడ్ ఫోన్‌లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఫోన్‌లకే కాకుండా టాబ్లెట్‌లకు కూడా అనేక ఫీచర్లతో వస్తుంది. యాప్ కలర్ థీమింగ్‌ను మరిన్ని యాప్‌లకు విస్తరించడంతో పాటు యాప్ స్థాయిలో భాషా సెట్టింగ్‌లు, మెరుగైన ప్రైవసీ కంట్రోల్స్, ఆండ్రాయిడ్ డివైజ్ నుంచి టెక్స్ట్, మీడియాను కాపీ చేయొచ్చు.

ఒకే ఒక క్లిక్‌తో పిక్సెల్ కాకుండా ఇతర స్మార్ట్‌ఫోన్‌లకు కూడా ఆండ్రాయిడ్ 13ని లాంచ్ చేయొచ్చు. ఈ ఏడాది చివరలో శాంసంగ్ గెలాక్సీ, ఆసుస్, HMD (నోకియా ఫోన్‌లు), iQO, మోటరోలా, వన్‌ప్లస్, ఒప్పో నుంచి మీకు ఇష్టమైన డివైజ్‌లకు కూడా Android 13 రిలీజ్ అవుతుంది. Realme, Sharp, Sony, Tecno, vivo, Xiaomi సహా త్వరలో ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

Google Pixel Phones :

– Pixel 4 (XL)
– Pixel 4a
– Pixel 4a (5G)
– Pixel 5
– Pixel 5a (5G)
– Pixel 6
– Pixel 6 Pro
– Pixel 6a

Android 13OS Full list of Samsung, OnePlus and all phone to get the update

Android 13OS Full list of Samsung, OnePlus and all phone to get the update

Android బ్రాండ్‌లు ఇవే :

– Samsung Galaxy ఫోన్‌లు
– Asus
– Nokia Phones
– HMD (Nokia Phones)
– iQOO, Motorola
– OnePlus
– Oppo
– Realme
– Sharp
– Sony
– Tecno
– vivo
– Xiaomi

మీ వద్ద పిక్సెల్ ఫోన్ (Pixel Phone) ఉందా? మీరు మీ ఫోన్‌లోని సెట్టింగ్‌ ఆప్షన్‌కు వెళ్లాలి, Systems> System >System Update ఆపై “Update For Checking ” ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ ఫోన్ ఎంపికను ఎంచుకోవచ్చు. Android 13 విభిన్న యాప్‌లకు నిర్దిష్ట భాషలను కేటాయించే సామర్థ్యంతో సహా ఆసక్తికరమైన ఫీచర్‌ల గ్రూపులతో అందుబాటులోకి వస్తుంది. యూజర్ల ఫోన్‌లో ఉన్న అన్ని యాప్‌లకు ఒకే భాషను మాత్రమే కేటాయించవచ్చు.

Read Also : New Smartphones in 2022: జనవరి 2022లో వస్తున్న 5 టాప్ స్మార్ట్ ఫోన్స్