ఫీచర్ డిజేబుల్డ్ : ఆండ్రాయిడ్ టీవీలో బగ్.. యూజర్ల ఫొటోలు లీక్

గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీ ఆండ్రాయిడ్ టీవీలో ఓ బగ్ ఉందట. ఈ బగ్.. మీకు తెలియకుండానే మీ పర్సనల్ ఫొటోలు, డేటాను టీవీ డివైజ్ నుంచి ఇతరులకు కనిపించేలా చేస్తుందట.

  • Published By: sreehari ,Published On : March 5, 2019 / 09:03 AM IST
ఫీచర్ డిజేబుల్డ్ : ఆండ్రాయిడ్ టీవీలో బగ్.. యూజర్ల ఫొటోలు లీక్

గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీ ఆండ్రాయిడ్ టీవీలో ఓ బగ్ ఉందట. ఈ బగ్.. మీకు తెలియకుండానే మీ పర్సనల్ ఫొటోలు, డేటాను టీవీ డివైజ్ నుంచి ఇతరులకు కనిపించేలా చేస్తుందట.

గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీ ఆండ్రాయిడ్ టీవీలో ఓ బగ్ ఉందట. ఈ బగ్.. మీకు తెలియకుండానే మీ పర్సనల్ ఫొటోలు, డేటాను టీవీ డివైజ్ నుంచి ఇతరులకు కనిపించేలా చేస్తుందట. ఆండ్రాయిడ్ టీవీలో బగ్ ఉన్నట్టు గుర్తించిన ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ టీవీలో ఆ ఫీచర్ ను డిసేబుల్ చేసింది. ఆండ్రాయిడ్ టీవీ, గూగుల్ హోం యాప్ ఏదైనా ఒక జీమెయిల్ అకౌంట్ నుంచి యాక్సస్ చేసుకోవచ్చు.

సాధారణంగా ఆండ్రాయిడ్ టీవీకి యూజర్ కనెక్ట్ కాగానే టీవీ డివైజ్ లో ఇతరుల అకౌంట్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఈ బగ్ కారణంగా యూజర్ గూగుల్ ఫొటోలు, లింకైన అకౌంట్లను అంబినెంట్ మోడ్ స్ర్కీన్ సేవర్ సెట్టింగ్స్ ను ఇతరులకు కనిపించేలా చేస్తుందని గూగుల్ గుర్తించింది. దీంతో యూజర్ల డేటాకు సెక్యూరిటీ సమస్య తలెత్తుతోంది. ఆండ్రాయిడ్ టీవీలో బగ్ ఉన్నట్టు ప్రశాంత్ అనే ట్విట్టర్ యూజర్ గుర్తించి తన అకౌంట్ లో పోస్టు చేశాడు. 
Also Read : పేరంట్స్ Ok అనాలంట : PUBG గేమ్‌కు ఏజ్ లిమిట్

VU ఆండ్రాయిడ్ టీవీ డివైజ్ లో డేటా డిసిప్లే అయినట్టు గుర్తించాడు. వియూ ఆండ్రాయిడ్ టీవీ ఇండియా బేసిడ్ టెలివిజన్ బ్రాండ్. ఈ తరహాలో ఎన్నో ఆండ్రాయిడ్ టీవీలు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. గూగుల్, వియూ ఆండ్రాయిడ్ టీవీల్లో బగ్ కు సంబంధించి XDA డెవలపర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో గూగుల్ క్యాస్ట్ ఫీచర్ ను డిసేబుల్ చేసినట్టు తెలిపింది.

గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ఫొటోలను ఆండ్రాయిడ్ టీవీ డివైజ్ ల్లో రిమోట్లీ యాక్సెస్ లేకుండా తాత్కాలికంగా డిసేబుల్ చేసింది. యూజర్ల ప్రైవసీ దృష్ట్యా వెంటనే ఫీచర్ ను డిజేబుల్ చేసినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. బగ్ ను ఫిక్స్ చేసేంతవరకు ఫీచర్ ను డిజేబుల్ చేసినట్టు పేర్కొంది. 

మరోవైపు వియూ ఆండ్రాయిడ్ టీవీ డివైజ్ ల్లో గూగుల్ హోం యాప్ మాల్ ఫంక్షన్ పై VU TV కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. గూగుల్ హోం యాప్ లో సాఫ్ట్ వేర్ మాల్ ఫంక్షన్ జరుగుతున్నట్టు గూగుల్ కు తెలిపింది. గూగుల్ హోం యాప్ లో ఈ బగ్ సమస్య ఉన్నట్టు పేర్కొంది. బగ్ కారణంగా స్ర్కీన్ షాట్ ల రూపంలో గూగుల్ హోం యాప్ ఆండ్రాయిడ్ టీవీ డివైజ్ లోని ప్రతి ఒక్క అకౌంట్లో డిసిప్లే అవుతున్నట్టు గుర్తించినట్టు తెలిపింది.

ఇతర లింక్ అయిన అకౌంట్లకు సంబంధించిన యూజర్ల పర్సనల్ ఫొటోలు కూడా గూగుల్ హోం యాప్ స్క్రీన్ సేవర్ సెట్టింగ్స్ పై డిసిప్లే అయినట్టు పేర్కొంది. దీనికి సంబంధించి వీడియోను ఓ యూజర్ షేర్ చేయడంతో వైరల్ గా మారింది. యూజర్ల డేటా ప్రైవసీ, భద్రత తప్పనిసరిగా ఉండాలి. ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు యూజర్లు తమ ఆండ్రాయిడ్ టీవీని రీసెట్టింగ్ చేయడం వల్ల సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. 
Also Read : డోంట్ మిస్ : Airtel 4G మైండ్ బ్లోవింగ్ ఆఫర్స్