Apple Security Flaws Fix : ఐఫోన్, మ్యాక్ డివైజ్‌ల్లో డేంజరస్ బగ్స్.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. యూజర్లకు ఆపిల్ వార్నింగ్..!

Apple Security Flaws Fix : ఐఫోన్, మ్యాక్ డివైజ్ యూజర్లకు ఆపిల్ వార్నింగ్ ఇచ్చింది. ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్ యూజర్లను కొత్త అప్ డేట్ డౌన్ లోడ్ చేసుకోమని ఆపిల్ సూచిస్తోంది. ఆపిల్ డివైజ్‌ల్లో రెండు డేంజరస్ బగ్స్ ఉన్నాయని గుర్తించింది.

Apple Security Flaws Fix : ఐఫోన్, మ్యాక్ డివైజ్‌ల్లో డేంజరస్ బగ్స్.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. యూజర్లకు ఆపిల్ వార్నింగ్..!

Apple fixes 2 dangerous security flaws on iPhones and Macs, says users must update immediately

Apple Security Flaws Fix : ఐఫోన్, మ్యాక్ డివైజ్ యూజర్లకు ఆపిల్ వార్నింగ్ ఇచ్చింది. ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్ యూజర్లను కొత్త అప్ డేట్ డౌన్ లోడ్ చేసుకోమని ఆపిల్ సూచిస్తోంది. ఆపిల్ డివైజ్‌ల్లో రెండు డేంజరస్ బగ్స్ ఉన్నాయని గుర్తించింది. అందుకే యూజర్ల కోసం కొత్త అప్‌డేట్ రిలీజ్ చేసింది. సెక్యూరిటీ బగ్స్ ఫిక్స్ చేసిన అనంతరం ఆపిల్ ఈ కొత్త అప్‌డేట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. iPhone, Mac, iPad యూజర్లు వెంటనే ఈ కొత్త అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తోంది. iOS 15.6.1, macOS Monterey 12.5.1, iPadOS 15.6.1 అప్‌డేట్‌ భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

వెంటనే ఈ కొత్త ప్యాచ్ అప్‌డేట్ చేసుకోకపోతే.. సిస్టమ్‌లోకి ప్రవేశించి మీ విలువైన డేటాను యాక్సస్ చేయవచ్చు. అన్ని డివైజ్‌లు OS (ఆపరేటింగ్ సిస్టమ్) ప్యాచ్డ్ వెర్షన్‌ను అమలు చేసే వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. Apple, ఇతర టెక్నికల్ కంపెనీల మాదిరిగా కచ్చితమైన సెక్యూరిటీ లోపాలను వెల్లడించదు. యూజర్ల సేఫ్టీని నిర్ధారించడానికి కంపెనీ సఫారి బ్రౌజర్ (Safari Browser) కోసం విడిగా అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తోంది.

Safari 15.6.1కి వెర్షన్ అప్‌గ్రేడ్ చేస్తుంది. అధికారిక చేంజ్‌లాగ్ ప్రకారం.. ‘CVE-2022-32894’, ‘CVE-2022-32893′ సెక్యూరిటీ లోపాలతో మూడు Apple డివైజ్‌లైన iPhone, Macs, iPadలపై ఎఫెక్ట్ పడనుంది. CVE-2022-32894 లోపం OS కెర్నల్‌ను ప్రభావితం చేస్తుంది. CVE-2022-32893’ అనేది వెబ్‌కిట్ సెక్యూరిటీ లోపం.. ఈ బగ్ ఫిక్స్ చేయకపోతే మీకు తెలియకుండానే మీ సిస్టమ్‌లో కోడ్ రన్ అవుతుంది. తద్వారా మీ సెక్యూరిటీ పరంగా సమస్యలకు దారితీయవచ్చు.

Apple fixes 2 dangerous security flaws on iPhones and Macs, says users must update immediately

Apple fixes 2 dangerous security flaws on iPhones and Macs, says users must update immediately

యూజర్ల కోసం vulnerability అధికమైన ఎఫెక్ట్ ఉంటుందని తెలిపింది. వీలైనంత త్వరగా మీ iPhone, Mac, iPadని అప్‌డేట్ చేయాలని సూచించింది. iOS 15.6.1, iPadOS 15.6.1 iPhone 6s, ఆ తర్వాత, iPad Pro (అన్ని మోడల్‌లు), iPad Air 2, ఆ తరువాతి, iPad 5వ జనరేషన్, నెక్ట్స్ iPad mini 4, ఆపై వెర్షన్ iPod touch (7వ జనరేషన్) కోసం అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్‌వేర్‌ను మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేయడానికి Settings > General > Software update > Download and Install చేయండి.

MacOS Monterey 12.5.1ని Apple Menu > System ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆపై సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై Click చేయండి. యూజర్లు Apple మెనుని కూడా క్లిక్ చేయవచ్చు. అందుబాటులో ఉన్న అప్‌డేట్స్ ప్రకారం.. సిస్టమ్ ప్రాధాన్యత చూపిస్తుంది. ఆపిల్ కూడా ఈ నెల ప్రారంభంలో iOS 16 Beta 5 వెర్షన్‌లను రిలీజ్ చేసింది. స్టేటస్ బార్‌లోని బ్యాటరీ ఐకాన్ బ్యాటరీ శాతాన్ని చూపిస్తుంది. అయితే 2018లో ఐఫోన్ X లాంచ్ తర్వాత యాపిల్ ఈ ఫీచర్‌ను తొలగించింది.

Read Also : Apple Watch Series 6 వచ్చేసింది.. ఈ కొత్త వాచ్ విప్పి చూశారా?