ఎట్రాక్టింగ్ ఫీచర్లు ఇవే : ఆపిల్ కొత్త ఐఫోన్ 11.. ఫొటోలు లీక్!

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ నుంచి కొత్త మోడల్ ఐఫోన్లు మరి కొన్ని నెలల్లో రిలీజ్ కానున్నాయి. కొత్త ఐఫోన్ మోడల్స్ రిలీజ్ కాకముందే ఫీచర్లకు సంబంధించి పుకార్లు షికారు చేస్తున్నాయి.

  • Published By: sreehari ,Published On : May 14, 2019 / 02:29 PM IST
ఎట్రాక్టింగ్ ఫీచర్లు ఇవే : ఆపిల్ కొత్త ఐఫోన్ 11.. ఫొటోలు లీక్!

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ నుంచి కొత్త మోడల్ ఐఫోన్లు మరి కొన్ని నెలల్లో రిలీజ్ కానున్నాయి. కొత్త ఐఫోన్ మోడల్స్ రిలీజ్ కాకముందే ఫీచర్లకు సంబంధించి పుకార్లు షికారు చేస్తున్నాయి.

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ నుంచి కొత్త మోడల్ ఐఫోన్లు మరి కొన్ని నెలల్లో రిలీజ్ కానున్నాయి. కొత్త ఐఫోన్ మోడల్స్ రిలీజ్ కాకముందే ఫీచర్లకు సంబంధించి పుకార్లు షికారు చేస్తున్నాయి. రాబోయే ఐఫోన్లలో కళ్లు చెదిరే డిజైన్, ఎట్రాక్టింగ్ ఫీచర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈలోపే ఆపిల్ కొత్త ఐఫోన్ 11 కు సంబంధించి ఫొటోలు లీకయ్యాయి. సోషల్ మీడియాలో ఐఫోన్ 11 ఫీచర్లు ఇవే అంటూ లీకైన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను బ్లూమ్ బెర్గ్ అనే టెక్ రైటర్ తన ట్విట్టర్ అకౌంట్లో అప్ లోడ్ చేశారు. 

లీకైన ఫొటోల ప్రకారం.. అప్ కమింగ్.. ఐఫోన్ 11లో ట్రిపుల్ కెమెరా ఫీచర్ యూనిట్ ఉన్నట్టు కనిపిస్తోంది. ట్రైయాంగులర్ ఫార్మేషన్ లో త్రి లెన్స్ కెమెరాలు రౌండ్ స్క్వేయిర్ సెట్టింగ్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఐఫోన్ 11 తో పాటు ఐఫోన్ 11 మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్2 ఫోన్లలో కూడా ఎట్రాక్టింగ్ సేమ్ ఫీచర్లు ఉంటాయని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మూడు ఐఫోన్లలో A13 Chip Set మెయిన్ ప్రాసిసర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంది. అయితే.. ఆపిల్ ఈ మూడు ఫోన్లకు ఏమని పేరు పెట్టిందో ఇప్పటికి కచ్చితమైన సమాచారం లేదు. కానీ, ఈ కొత్త ఐఫోన్లను ఆపిల్.. iPhone 11, iPhone 11 Max, iPhone XR2 పేర్లతో డిజైన్ చేసినట్టు సమాచారం. 

2019 ఏడాది ఐఫోన్లలో.. ఐఫోన్ 11 మ్యాక్స్ లో వైడ్ యాంగిల్ లెన్స్ తో 3 రియర్ కెమెరా సెట్ అప్ ఉన్నట్టు తెలుస్తోంది. హర్డ్ వేర్ అప్ గ్రేడ్.. సాఫ్ట్ వేర్ పనితీరును వేగవంతం చేసేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐఫోన్ ఎక్స్ ఆర్2 మోడల్ లో.. రియర్ ప్యానెల్ తో స్పోర్ట్ డ్యుయల్ లెన్స్ సెటప్ ఉండనుంది. బడ్జెట్ వేరియంట్ మోడల్ ఫోన్.. ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేయనుంది. ఈ మోడల్ ఫోన్లను ఐఫోన్లలో ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎక్స్ఎస్ లలో చూసే ఉంటాం. అంతేకాదు.. రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ను శాంసంగ్ గెలాక్సీ ఎస్10లో ప్రవేశపెట్టగా.. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆపిల్ రిలీజ్ చేసే ఐఫోన్లలో కూడా ఇదే ఫీచర్ రానుంది. 

మూడు కొత్త ఐఫోన్లలో ఎనేబుల్డ్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటుంది. ఆపిల్ ఐఫోన్లలో రిలీజ్ అయిన మోడల్స్ లో.. రియర్ కెమెరా సెటప్ డిజైన్ స్క్వెయిర్ హంప్ ఉండటంపై ఐఫోన్ లవర్స్ నుంచి విమర్శలు వచ్చాయి. వచ్చే ఐఫోన్ 11 మోడల్స్ లో ఈ చెత్త డిజైన్ ను ఆపిల్ తొలగిస్తుందని ఐఫోన్ లవర్స్ ఆశిస్తున్నారు. పాత ఐఫోన్ వెర్షన్లతో పోలిస్తే.. 2019లో ఆపిల్ రిలీజ్ చేసే కొత్త ఐఫోన్ వెర్షన్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.