Apple iPhone 13 : ఆపిల్ ఐఫోన్ 13పై అమెజాన్ భారీ ఆఫర్.. ధర ఎంతంటే?

Apple iPhone 13 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లపై ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా భారీ ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 13 మోడల్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది.

Apple iPhone 13 : ఆపిల్ ఐఫోన్ 13పై అమెజాన్ భారీ ఆఫర్.. ధర ఎంతంటే?

Apple Iphone 13 Price Drops To Rs.53,550. All Details About This Offer

Apple iPhone 13 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లపై ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా (Amazon India) భారీ ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 13 (iPhone 13) మోడల్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది. ఐఫోన్ 13 (128GB) వేరియంట్‌పై మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. అమెజాన్ ఇండియా పోర్టల్‌లో iPhone 13 మోడల్ కేవలం రూ. 53,550లకే సొంతం చేసుకోవచ్చు. పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులపై కూడా ఈ ఆఫర్ పొందవచ్చు. ఐఫోన్ 13 అసలు ధర రూ.79,900 ఉండగా.. అమెజాన్‌లో మిడ్‌నైట్ కలర్‌లో బేస్ మోడల్ ఐఫోన్ 128GB వేరియంట్ ధర రూ. 74,900లకు అందుబాటులో ఉంది. Amazon ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీ పాత ఫోన్‌లపై రూ.15,350 వరకు తగ్గింపు పొందవచ్చు.

ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఐఫోన్ 13 ధర రూ.59,550కు తగ్గుతుంది. అదే.. SBI Credit Card క్రెడిట్ కార్డు ఉపయోగించి మొబైల్ కొనుగోలు చేస్తే.. రూ.6,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అంటే.. ఐఫోన్ 13 128GB వేరియంట్ రూ.53,550కు లభించనుంది. ఈ మొబైల్ మీద రూ.26350 (రూ.5000 + రూ.15,350 + రూ.6000 ) వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్‌ 13 డిస్‌ప్లే 6.1 అంగుళాలు ఉంటే.. మినీ డిస్‌ప్లే 5.4 అంగుళాలుగా ఉంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే.. మీ పాత ఫోన్ నాణ్యత, తయారైన సంవత్సరం, ప్రస్తుతం ఫోన్ కండీషన్ బట్టి ధర మారే అవకాశం ఉంది. 2021 లాంచ్ అయిన iPhone 13 ఫోన్లలో A15 బయోనిక్ చిప్‌సెట్‌ అందిస్తోంది.

Apple Iphone 13 Price Drops To Rs.53,550. All Details About This Offer (1)

Apple Iphone 13 Price Drops To Rs.53,550. All Details About This Offer

ఇప్పుడు iPhone SE 3 2022 ఫోన్లలోనూ వస్తోంది. 5G ఫీచర్లతో ఐఫోన్లు సరసమైన ధరకే అందుబాటులోకి వస్తున్నాయి. 5G ఫీచర్లతో iPhone SEగా చౌకైన ధరకే వస్తోంది. ఈ ఐఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. iPhone 13 బ్యాక్ డ్యూయల్ 12MP లెన్స్‌లు, 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. మార్చి 8న స్ప్రింగ్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా Apple iPhone 13 గ్రీన్ కలర్ వేరియంట్‌ను ఆవిష్కరించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన Apple iPhone SE 3 2022 ఫోన్ రూ. 30,300లకే సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ పోర్టల్, అమెజాన్ ఇండియా, థర్డ్ జనరేషన్ iPhone SE ఐఫోన్ సరసమైన ధరకే అందుబాటులో వచ్చింది.

Read Also : Apple iPhone: రూ.17,800కే ఐఫోన్! ఫ్లిప్‌కార్ట్ “బిగ్ బచత్ ధమాల్” సేల్