Apple iPhone 15 : సరికొత్త నాచ్ డిజైన్‌తో ఆపిల్ ఐఫోన్ 15 వచ్చేస్తోంది.. డైనమిక్ ఐలాండ్ నాచ్ అదుర్స్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!

Apple iPhone 15 : ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 మోడల్ ఎట్టకేలకు కొత్త నాచ్ డిజైన్‌తో రాబోతోంది.

Apple iPhone 15 : సరికొత్త నాచ్ డిజైన్‌తో ఆపిల్ ఐఫోన్ 15 వచ్చేస్తోంది.. డైనమిక్ ఐలాండ్ నాచ్ అదుర్స్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!

Apple iPhone 15 may finally come with a New Notch Design : Here is how it may look

Apple iPhone 15 : ఆపిల్ నుంచి సరికొత్త ఐఫోన్ మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 మోడల్ ఎట్టకేలకు కొత్త నాచ్ డిజైన్‌తో రాబోతోంది. (iPhone 15) CAD (కంప్యూటర్-ఎయిడెడ్ డిజైన్) రెండర్‌లు ఈ ఏడాది సెప్టెంబరులో ఫోన్ ఊహించిన-లాంచ్ కన్నా ముందే ఆన్‌లైన్‌లో కనిపించాయి. 9to5Mac రెండర్‌ల ప్రకారం.. సాధారణ (iPhone 15)లో ఫ్రంట్ పాన్‌లో డైనమిక్ ఐలాండ్ నాచ్ ఉంటుంది. ప్రస్తుతం iPhone 14 Pro, 14 Pro Maxలో అందుబాటులో ఉంది.

డైనమిక్ ఐలాండ్ అనేది డిస్ప్లేలో Apple లేటెస్ట్ వెర్షన్ అని చెప్పవచ్చు. ఇతర నాచ్ డిజైన్‌ల మాదిరిగానే, డిస్ప్లే ఈ ఓవల్ షేప్ భాగంలో ముందు కెమెరా కలిగి ఉంది.ఫేస్ ID సెన్సార్‌లు ఉన్నాయి. అయినప్పటికీ, స్క్రీన్ పైభాగంలో డెడ్ స్పేస్‌కు బదులుగా డైనమిక్ ఐలాండ్ నోటిఫికేషన్‌లు, వార్నింగ్స్ లేదా రియల్-టైమ్ డేటాను సూచిస్తుంది. కూల్ సైజ్-అడ్జెస్ట్ యానిమేషన్‌తో iPhone 15 లేటెస్ట్ CAD రెండర్‌లు iPhone 15 ఫొటోకు తగినట్టుగా కనిపిస్తున్నాయి.

Apple iPhone 15 may finally come with a New Notch Design : Here is how it may look

Apple iPhone 15 may finally come with a New Notch Design

రాబోయే నాలుగు ఐఫోన్ 15 మోడళ్లలో ఐఫోన్ 15, ఐఫోన్ 15 మ్యాక్స్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ అందుబాటులో ఉంటుందని కొత్త నివేదిక పేర్కొంది. సాధారణ iPhone 15లో మరొక పెద్ద అప్‌డేట్ లైటినింగ్ పోర్ట్‌కు బదులుగా USB-C పోర్ట్ ఛార్జింగ్‌ను అందించనుంది. USB-C పోర్ట్ ఇప్పటికే ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్స్ వంటి అనేక ఆపిల్ ప్రొడక్టుల్లో అందుబాటులో ఉంది. టైప్-C పోర్ట్ ద్వారా స్పీడ్‌గా డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

Read Also : Apple iPhone 7 Sale : మెర్సిడెస్ బెంజ్ SUV కారు ధరకు 16ఏళ్ల నాటి ఐఫోన్ 7 మోడల్.. వేలంలో ఈ ఫోన్ ఎంత పలికిందో తెలిస్తే షాకవుతారు..!

సాధారణ iPhone 15 మోడల్‌లు LED ఫ్లాష్‌తో వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటాయి. థర్డ్ కెమెరా, LiDAR సెన్సార్ ఐఫోన్ ప్రో మోడ్‌లలో ప్రత్యేక ఫీచర్లతో వచ్చింది. ఆపిల్ iPhone 15 Pro, iPhone 15 Pro మోడల్.. ఆపిల్ వెనుక భాగంలో రెండు 12-MP కెమెరా సెన్సార్‌లతో వచ్చే అవకాశం ఉంది. (Apple iPhone 15) మోడల్స్‌లో బ్యాటరీని మరింత అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. ఆపిల్ ఈ ఏడాదిలో ఐఫోన్ 15 Ultra మోడల్‌ను కూడా లాంచ్ చేయవచ్చని నివేదిక సూచిస్తుంది. అత్యంత ఖరీదైన ఐఫోన్‌గా రానుంది.

Apple iPhone 15 may finally come with a New Notch Design : Here is how it may look

Apple iPhone 15 may finally come with a New Notch Design

Apple అత్యంత ప్రీమియంతో M1 Ultra SoC, Apple Watch Ultra వంటి పవర్‌ఫుల్ డివైజ్ ‘అల్ట్రా’ మోనికర్‌ను రిజర్వ్ చేసింది. అల్ట్రా ఐఫోన్ ప్రీమియం హార్డ్‌వేర్, భారీ, మెరుగైన కెమెరాలు, బ్యాటరీ, టాప్-ఆఫ్-ది-లైన్ SoC A17 బయోనిక్ SoCని కలిగి ఉంటుంది. ఐఫోన్‌లు ఈ ఏడాదిలో మరింత ఖరీదైనవిగా మారవచ్చు. ప్రస్తుతం, భారత మార్కెట్లో ఐఫోన్ 14 సాధారణ ధర రూ. 79,900 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 14 Max వెర్షన్ ధర రూ. 89,900 ఉండగా.. ఐఫోన్ 14 ప్రో ధర రూ. 1,29,900, ఐఫోన్ 14 ప్రో మాక్స్ ధర రూ. 1,39,900లకు అందుబాటులో ఉంది.

Read Also : Apple iPhone 15 Price : ఆపిల్ ఐఫోన్ 15 ధర లీక్.. ఐఫోన్లలో ఏ మోడల్ ధర ఎంత ఉండొచ్చుంటే? పూర్తి వివరాలు మీకోసం..!