iPhone 15 Series : యూఎస్‌బీ టైప్-c పోర్టుతో ఐఫోన్ 15 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

iPhone 15 Series : ఆపిల్ ఐఫోన్ 15, 15 ప్రో హ్యాండ్‌సెట్‌లు లైటనింగ్ పోర్ట్‌కు బదులుగా USB టైప్ - C పోర్ట్‌తో రావచ్చని కొత్త నివేదిక ధృవీకరించింది.

iPhone 15 Series : యూఎస్‌బీ టైప్-c పోర్టుతో ఐఫోన్ 15 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?

Apple iPhone 15 series to come with USB Type-C port

iPhone 15 Series : ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) రాబోయే iPhone 15, 15 pro లైటనింగ్ పోర్ట్‌కు బదులుగా USB టైప్-C పోర్ట్‌తో రావచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ రెండు ఫోన్‌లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 9to5Mac కొత్త నివేదిక ప్రకారం.. ఆపిల్ iPhone 15, 15 pro మోడళ్లు USB Type-C పోర్ట్‌తో వస్తాయి. ఛార్జింగ్ సిస్టమ్‌పై కొంత నియంత్రణను నిలుపుకోవడానికి ఆపిల్ ఇప్పటికీ ప్రయత్నిస్తోందని నివేదిక పేర్కొంది.

USB టైప్-C కేబుల్‌కు మారడం అంటే.. రాబోయే ఐఫోన్‌ల ఛార్జింగ్ స్పీడ్ పెరగవచ్చు. ప్రస్తుతం, ఐఫోన్ 15, 15 pro వరుసగా 20W, 27W వరకు ఛార్జింగ్ స్పీడ్ సపోర్ట్ చేస్తున్నాయి. iPhone 15, 15 Pro ఏదైనా USB టైప్-C కేబుల్ ద్వారా ఛార్జింగ్ చేసేందుకు సపోర్టు ఇస్తాయని భావిస్తున్నారు. అయితే, కంపెనీ హై-స్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్ లేదా ఫాస్ట్ ఛార్జింగ్ వంటి కొన్ని ఫీచర్లను ఆపిల్-సర్టిఫైడ్ యాక్సెసరీలకు మాత్రమే పరిమితం చేస్తుంది.

Read Also : Apple iPhone 14 Red : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్‌ 14పై భారీ డీల్.. తక్కువ ధరకు ఇప్పుడే కొనేసుకోండి..!

ఆపిల్ టైప్-సి పోర్ట్‌తో కొత్త అప్లియన్సెస్ తీసుకురావచ్చని నివేదిక పేర్కొంది. ఎయిర్‌పాడ్స్ ఛార్జింగ్ కేసులు, మాగ్‌సేఫ్ బ్యాటరీ ప్యాక్, మ్యాజిక్ కీబోర్డ్/ట్రాక్‌ప్యాడ్/మౌస్ వంటి ఇతర అప్లియన్సెస్ కూడా భవిష్యత్తులో USB-Cకి మారుతాయని ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో పేర్కొన్నారు.

Apple iPhone 15 series to come with USB Type-C port

Apple iPhone 15 series to come with USB Type-C port

MacRumors నివేదిక ప్రకారం.. iPhone 15, 15 Plus 48 MP కెమెరా సెన్సార్‌తో వస్తాయి. ఇప్పటికే ఉన్న iPhone లైనప్‌తో పోలిస్తే.. మెరుగైన ఫొటో క్వాలిటీతో మూడు-స్టాక్డ్ సెన్సార్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా 8GB RAMతో రానున్నాయి.

ఆసక్తికరంగా, ట్రెండ్‌ఫోర్స్ ప్రకారం.. 2023 ఐఫోన్ సిరీస్ ఫోన్‌లను భారత మార్కెట్లో తయారు చేసే అవకాశం ఉంది. ఐఫోన్ 15, 15 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో తయారు చేయవచ్చు. టాటా గ్రూప్ అసెంబుల్ చేయవచ్చని నివేదిక పేర్కొంది. నివేదిక నిజమని తేలితే.. ఫాక్స్‌కాన్, లక్స్‌షేర్, పెగాట్రాన్ తర్వాత భారత మార్కెట్లో ఐఫోన్‌లను అసెంబ్లింగ్ చేసిన 4వ కంపెనీగా టాటా గ్రూప్ అవతరిస్తుంది.

Read Also : Apple iPhone 12 : ఐఫోన్ 15 లాంచ్ తర్వాత ఐఫోన్ 12 ఇక కనిపించదట.. ఎందుకో తెలుసా?