Apple iPhone 15 Series : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ వచ్చేస్తోంది.. కొత్త లీక్ ఇదిగో..!

Apple iPhone 15 Series : ఆపిల్ ఐఫోన్ 15 లీక్‌లు.. Qi2 ఛార్జింగ్ స్టాండర్డ్ ఆధారంగా థర్డ్-పార్టీ ఛార్జర్‌లతో ఆపిల్ స్పీడ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుందని చెప్పవచ్చు.

Apple iPhone 15 Series : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ వచ్చేస్తోంది.. కొత్త లీక్ ఇదిగో..!

Apple iPhone 15 to finally get faster charging support, New leak reveals details

Apple iPhone 15 Series to finally get faster charging support : ప్రపంచ ఐటీ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) నుంచి సరికొత్త ఐఫోన్ 15 మోడల్ రాబోతోంది. వారాలు నెలలు గడుస్తున్న కొద్దీ రాబోయే ఐఫోన్ 15 సిరీస్ గురించి లీక్‌లు బయటకు వస్తున్నాయి. నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్‌లు కెమెరాలు, డిజైన్ వంటి కొన్ని సెక్షన్లలలో పెద్ద అప్‌గ్రేడ్‌లతో రానున్నాయని చెప్పవచ్చు. Qi2 ఛార్జింగ్ స్టాండర్డ్ ఆధారంగా థర్డ్-పార్టీ ఛార్జర్‌లతో ఆపిల్ స్పీడ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించనుంది. ఐఫోన్ 15 ప్రో మోడళ్లతో అధిక వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించే అవకాశం ఉంది. 2023 ఐఫోన్‌ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్ 15 స్పీడ్ ఛార్జింగ్ సపోర్టు ఉంటుందా? :
స్టాండర్డ్ ఆపిల్ ఐఫోన్ 15 మోడల్‌లు అదే 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే అవకాశం ఉంది. అయితే, (TomsGuide) కోట్ చేసిన వివరాల ప్రకారం.. iPhone 15 Pro వేరియంట్‌లు 27W వరకు సపోర్ట్‌ను పొందవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లు అందిస్తున్న వాటితో పోలిస్తే.. ఇది చాలా తక్కువగా ఉంటుంది. కానీ, ప్రో మోడల్‌లు కనీసం స్పీడ్ రేటుతో ఛార్జ్ చేస్తాయని లీక్ డేటా సూచిస్తోంది.

Read Also : New WhatsApp Update : వాట్సాప్‌లో సరికొత్త అప్‌డేట్.. ఒకేసారి 4 ఐఫోన్లలో వాట్సాప్ లాగిన్ కావొచ్చు తెలుసా?

దీనిపై అధికారిక ధృవీకరణ లేదు. లాంచ్ ఈవెంట్ వరకు వేచి చూడాల్సిందే. ప్రీమియం సెగ్మెంట్‌లోని ఆండ్రాయిడ్ ఫోన్‌లు 65W, 80W, 100W లేదా 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించనున్నాయి. మీ ఫోన్‌లో కనీసం 50 శాతం బ్యాటరీ అవసరమయ్యే సమయాల్లో సాయపడుతుంది. ఫాస్ట్ ఛార్జర్ త్వరగా బ్యాటరీని ఫుల్ చేస్తుంది.

Apple iPhone 15 to finally get faster charging support, New leak reveals details

Apple iPhone 15 Series to finally get faster charging support, New leak reveals details

(MacRumours) నివేదిక ప్రకారం.. ఐఫోన్ 15 కొత్త Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ స్టాండర్డ్‌తో థర్డ్-పార్టీ ఛార్జర్‌లను ఉపయోగించి 15W వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టు అందించనుంది. మునుపటి మోడల్‌లు కూడా 15W వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టును కలిగి ఉన్నాయి. అయితే, స్పీడ్ ఆపిల్-సర్టిఫైడ్ MagSafe ఛార్జర్‌లకు పరిమితం అయింది. Qi-సర్టిఫైడ్ వైర్‌లెస్ ఛార్జర్‌లు 7.5W వరకు సపోర్టును కలిగి ఉన్నాయి. కొత్త Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్ మాడ్యూల్‌లు MagSafe మాడ్యూల్‌లో మూడింట ఒక వంతు కన్నా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి.

OEMS తమ ప్రొడక్టును ధృవీకరించేందుకు ఆపిల్ ‘MFi’ (iPhone) ప్రోగ్రామ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. యూజర్లకు తక్కువ ధరకు స్పీడ్ వైర్‌లెస్ ఛార్జింగ్ అందించడంలో సాయపడుతుంది. రాబోయే ఐఫోన్‌లలో ఆపిల్ వేగవంతమైన ఛార్జింగ్ స్పీడ్‌ను అందిస్తుందో లేదో చూడాలి. గత ఈవెంట్‌ల ప్రకారం చూస్తే.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను భారత్ సహా ఇతర మార్కెట్లలో లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు.

Read Also : Samsung Galaxy F54 : శాంసంగ్ గెలాక్సీ F54 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, ఫీచర్లు లీక్..!