Apple iPhone: ఐఫోన్ యూజర్లకు పెద్ద సమస్యే వచ్చిందే.. పరిష్కారం ఏంటీ?

ఐఫోన్లు తయారీదారు యాపిల్‌.. ఐఫోన్‌ 6ఎస్‌ మోడల్‌ నుంచి తర్వాతి వెర్షన్‌ల కోసం ఈ మధ్యే ఐవోఎస్‌ 15 అప్‌డేట్‌ తీసుకుని వచ్చింది.

Apple iPhone: ఐఫోన్ యూజర్లకు పెద్ద సమస్యే వచ్చిందే.. పరిష్కారం ఏంటీ?

Mayor Bonthu Rammohan

Apple iPhone: ఐఫోన్లు తయారీదారు యాపిల్‌.. ఐఫోన్‌ 6ఎస్‌ మోడల్‌ నుంచి తర్వాతి వెర్షన్‌ల కోసం ఈ మధ్యే ఐవోఎస్‌ 15 అప్‌డేట్‌ తీసుకుని వచ్చింది. 2021 సెప్టెంబరు 20వ తేదీ నుంచి ఈ అప్‌డేట్‌ని యూజర్లకు అందిస్తోంది యాపిల్ సంస్థ. ఈ అప్‌డేట్‌ చేసుకున్న వెంటనే యూజర్లకు ‘ఫోన్‌ మొమరీ ఫుల్‌’ అనే పాప్‌-అప్‌ చూపిస్తోండడం ఇప్పుడు సమస్యగా మారింది.

‘స్టోరేజ్‌ ఫుల్‌’ అనే బగ్ ఇప్పుడు యాపిల్ యూజర్లను ఇబ్బందులు పెడుతూ ఉండగా.. ఇదే విషయంలో వేల మంది ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, ఈ సమస్యపై కంగారుపడాల్సిన అవసరం లేదని యాపిల్‌ కంపెనీ చెబుతోంది.

“iPhone storage almost full” అనే బగ్‌ పరిష్కారం కోసం ఫోన్‌ రీస్టార్ట్‌ చేస్తే సరిపోతుందని చెబుతున్నారు. కానీ, ఫోన్ ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా సమస్య తీరట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు యూజర్లు. కొందరికి ఫోన్‌లో ఉన్న స్పేస్‌ కంటే, ఎక్కువ స్టోరేజ్‌ చూపిస్తోందని, ఐఫోన్లతో పాటు ఐప్యాడ్‌లలోనూ ఇదే సమస్య కనిపిస్తోందని చెబుతున్నారు. సమస్య గురించి ప్రస్తావిస్తున్న వాళ్లందరికీ ఓపికగా రిప్లైలు ఇస్తుంది యాపిల్‌ సంస్థ. అయితే, సమస్య పరిష్కారం మాత్రం ఇంకా కనుగొనలేదు.

ఐవోఎస్‌ 15 వెర్షన్‌ అప్‌డేట్‌ చేసుకున్నవారి ఐఫోన్లలో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ సరిగా పని చేయట్లేదు అనే కంప్లైంట్ కూడా వస్తుంది. వీడియోలు, స్టోరీల విషయంలో సౌండ్‌ పని చేయట్లేదని చెబుతున్నారు. యాపిల్‌ సపోర్ట్‌ కమ్యూనిటీ ఫోరమ్‌లోనూ స్టోరేజ్‌ బగ్‌ ఇష్యూ తలెత్తినట్లు చెబుతున్నారు.