iPhones Update : ఆపిల్ ఐఫోన్లలో కొత్త iOS 16.5 అప్‌డేట్.. మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు.. ఇప్పుడే చెక్ చేసుకోండి..!

Apple iPhones : ఆపిల్ కొత్త ఐఫోన్ (iOS 16.5) అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. ఐఫోన్ యూజర్లు తమ ఐఫోన్లలో Settings > General > Software update ద్వారా చెక్ చేసుకోవచ్చు.

iPhones Update : ఆపిల్ ఐఫోన్లలో కొత్త iOS 16.5 అప్‌డేట్.. మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు.. ఇప్పుడే చెక్ చేసుకోండి..!

Apple iPhones now receiving iOS 16.5 software update, check all new features

iPhones Update iOS 16.5 software : ప్రపంచ ఐకానిక్ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌ (iPhones)ల కోసం కొత్త iOS 16.5 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. ఈ కొత్త సిస్టమ్ అప్‌డేట్ iPhone 8, తదుపరి ఐఫోన్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త iOS అప్‌డేట్ ద్వారా కొన్ని బగ్‌లను ఫిక్స్ చేస్తుంది. ఆపిల్ ఐఓఎస్ (iOS 16.5) LGBTQ+ కమ్యూనిటీ, కల్చర్ లాక్ స్క్రీన్ కోసం కొత్త ప్రైడ్ సెలబ్రేషన్ వాల్‌పేపర్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Apple iPad, Apple Watches, Macs, Apple TVల కోసం కొత్త అప్‌డేట్‌లను కూడా రిలీజ్ చేస్తోంది. వచ్చే జూన్‌లో ఆపిల్ WWDC ఈవెంట్‌కు వారాల ముందు కొత్త అప్‌డేట్స్ వస్తాయి. కంపెనీ తన హార్డ్‌వేర్ నెక్స్ట్ జనరేషన్ OSని ఆవిష్కరిస్తుంది.

Read Also : iPhones Battery : మీ ఐఫోన్ బ్యాటరీని రీప్లేస్ చేయలా? వారంటీ ఉందో లేదో చెక్ చేసుకోండి.. లేదంటే భారీగా చెల్లించాల్సిందే..!

ఆపిల్ స్పోర్ట్స్ ట్యాబ్‌లోని స్కోర్‌ కార్డ్‌లతో ఆపిల్ న్యూస్‌ (Apple News)ను మరింత మెరుగుపరుస్తుంది. ‘ఆపిల్ న్యూస్‌లోని (My Sports Score), ఫిక్చర్ కార్డ్‌ (fixture cards)లు యూజర్లను నేరుగా నిర్దిష్ట మ్యాచ్ లకు సంబంధించి పూర్తి వివరాలను అందిస్తాయనిని కంపెనీ పేర్కొంది. దేశంలో ఆఫిల్ న్యూస్ అందుబాటులో లేనందున, భారత్‌లో ఐఫోన్ యూజర్లు ఈ కొత్త అప్‌డేట్ ప్రత్యేకించి అవసరం లేదని చెప్పాలి.

Apple iPhones now receiving iOS 16.5 software update, check all new features

iPhones Update now receiving iOS 16.5 software update, check all new features

ఐఓఎస్ (IOS 16.5) స్పాట్‌లైట్‌తో ఇతర బగ్ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. కొంతమంది ఐఫోన్ యూజర్లు ఈ ఫీచర్ ఉపయోగించలేరు. ఆపిల్ కార్ ప్లే, స్క్రీన్ టైమ్ టూల్‌కి సంబంధించిన ఇతర సమస్యలు కూడా ఈ అప్‌డేట్‌తో ఫిక్స్ చేసింది. అన్ని ప్రాంతాలలో లేదా అన్ని ఆపిల్ డివైజ్‌ల్లో కొన్ని ఫీచర్‌లు అందుబాటులో ఉండకపోవచ్చని అధికారిక చేంజ్‌లాగ్ తెలిపింది. దేశీయ నియమ, నిబంధనలకు అనుగుణంగా ఆయా ఫీచర్లను అందించే వీలుండదు.

ఆపిల్ కొత్త iOS అప్‌డేట్‌ను రిలీజ్ చేయగానే.. ఐఫోన్ యూజర్లు Settings > General > Software Updates వెళ్లడం ద్వారా చెక్ చేయవచ్చు. ఐప్యాడ్‌లు, మ్యాక్‌లలో అప్‌డేట్‌లను చెక్ చేసేందుకు అదే ప్రాసెస్ పనిచేస్తుంది. అదే సమయంలో, ఆపిల్ జూన్ 5న జరగబోయే WWDC 2023లో iPadOS 17, iOS 17లను ఆవిష్కరించడానికి రెడీ అవుతోంది. అదే ఈవెంట్‌లో, మొదటి AR/VR లేదా మిక్స్‌డ్-రియాలిటీ హెడ్‌సెట్, డెడికేటెడ్ OSని ప్రదర్శిస్తుందని భావిస్తున్నారు. మిక్స్డ్-రియాలిటీ హెడ్‌సెట్ ఆపిల్ AR గ్లాసెస్‌కు స్టెప్ స్టోన్ అని చాలా నివేదికలు సూచించాయి.

Read Also : iPhone 12 mini Offer : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. రూ.20,999లకే సొంతం చేసుకోండి.. అద్భుతమైన ఆఫర్.. డోంట్ మిస్..!