Apple Users : ఆపిల్ యూజర్లకు అలర్ట్.. జూన్‌ 1లోపు ఈ రెండింట్లోకి మారండి.. ఎందుకంటే?

Apple UPI Payments : యాప్ స్టోర్‌లో యూజర్లు పేమెంట్లు చేసే విధానాన్ని Apple మారుస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం.. యూజర్లు ఇకపై యాప్ స్టోర్‌లో కొనుగోళ్లు లేదా మెంబర్‌షిప్ కోసం తమ క్రెడిట్ డెబిట్ కార్డ్‌లను ఉపయోగించడం కుదరదు.

Apple Users : ఆపిల్ యూజర్లకు అలర్ట్.. జూన్‌ 1లోపు ఈ రెండింట్లోకి మారండి.. ఎందుకంటే?

Apple Is Reminding Users To Switch To Upi Payments, Net Banking Before June 1, Here Is Why

Apple UPI Payments : యాప్ స్టోర్‌లో యూజర్లు పేమెంట్లు చేసే విధానాన్ని Apple మారుస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం.. యూజర్లు ఇకపై యాప్ స్టోర్‌లో కొనుగోళ్లు లేదా మెంబర్‌షిప్ కోసం తమ క్రెడిట్ డెబిట్ కార్డ్‌లను ఉపయోగించడం కుదరదు. ఆపిల్ తమ యూజర్ల కార్డ్ వివరాలను స్టోర్ చేయదు. ఫలితంగా.. ఆపిల్ యూజర్లు Google Pay లేదా PayTm వంటి UPI ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి మాత్రమే పేమెంట్లు చేయగలరు. జూన్ 1 లోపు UPI పేమెంట్లు, నెట్ బ్యాంకింగ్‌కు మారాలని ఆపిల్ తమ యూజర్లకు గుర్తు చేస్తోంది. జూన్ 1 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల దృష్ట్యా.. యాప్ స్టోర్ లేదా ఇతర Apple సర్వీస్‌లలో కొనుగోళ్లు లేదా సబ్‌స్క్రిప్షన్‌ల కోసం క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించలేరని ఆపిల్ తమ యూజర్లకు గుర్తుచేస్తోంది.

Apple మీ కార్డ్ వివరాలను ఇక స్టోర్ చేయదు :
— మీ పేమెంట్ సేఫ్.. మీ డేటా రక్షణే మా ప్రాధాన్యత అంటూ ఆపిల్ ఈమెయిల్‌లో పేర్కొంది.
– జూన్ 1 నుంచి పేమెంట్స్ చేయడానికి, మీ UPI లేదా నెట్ బ్యాంకింగ్ అకౌంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది.
– కార్డ్ వివరాలను తొలగించాలి.

Apple Is Reminding Users To Switch To Upi Payments, Net Banking Before June 1, Here Is Why (1)

Apple Is Reminding Users To Switch To Upi Payments, Net Banking Before June 1, Here Is Why

ఎలాగంటే.. ఇదిగో ప్రాసెస్ :
— మీ iPhone లేదా iPadలో Settings Menuలోకి వెళ్లండి
— స్క్రీన్ పైభాగంలో కనిపించే Apple IDపై నొక్కండి.
— పేమెంట్ షిప్పింగ్ ఆప్షన్ ఎంచుకోండి.
– మీ Apple ID ఆధారాలను నమోదు చేయండి.
– ఆపిల్ మిమ్మల్ని సైన్ ఇన్ చేయమని అడుగుతుంది.
— కొత్త పేమెంట్ మోడ్‌, యాడ్ పేమెంట్ మెథడ్‌పై నొక్కండి.
— Apple మీ UPI లేదా RuPay వివరాలను యాడ్ చేయొచ్చు.
— మీరు Edit Optionపై నొక్కడం ద్వారా ఇప్పటికే ఉన్న పేమెంట్ మెథడ్ కూడా Remove చేయొచ్చు.
— మీరు మీ Apple IDకి మల్టీపుల్ పేమెంట్స్ మోడ్‌లను యాడ్ చేసుకోవచ్చు.

మీరు మీ Apple IDకి ఫండ్స్ యాడ్ చేయడం ద్వారా పేమెంట్ చేయవచ్చు.

– మీ iPhone, iPad లేదా Macలో Apple యాప్ స్టోర్‌కి వెళ్లండి.
– స్క్రీన్‌పై టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న మీ ఫోటోను నొక్కండి.
– అకౌంట్‌కు డబ్బును యాడ్”ని నొక్కండి.
– మీరు మీ అకౌంట్‌కు యాడ్ చేయాల్సిన మొత్తాన్ని ఎంచుకోవచ్చు.
– మీ పేమెంట్ వివరాలను ఆన్-స్క్రీన్ సూచనలపై నొక్కండి.

Read Also : Apple Payments India : ఆర్బీఐ కొత్త రూల్స్.. ఇండియాలో ఆపిల్ పేమెంట్లకు బ్రేక్..!