Apple iPhone USB Charger : ఆపిల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఐఫోన్లలో 2024 వరకు USB Type-C ఛార్జర్ రానట్టే.. ఎందుకో తెలుసా?

Apple iPhone USB Charger : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఐఫోన్లతో సహా అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో USB Type- C పోర్ట్‌ను చేర్చేందుకు యూరోపియన్ యూనియన్ (EU) గడువు విధించింది.

Apple iPhone USB Charger : ఆపిల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఐఫోన్లలో 2024 వరకు USB Type-C ఛార్జర్ రానట్టే.. ఎందుకో తెలుసా?

Apple may not launch iPhone with USB C charger until 2024

Apple iPhone USB Charger : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఐఫోన్లతో సహా అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో USB Type- C పోర్ట్‌ను చేర్చేందుకు యూరోపియన్ యూనియన్ (EU) గడువు విధించింది. EU తాజా ఆదేశాల ప్రకారం.. 2024 డిసెంబర్ 28 నుంచి ఈయూ సభ్య దేశాలలో విక్రయించే iPhoneలతో సహా అన్ని స్మార్ట్‌ఫోన్లలో సాధారణ USB Type-C ఛార్జర్‌ను కలిగి ఉండాలి.

ఈ ఏడాది జూన్‌లో EU చట్టసభ సభ్యులు EUలో విక్రయించే అన్ని స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, కెమెరాలు సాధారణ USB Type-C పోర్ట్‌తో రావాలని చట్టానికి అంగీకరించారు. ఈయూ నుంచి వచ్చిన కొత్త ఆదేశాల ప్రకారం.. 2024లో ప్రారంభమైన iPhone మోడల్‌లు, iPhone 16 సిరీస్‌లు లైటనింగ్ కేబుల్ నుంచి USB Type-C పోర్ట్‌కి మారాలని సూచించింది.

2023లో లాంచ్ అయ్యే ఐఫోన్‌లు, ఎక్కువగా iPhone 15 అని Type-C ఛార్జర్‌కి మారడం చాలా కష్టమని నివేదికలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా, ఈ రోజుల్లో విక్రయించే చాలా Android డివైజ్‌లు, USB Type-Cని అందిస్తున్నాయి. ఈయూ ఆదేశాలతో Android ఫోన్ తయారీదారులపై పెద్దగా ప్రభావం చూపదు. మైక్రో USB డివైజ్‌లు సైతం పూర్తిగా Type-Cకి మారే ప్రక్రియలో ఉన్నాయి.

Apple may not launch iPhone with USB C charger until 2024

Apple may not launch iPhone with USB C charger until 2024

Read Also : iPhones Without Charger: యాపిల్ సంస్థకు బ్రెజిల్ షాక్.. చార్జర్లు లేకుండా ఫోన్లు అమ్ముతున్నందుకు ఫైన్.. అమ్మకాలపై నిషేధం

ఈయూ ఆదేశాలపై ఆపిల్ రెస్పాన్స్ ఇదే.. :

Apple ప్రస్తుతం ఐఫోన్లలో లైటనింగ్ ఛార్జింగ్ పోర్ట్‌ను ఉపయోగిస్తుంది. ఈయూ ఆపిల్ సంస్థకు ముఖ్యమైన మార్కెట్ కావడంతో చివరికి కట్టుబడి కావాల్సి వస్తోంది. అక్టోబర్‌లో వాల్ స్ట్రీట్ జర్నల్ టెక్ లైవ్ కాన్ఫరెన్స్‌లో ఆపిల్ ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్రెగ్ జోస్వియాక్ మాట్లాడుతూ.. Apple కంపెనీ ఈయూ ఆదేశాలకు కట్టుబడి ఉంటుందని అన్నారు.

ఈయూ ఆదేశానుసారం Apple USB Type- C పోర్ట్‌కి మారుతుందా అని అడిగినప్పుడు.. మాకు వేరే మార్గం లేదని జోస్వియాక్ చెప్పారు. భారత ప్రభుత్వం అన్ని స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల కోసం సాధారణ ఛార్జర్ విధానానికి అనుగుణంగా అవకాశాలను అన్వేషిస్తోంది. భారత్‌లో సంవత్సరానికి ఉత్పత్తి చేసే e-వ్యర్థాలను తగ్గించడం లక్ష్యంగా చర్య తీసుకోనుంది.

భారత్‌లో ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నుంచి ASSOCHAM-EY నివేదిక ప్రకారం.. దేశంలో 5 మిలియన్ టన్నుల e-వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. చైనా, యునైటెడ్ స్టేట్స్ కన్నా భారత్‌లోనే ఎక్కువగా ఉంటుంది. యూనివర్సల్ ఛార్జర్ విధానం అమలులోకి రావడంతో.. యూజర్లు కొత్త డివైజ్ కొనుగోలు చేసిన ప్రతిసారీ ప్రత్యేక ఛార్జర్‌లను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.

e-వ్యర్థాలను తగ్గించడంలో సహాయపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. గత కొన్ని నెలలుగా యూనివర్సల్ ఛార్జర్ విధానం గురించి ప్రభుత్వం ఇప్పటికే రెండు అంతర్గత సమావేశాలను నిర్వహించింది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లతో సహా స్మార్ట్ డివైజ్‌లకు మాత్రమే సాధారణ ఛార్జ్ నియమాన్ని తీసుకురావాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Apple iPhones Seized : ఆపిల్‌కు షాకిచ్చిన బ్రెజిల్.. ఐఫోన్లతో ఛార్జర్లను అమ్మడం లేదని రిటైల్ స్టోర్లలో వందలాది ఐఫోన్లు సీజ్..!