ఆపిల్ నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ‘సెల్ఫ్ డ్రైవింగ్’ టెక్నాలజీ

ఆపిల్ నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ‘సెల్ఫ్ డ్రైవింగ్’ టెక్నాలజీ

Apple first car in 2024 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఫస్ట్ ఎలక్ట్రిక్ కారుపై ఫోకస్ చేస్తోంది. 2024నాటికి ఈ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కారును ఉత్పత్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్స్, బ్యాటరీ టెక్నాలజీతో ఈ కారు మోడల్ డిజైన్ చేయనుంది. ఆపిల్ నుంచి ఫస్ట్ ప్యాసింజర్ కారు రాబోతుందా అనేదానిపై క్లారిటీ లేదు. కానీ, ఆపిల్ మాత్రం ఫస్ట్ ప్యాసింజర్ కారును ఉత్పత్తి చేయబోతుందంటూ సంకేతాలు వస్తున్నాయి.

గతంలో కూడా ఆపిల్ కార్లను తయారు చేసేందుకు ప్లాన్ చేసింది. కానీ, ఆ ప్రణాళికలను వెనువెంటనే నిలిపివేసింది. 2015లో కూడా ఆపిల్ ఓ కొత్త కారును డెవలప్ చేయబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ, 2016లో దాని ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కారును రూపొందించాలని భావించింది ఆపిల్ టీమ్. ఇప్పుడు అదే ప్రణాళిలతో రీఫోకస్ చేయడంపై ఆపిల్ టీం దృష్టిపెట్టునట్టుగా కనిపిస్తోంది.

ఈ ఎలక్ట్రిక్ కారు తయారీకి అందించే సాఫ్ట్ వేర్‌కు లైసెన్స్ పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాదిలో ఆపిల్ కారు ఉత్పత్తి కోసం తీసుకున్న టీమ్‌లో 200 మందిని కంపెనీ తొలగించింది. కానీ, ఇప్పుడు ఆపిల్ కొత్త టెక్నాలజీ ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్ కోసం ఫోకస్ చేస్తోంది.

రాయిటర్స్ ప్రకారం.. 2024 నాటికి ఆపిల్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. మహమ్మారి సంబంధించి పలు అంశాల్లో ఆలస్యం కారణంగా.. 2025లో లేదా ఆ తర్వాత ఏళ్లలో వెహికల్ తయారీ పూర్తి కానున్నట్టు తెలిపింది.

సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో LIDAR సిస్టమ్స్ కూడా అందిస్తోంది. ఆపిల్ బ్యాటరీ టెక్నాలజీ కూడా MonoCell డిజైన్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ కారు తయారీ ప్లానింగ్ పై ఆపిల్ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఎలక్ట్రానిక్ ఆపిల్ కారు రోడ్డుపై రావాలంటే రెగ్యులేటరీ పరంగా అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే టెస్లా వంటి కొన్ని కార్లలో కూడా అడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ డ్రైవింగ్ ఆఫర్ చేస్తోంది.