Apple Watch: యాపిల్ వాచ్‌లో టెంపరేచర్‌తో పాటు బాడీలో గ్లూకోజ్

అభిమానుల కోరికో.. ఆన్ లైన్లో వచ్చిన రూమర్సో కానీ, యాపిల్ వాచ్ లో యాడ్ చేసేందుకు కొత్త ఫీచర్ల ఐడియా ఇచ్చారు నెటిజన్లు. స్మార్ట్ వాచ్ తో బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ను కాలిక్యులేట్ చేసే టెక్నిక్ కావాలని అడిగారు.

Apple Watch: యాపిల్ వాచ్‌లో టెంపరేచర్‌తో పాటు బాడీలో గ్లూకోజ్

Apple Watch May Get Blood Glucose Temperature Monitoring

Apple Watch: అభిమానుల కోరికో.. ఆన్ లైన్లో వచ్చిన రూమర్సో కానీ, యాపిల్ వాచ్ లో యాడ్ చేసేందుకు కొత్త ఫీచర్ల ఐడియా ఇచ్చారు నెటిజన్లు. స్మార్ట్ వాచ్ తో బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ ను కాలిక్యులేట్ చేసే టెక్నిక్ కావాలని అడిగారు. ఈ ఫీచర్లతో కొత్త ఫోన్ వచ్చేందుకు రెడీ అయిపోయింది. కాకపోతే దీని లాంచింగ్ మాత్రం ఈ సంవత్సరం జరిగేలా లేనట్లు సమాచారం.

ఈ యాపిల్ వాచ్ వేరియంట్ లో డిజైన్, కనెక్టివిటీలను ఇంప్రూవ్ చేశారు. వాటితో పాటు కొత్త స్క్రీన్ ను యాడ్ చేశారు. యాపిల్ వాచ్ సిరీస్ 7, 2021గా పిలిచే మోడల్ ను సన్నని బెజెల్ తో దీనిని ప్లాన్ చేశారు. ఈ డిస్ ప్లే చాలా ఫ్లాట్ గా ఉండటమే కాక ఓవరాల్ స్క్రీన్ ఏరియా మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్ లాగే ఉండనుంది.

కొత్త లామినేషన్ టెక్నిక్ తీసుకొస్తూ.. డిస్ ప్లేకు, ఫ్రంట్ కవర్ కు మధ్య దూరాన్ని తగ్గించే పనిలో పడ్డారు. ఇక ఈ వాచ్ లో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ కెపబిలిటీతో పాటు శరీర ఉష్ణోగ్రతను కాలిక్యులేట్ చేసే ఫీచర్ కూడా యాడ్ చేస్తున్నారు. ముందుగా 2022లో టెంపరేచర్ సెన్సార్ తో ప్లాన్ చేసిన యాపిల్.. బ్లడ్ గ్లూకోజ్ కు మాత్రం కాస్త ఎక్కువ సమయమే కావాలంటోంది.